నంద్యాల‌లో టీడీపీకి భారీ షాక్‌..సీమ‌లో బాబు లెక్క తప్పిందా..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌లె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో ఇక్క‌డ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. భూమా మృతి త‌ర్వాత‌.. నంద్యాల‌లో పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న శిల్పా వ‌ర్గానికి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉప ఎన్నిక‌ల్లో భూమా వ‌ర్గానికి సీటు కేటాయించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించ‌డంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామంతో […]

బాబు ఇది అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ కాదా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు ఎంతో శ్ర‌మిస్తున్నారు. పెట్టుబ‌డులు రావాలంటే కంపెనీలు ముఖ్యం క‌నుక‌.. నిత్యం పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఇమేజ్ క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వ‌రుస‌గా కంపెనీలు ఏపీకి క్యూ క‌ట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వ‌రుస‌గా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో మూసేయ‌డం.. అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాల‌ని […]

టీడీపీలోకి మాజీ సీఎం సోద‌రుడు..?

తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్య‌తిరేకించిన, స‌మైక్యాంధ్ర చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు. జై స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్ర‌చారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయ‌న త‌మ్ముడు న‌ల్లారి కిషోర్‌కుమార్‌ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ప‌సుపు కండువా క‌ప్పుకోబోతున్నారు. ఆయ‌న చేరిక‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని […]

నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిక‌తో మొద‌లైన విభేదాలు.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా చ‌ల్లార‌డం లేదు. భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి త‌లనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలతో తీవ్రంగా న‌లిగిపోయిన అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఇప్పుడు స‌రికొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా శిల్పా వ‌ర్గానికి […]

టీటీడీ చైర్మ‌న్‌గా టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్సీ

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ముగుస్తున్న కొద్దీ.. తిరుమ‌ల శ్రీ‌నివాసుడి క‌టాక్షం ఎవ‌రిపైన ఉంటుంద‌నే చ‌ర్చ టీడీపీలో జోరందుకుంది. ముఖ్యంగా ఈ ప‌ద‌విపై ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఎప్ప‌టినుంచో ఆశ‌లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! ఈమేర‌కు ఆయ‌న ఇప్ప‌టికే మంత‌నాలు కూడా జ‌రుపుతున్నారు. క‌మ్మ‌ సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న‌కు క‌లిసివ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి, మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించే […]

2019కి టీడీపీలో సీనియ‌ర్లు అవుట్‌

తెలుగు దేశం పార్టీని త‌మ భుజ స్కందాల‌పై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియ‌ర్ల శ‌కం ఇక ముగిసిన‌ట్టే అనే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీలో యువ నాయ‌క‌త్వం పెర‌గ‌బోతోంద‌నే సంకేతాలు.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా స్ప‌ష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి అంతా చిన‌బాబు లోకేష్ సార‌థ్యంలోకే వెళ్ల‌వ‌చ్చ‌నేది కూడా స్ప‌ష్ట‌మ‌వుతున్న త‌రుణంలో.. ఇక సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే […]

వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు […]

బ‌ల ప్ర‌ద‌ర్శ‌న స్టార్ట్ చేసిన ఏపీ మంత్రి

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి టీడీపీలో ఎంతో సీనియ‌ర్‌, మాజీ మంత్రి…నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఎంత‌మంది ఉన్నా టీడీపీ వ‌ర‌కు ఆయ‌న‌దే రాజ్యం అన్న‌ట్టుగా ఉండేది. అలాంటి సోమిరెడ్డి ఏకంగా 2004 – 2009 – 2012 – 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయినా చంద్ర‌బాబు మాత్రం వెంట‌నే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తాజాగా కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆయ‌న స‌త్తా ఏంటో ఆయ‌న వ్య‌తిరేకుల‌కు తెలిసొచ్చింది. […]

చింతమనేని అలక వెనుక..అదే రహస్యం

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి పదవి రాకపోవడం తో అలక పాన్పు పై నుండి దిగక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తనకు పదవి రాకపోవడం కంటే తన చిరకాల ప్రత్యర్థి,తన రాజకీయ ఎదుగుదలకు అడుగడునా అడ్డు తగిలిన పైడికొండల మాణిక్యాల రావు ని కాబినెట్ బెర్త్ లో కూర్చోబెట్టడం తో చింతమనేని ఆగ్రహం కట్టలు తెచ్చుకుందట.ఏంటి ఇదంతా నిజమే..ఇసుక మాఫియాలో..వనజాక్షి విషయం లో బాబు గోరు నీకంత చేస్తే ఇదేనా […]