టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల దాఖలుకు ఈరోజే (మంగళవారం) చివరి రోజు కావడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో బీపీ పెరిగిపోతోంది. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపిక కాని వారికి సమాధానం ఏం చెప్పాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచీ ఇదే విషయంపై కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఆఖరి రోజు వరకు ఎంపిక చేయకపోవడంతో నాయకులు టెన్షన్ తో అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో […]
Tag: KCR
కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!
కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. […]
జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!
వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ […]
ఎవరికీ కలిసిరాని వైద్యశాఖ.. మరి హరీశ్ రావుకు కలిసొస్తుందా?
తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అంటేనే నాయకులు వామ్మో.. వద్దులే అని ఆ పదవికి దూరంగా ఉంటున్నారు. ఎవరూ ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఆ బాధ్యతను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారట. ఇక పనిభారం పెరగడంతో బాధ్యతను అల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. అయితే.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.. ఎందుకంటే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన […]
తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. […]
సారూ.. ఇందిరా పార్కు మిమ్మల్ని చూసి నవ్వుతోంది
ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తారు.. ఎక్కడంటే అక్కడ కాదు.. ధర్నా చౌక్.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు.. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎందరో..ఇంకెందరో ఇందిరాపార్కు వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లారు.. తీసుకెళుతున్నారు కూడా. ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం […]
రాళ్లేసిన ప్రాంతంలోనే.. పూలు వేయించుకున్న ఈటల
ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో విభేదాలొచ్చి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈటలను ఒంటరి చేయాలని చూసింది. పార్టీలో ఉన్నపుడు మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విచిత్రమేమంటే ఆయన అలా రాజీనామా చేసిన కొద్ది సేపటికే […]
అసలు ’వరి‘ని కొనేదెవరు? ..ముందు ఇది తేల్చండి
తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కింది. రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే..కాదు.. కేంద్ర ప్రభుత్వమే ఆ పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుపడుతోంది. దీంతో రాష్ట్రంలో వరి కొనుగోలు సంగతి పక్కకువెళ్లి టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తే.. శుక్రవారం టీఆర్ఎస్ కూడా నిరసన బాట పడుతోంది. ఒకవైపు రైతులు కొనుగోళ్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే.. బాధ్యతగల […]
’వైద్యం‘పై హరీశ్ మార్క్..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, సీనియర్ నాయకుడు, మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం అందరికీ తెలుసు. పార్టీ విధేయుడిగా.. మామకు ఇష్టమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఉద్యమ సమయంలోనూ హరీశ్ రావు కీలకలంగా పనిచేశారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తో విభేదాలున్నాయని మీడియాలే అనేకసార్లు వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. అయితే వాటిని హరీశ్ కానీ,పార్టీ కాని పట్టించుకోలేదు. ఖండించలేదు. ఎవ్వరేమనుకున్నా హరీశ్ కు ఉన్న స్థానం ఆయనకుంది. అది హరీశ్ […]