‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]

తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]

కాంగ్రెస్సోళ్లు.. అంతన్నారు.. ఇంతన్నారు.. మరి..

వందేళ్ల చరిత్రగల పార్టీ.. ఇదే ఆ పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పుకునే మాటలు.. అంతే.. కేవలం మాటలే.. వారి మాటలు మాత్రమే గొప్ప.. చేతలు అంతంతే.. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇదేం పార్టీనే.. అదే కాంగ్రెస్ పార్టీ.. పార్టీలో కార్యకర్తలు తక్కువ.. నాయకులు ఎక్కువ.. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. ఏమైనా అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చిన తరువాత పార్టీలో అంతర్గతంగా […]

కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో ఊహించని మార్పులు వస్తాయని.. జనాల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేసిన అధిష్టానానికి నిరాశే ఎదురైంది. దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. ఇక హుజూరాబాద్ లో అయితే దారుణం.. కేవలం 3వేల ఓట్లతో సరిపెట్టుకుంది. పార్టీ హైకమాండ్ హుజూరాబాద్ విషయంలో తలంటింది కూడా. ఈ నేపథ్యంలో […]

యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని […]

పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]

కాంగ్రెస్ కల నెరవేరేనా.. ప్రియాంక ప్లాన్ సఫలమయ్యేనా?

త్తర ప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే అతిపెద్ద స్టేట్.. అధికారంలో ఉన్నది బీజేపీ.. సీఎం సీటులో కూర్చుంది యోగి ఆదిత్యనాథ్.. కరుడుగట్టిన హిందూత్వవాది.. ఇదీ అక్కడి పరిస్థితి.. మరి వచ్చే ఎన్నికల్లో.. అనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. అలాంటి ప్రశ్నలకు చోటు లేదు.. వచ్చేది మేమే అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వీరి మాటలు నిజమేనేమో అన్నట్లు సీ ఓట్ సర్వే కూడా కమలం పార్టీదే మళ్లీ యూపీ అని చెబుతోంది.. దీంతో […]

డీఎస్ కోసం తలుపులు తెరిచిన కాంగ్రెస్, బీజేపీ

డి.శ్రీనివాస్.. ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్ హవా ఓ రేంజ్ లో ఉండేది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో ఈయన ప్రభ కూడా తగ్గిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కారు పార్టీలో చేరినా పెద్దగా చురుగ్గా లేరు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్ లో ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ తరపున అరవింద్ గెలవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో […]

ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని […]