టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం చాలా హాట్‌హాట్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైరైయ్యారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో కొందరు మంత్రులపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల బాబు ప‌నితీరుపై జాతీయ స్థాయి సంస్థ చేసిన స‌ర్వేలో 47 శాతం మంది సంతృప్తిగా ఉన్న‌ట్టు ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌నితీరుపై సంతృప్తి శాతాన్ని 47 శాతం నుంచి […]

టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?

తెలంగాణ‌లో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన వార్త‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. త‌ర్వాత ఇది సాధ్య‌ప‌డేదే కాదంటూ కొంద‌రు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్యే ఈ చ‌ర్చ రావ‌డంతో ఎప్పుడు ప‌రిస్థితులు ఎలా మార‌తాయోన‌ని విశ్లేష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి సంగ‌తేంటి? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. కేసీఆర్‌-రేవంత్ ఒకే ఒర‌లో ఇమ‌డని రెండు క‌త్తులన్న విష‌యం […]

రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే […]

ఇప్పుడు చంద్ర‌బాబు టార్గెట్ వాళ్లేనా

అసంతృప్తి.. టీడీపీలో ఈమ‌ధ్య విప‌రీతంగా వినిపిస్తున్న ప‌దం!! క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన టీడీపీలో అసంతృప్తి వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజ‌కీయంగా బ‌లోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్‌` వ‌ల్ల ఇది మ‌రింత తీవ్ర‌మైంది. రెండేళ్లలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇదే అసంతృప్తి కొన‌సాగితే.. జంపింగ్‌లు ఎక్కువ‌వుతాయ‌ని దీనివ‌ల్ల‌ పార్టీకి తీవ్ర న‌ష్ట త‌ప్ప‌ద‌ని భావించిన అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో వెంట‌నే ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు. ఇలా వ‌దిలేస్తే ఇంకా […]

గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో […]

నంద్యాల సీటుపై చంద్ర‌బాబుకు అంత టెన్ష‌న్ ఎందుకో?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌పైటీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు భారీ ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న బాబు.. అక్క‌డ గెలుపుకోసం అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. వాస్త‌వానికి నంద్యాల ఉప ఎన్నిక‌పై ఇంకా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌లేదు. అయినా కూడా అటు అధికార‌, ఇటు విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, ప్ర‌చారం త‌ప్ప పంపాకాలు ప్రారంభించేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈవిష‌యంలో విప‌క్ష పార్టీని ప‌క్కన పెడితే.. బాబు […]

బాబుపై బుర‌ద జ‌ల్లే య‌త్నాల‌కు ఇదిగో సాక్ష్యం

మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మ‌రోసారి బుద‌ర జ‌ల్లే ప్ర‌య‌త్నం! ప్ర‌భుత్వాన్ని, చంద్ర‌బాబును ప్ర‌జ‌ల్లో చుల‌క‌న చేసే దుష్ప్ర‌చారానికి తెగ‌డ‌బడుతూనే ఉంది `సాక్షి` మీడియా! ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వ‌క్ర‌భాష్యం చెబుతూ.. రంధ్రాన్వేష‌ణ చేస్తూ.. నిరంత‌రం, ప్ర‌తిక్ష‌ణం త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉంది. ప‌దాల‌కు కొత్త అర్థాలు చెబుతూ.. మాట‌ల‌కు కొత్త భాష్యాలు వెతుకుతూ.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న్ను మ‌రింత దిగ‌జార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు కిడాంబి శ్రీ‌కాంత్ స‌న్మాన స‌భ‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి […]

బాబు స‌ర్కారుకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు..?

ఏపీలో విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన వైసీపీ నేత జ‌గ‌న్‌.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక జ‌రిగిన త‌ర్వాత నుంచి జ‌గ‌న్ కంఠం మూగ‌పోయింది. ఏపీలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, వారు ప్ర‌స్తుతం వివిధ స‌మస్య‌ల్లో చిక్కుకుపోయార‌ని కూడా ఆయ‌న గుర్తించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా గ‌డిచిన వారంలో రాష్ట్రం రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. తూర్పుగోదావ‌రి జిల్లా చాప‌రాయిలో మ‌ర‌ణాలు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల బ‌హిష్క‌ర‌ణ‌. ఈ రెండు సంఘ‌ట‌న‌లు పెద్ద ఎత్తున […]

ఆ రెండు విష‌యాల‌తోనే బాబు ఫైట్‌!!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోంద‌ట‌. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌! దీనికి కార‌ణం.. ఓ రెండు విష‌యాల‌ని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఎంచుకున్నారు. ఎక్క‌డ ఏ స‌భ‌లో మాట్లాడినా ఆరెండు విష‌యాలు చెప్ప‌కుండా ఆయ‌న ఉండ‌లేక‌పోతున్నారు. దీంతో ఆ రెండు విష‌యాలే ఇప్పుడు ఆయ‌న‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయ‌ట‌. ఇంత‌కీ […]