ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్‌ కొట్టివేత..!?

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డైరీలో అవకతవకలు జరిగిన సంగం డెయిరీ కేసులో అరెస్టైన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ చేపట్టింది హైకోర్టు. రిమాండ్‌ అంశం పై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది హైకోర్టు. అనిశా కోర్టు విధించిన రిమాండ్‌ పై హైకోర్టులో […]

హైకోర్టు వివాదంలో ‘ఇండియన్ 2’ సినిమా..?

భారతీయుడు 2 చిత్రం వివాదం కోర్టు కి ఎక్కింది. లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టు ఇండియన్ 2 మూవీ పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా చేయటం సరి కాదంటూ కోర్టుని ఆశ్రయించింది. శంకర్ పారితోషికంలో కూడా చాలా వరకూ పే చేశామని లైకా కోర్టుకు తెలిపింది. గురువారం నాడు విచారణ జరిగింది. ఇరు వర్గాలు కూర్చొని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హైకోర్టు చెప్పింది.ఇండియన్ 2ని గత ఏడాది మార్చికే పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికీ పూర్తి […]

తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]

సీఎం కేసీఆర్ సభకు తొలిగిన అడ్డంకులు..!?

నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలిగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సభ మామూలుగానే అనుకున్నట్లు కొనసాగనుంది. సభను రద్దు చేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలుపాటించకుండా, తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.కానీ విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదు. ఇదిలా […]

బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థన చేయగా అందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 8 వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెబుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత […]

జగన్ కి హైకోర్టు మరో ఝలక్

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో మ‌రో షాక్ త‌గిలింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జ‌గ‌న్ గ‌తంలో త‌న‌పై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్‌స్టేష‌న్‌లో న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని హైకోర్టులో క్యాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఈ పిటీష‌న్ ప‌రిశీలించిన హైకోర్టు జ‌గ‌న్‌కు షాక్ ఇస్తూ ఆ పిటీష‌న్‌ను తోసిపుచ్చింది. దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్ ప్ర‌మాదం జ‌రిగినప్పుడు ఆ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్ అధికారుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోప‌ణ‌లు […]

కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ త‌గులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాష్ట్ర భూసేక‌ర‌ణ చ‌ట్టంపై హైకోర్టు అక్షింత‌లు వేసింది. ఏక‌ప‌క్షంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు రైతుల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు దీని అమ‌లుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ స‌ర్కారుకు శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత త‌న దంటూ ప్ర‌త్యేక పాల‌న ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే […]

త‌న‌కు తానే బుక్ అయిన చంద్ర‌బాబు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని న‌మ్ముకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిపై అటు విప‌క్షాలు, ఇటు అధికారుల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న మంత్రి వ‌ర్గం మీడియా స‌హా ప్ర‌తి ఒక్క‌రిపైనా ఎద‌రు దాడినే కొన‌సాగించారు. స్విస్ ఛాలెంజ్ ప్ర‌క్రియ‌ను అద్భుతంగా కొనియాడారు. మ‌న‌దేశంలో ఇంతటి సామ‌ర్ధ్యం, నైపుణ్యం ఉన్న సంస్థ‌లు, వ్య‌క్తులు లేవ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఎట్టిప‌రిస్థితిలోనూ స్విస్ ఛాలెంజ్‌లోనే రాజ‌ధాని […]

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా..!

రాజ‌ధాని హైద‌రాబాద్‌లో చెరువులు, న‌ల్లాల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేసిన వారి తాట తీస్తామ‌ని ఇటీవ‌ల కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ మునిగిపోయిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో సొంత పార్టీ నేత‌లు అయినా స‌రే..ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కేసు విష‌యంలోనే అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్‌కి హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అయితే, ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో కాకుండా త‌న సొంత […]