మొత్తానికి మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎప్పటినుంచో ఆయన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. గత ఎన్నికల్లోనే జగన్..మర్రికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు. 2004లో కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 200 ఓట్ల తేడాతో గెలిచిన మర్రి..తర్వాత […]
Tag: Jagan
ఎమ్మెల్సీల్లో బీసీ మంత్రం..ఓట్లు రాలుతాయా?
ఒకప్పుడు బీసీ వర్గాలు టీడీపీకి అండగా ఉన్న విషయం తెలిసిందే. అసలు బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీలు అనే పరిస్తితి ఉండేది. అలా బీసీలు మెజారిటీ సంఖ్యలో టిడిపికి ఓటు వేశారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారింది. చంద్రబాబు కాపు రిజర్వేషన్ల పేరుతో కాపుల వైపు మొగ్గు చూపడంతో..టీడీపీకి బీసీలు దూరం జరిగారు. ఇటు జగన్‌కు సపోర్ట్ గా నిలిచారు. మెజారిటీ బీసీలు వైసీపీకి ఓటు వేశారు. అప్పటినుంచి బిసిలని ఆకర్షించాలనే జగన్ ప్లాన్ ఉంటుంది. […]
చింతలపూడిని వైసీపీ వదులు కోవాల్సిందేనా..?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ […]
జగన్ కొత్త ట్విస్ట్..మంత్రివర్గంలో మార్పులు.!
ఏపీ మంత్రివర్గంలో ట్విస్ట్ ఉంటుందా…మరోసారి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? అంటే ఇటీవల మంత్రివర్గం మార్పులపై చర్చ నడుస్తున్న సందర్భంలో చిన్న మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మండలి రద్దు అని చెప్పి ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి […]
మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!
అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టిడిపి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి […]
ఎమ్మెల్సీ ఆశ..వైసీపీలోకి జంపింగులు.!
ఏపీలో మరోసారి పదవుల పండుగ నడుస్తోంది. 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహులు వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. 9 స్థానిక సంస్థల కోటాలో, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలో ఖాళీ ఉన్న 9 స్థానాలు డౌట్ లేకుండా వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైసీపీదే హవా ఉంది. ఇక గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కునే […]
గవర్నర్ విషయంలో వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు ?
ఏపీ గవర్నర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ […]
ఎమ్మెల్యేలకు క్లాస్..ఆ ఇద్దరి పేర్లు హైలైట్!
మరొకసారి జగన్ వర్క్ షాప్ పెట్టి..వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎవరైతే గడపగడపకు సరిగ్గా తిరగడం లేదో..వారి పేర్లు సెపరేట్ గా చెప్పి మరీ క్లాస్ ఇచ్చారు.ఇకనైనా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకుంటరాని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే గతంలో మాదిరిగా ఈ సారి జగన్ సీరియస్ వార్నింగ్‌లు పెద్దగా ఇవ్వలేదు…కానీ కొంతమేర ఎమ్మెల్యేలని మందలించారు. తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల […]
మైలవరం పంచాయితీ: జోగికి షాక్ తప్పదా?
రాష్ట్రంలో పలు స్థానాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సీట్ల కోసం ఫ్యాన్స్ మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైలవరం పంచాయితీని జగన్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వసంతని […]