ఎవడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడేరా.. పండు గాడు! ఇది ఓ మూవీలో మహేష్ బాబు డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేసి చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిత్యం ఏదో ఒక విషయంపై కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు కేసీఆర్! ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణలో భారీ భూ కబ్జా ఒకటి తెరమీ దకి వచ్చింది. ఇప్పటి వరకు అనేక […]
Tag: KCR
కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనాలకు మారుపేరు. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజకీయాలను, సంచలన వ్యాఖ్యలకు మారు పేరు అయిన వీరిపై రాజకీయంగా మరో సంచలన రూమర్ హల్‌చల్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలోనే పీసీసీ చీఫ్ పదవి తమదే అన్నారు. ఉత్తమ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా నడుపుతారని ప్రశ్నించారు.. ప్రతిష్టాత్మకంగా జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని పక్కా పథకంలో ఉన్నారు కమల నాథులు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు మద్దతు పలుకుతూ.. ఇద్దరూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలోనే పరిస్థితి అర్ధం కావడం లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఒకింత బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్రమంలోనే 2019లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు పట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]
ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!
ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్రచారం అన్నట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫస్ట్ స్టేట్ చేస్తానని ఇక్కడి సీఎం చంద్రబాబు.. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం సొమ్మును తమ ఇష్టానుసారం ఖర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ […]
తెలంగాణ భూ కుంభకోణంలో కేసీఆర్ మంత్రి
తెలంగాణలో భూ అక్రమార్కులు చెలరేగారని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డగోలుగా సహాయం చేశారని వార్తలు అందాయి. ఈ వ్యవహారంలో టీ మంత్రుల హస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్.. వెంటనే ఏసీబీని రంగంలోకి దింపారు. అసలు విషయం ఏంటో అంతు తేల్చాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని, అవినీతిలో పేట్రేగిపోయారని […]
బీజేపీలోకి కేసీఆర్ డాటర్
ఎలాగైనా సరే.. తెలంగాణలో పాగా వేయాలని సర్వ విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేనని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వచ్చిన బీజేపీ సారథి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక పథకాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్కటి కూడా అంది పుచ్చుకోవడం లేదని విమర్శించారు. అదే సమయంలో […]
రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?
తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. […]
తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఉద్యమం రెడీనా?
తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై ముప్పేట దాడి పెరుగుతోంది. విపక్షాల మాటేమోగానీ, కేసీఆర్‌కు సన్నిహితుడు, ఉద్యమ సమయంలో అన్నీతానై సలహాలు, సూచనలు ఇచ్చి.. తెలంగాణ సాధనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రొఫెసర్ కోదండరాం ఇప్పడు కేసీఆర్‌కు పక్కలో బల్లెం మాదిరిగా తయారయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పరిపాలనా కొనసాగిస్తున్నా ఇప్పటికీ సామాన్యుల సమస్యలు అలాగే ఉన్నాయని, బంగారు తెలంగాణ సాధ్యం కాలేదని కొదండరాం ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇంత కష్టబడి ప్రత్యెక తెలంగాణ సాధించుకుంటే పెత్తందారి వ్యవస్థలో […]
కేసీఆర్‌కి తలసాని పొగడ్తల వెనుక చాలా స్టోరీ ఉందే!!
పాలిటిక్స్ అన్నాక అధినేతని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం కామనే! అయితే, ఇప్పుడు తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో పొగిడేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు, చంద్రుడు అనడం కాకుండా.. కేసీఆర్‌ను ఏకంగా గొల్ల, కురుమల కులాలు కుల దైవంగా భావించి బీరప్ప, మల్లన్నల ఇద్దరి స్వరూపమే కేసీఆర్ అంటూ.. తలసాని బాజా భజాయించాడట! ఇప్పుడు ఈ విషయంపైనే రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. ఊరక పొగడరు మహాను భావులు అన్నట్టు.. కేసీఆర్‌పై తలసాని […]