ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబులపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా మాటలతో విరుచుకుపడింది. గతానికి భిన్నంగా ఇద్దరు నేతలను క లిపి కుమ్మేసింది. చౌకబారు విమర్శలు పక్కనపెట్టి.. నిఖార్సైన వ్యాఖ్యలతో చించొదిలి పెట్టింది. ఇంతకీ రోజా ఏమందనేగా సందేహం.. అక్కడికే వచ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా తన మాటలకు మరింత మషాళా అద్ది.. సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు లోకేష్ […]
Tag: chandra babu
స్విస్ ఛాలెంజ్‌లో మరో ట్విస్ట్
ఏపీ రాజధానిలో కీలకమైన కోర్ ఏరియా డెవలప్‌మెంట్ విషయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రాజధానిలోని ప్రధాన నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, ఈ విషయంలో పలు సందేహాలు రావడం.. విషయం కోర్టుల వరకు వెళ్లడంతో దీనిపై వెనక్కి తగ్గారు. మరో మార్గంలో రాజధాని నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని కోర్టు కు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టెండర్లకు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పుడైనా కొత్త విధానాన్ని రూపొందించారా? అంటే అది సందేహం […]
చంద్రబాబుపై మంత్రులకే ఆశల్లేవా..!
సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పుడు స్వపక్షంలోనే ఆశలు మృగ్యమవుతున్నాయి. మంత్రులు స్థాయిలోనే సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నా.. చాలా మంది మాత్రం తన అనుచరుల వద్ద పంచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బాబు పాత్ర కన్నా.. చినబాబు పాత్ర ఎక్కువైందని కొందరు అంటుంటే.. మరికొందరు మంత్రి వర్గాన్ని బాబు పట్టించుకోవడం లేదని, కేవలం ప్రచారం పైనే దృష్టి పెడుతున్నారని గుసగుసలాడుతున్నారు. ఇదే బాటలో ఐఏఎస్‌లూ ఉన్నారు. […]
బాబుకు ఓపెన్ షాక్ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యే
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది! దాదాపు రెండున్నరేళ్ల పదవీ కాలంలో కనీసం రెండు వేల బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఉంటారని ఓ అంచనా ఉంది. అలా అన్ని సభల్లోనూ పాల్గొన్నా ఆయన ఏనాడూ కంగు తినలేదు సరికదా.. ఆయన మైకుకి, ఆయన మాటకు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అలాగే అన్ని సభలూ కూడా ఒకేలా ఉండవు! బహుశ ఈ విషయాన్ని బాబు ఊహించి ఉండరు. […]
`పశ్చిమ’లో జగన్ కొత్త అస్త్రాలు
అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్‌తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం. 2014 […]
సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?
ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖరి కనిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. తమకు చెందిన సీనియర్ నేతపై విపక్షాలు దాడి చేయడం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుపడడం సాధారణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేతలు వరుస పెట్టి.. టీడీపీ సీనియర్ నేతపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడకపోవడం అందరినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార […]
2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవరు..!
గడిచిన ఏడాది అనుభవాలను.. రంగరించి.. వచ్చే ఏడాదికి పటిష్ట ప్రణాళికలు వేసుకునే సగటు మానవుడికి ఏ ఏడైనా ఆనందమే! అద్భుతమే!! ఈ సమయంలో గత ఏడాది ఏం జరిగింది? వచ్చే ఏడాదికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి అలాంటి ఆలోచన ఒక్క మనకేనా.. మన ల్ని పాలించే పార్టీలకు లేదా అంటే.. చెప్పలేం. ఇక, ఈ క్రమంలో ఇప్పుడు గడిచిన ఏడాది తాలూకు ఏపీలో జరిగిన పాలిటిక్స్ ను ఒక్కసారి సింహావలోకనం […]
బాలయ్య ” శాతకర్ణి ” ఫస్ట్ షో ఎక్కడ ఫిక్సయ్యింది
బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే శాతకర్ణి ఆడియో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ శాతకర్ణి కోసం ఎప్పుడు థియేటర్లలో వాలిపోదామా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. శాతకర్ణి రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా 12న రిలీజ్ ఉంటుందని టాక్. 5న సెన్సార్‌కు వెళుతోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ల హడావిడి అప్పుడే స్టార్ట్ […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]