బీజేపీతో ఆట‌… ఇప్పుడు బాబు టైం వ‌చ్చిందా

2014లో జ‌ట్టు క‌ట్టి.. అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మ‌రింత గ‌ట్టి ప‌డుతుంద‌ని, బాబు మ‌రింత స‌న్నిహిత‌మ‌వుతార‌ని, బీజేపీ అండ‌కోసం బాబు మ‌రిన్ని అడుగులు ముందుకు వేస్తార‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమార‌య్యాయి. నంద్యాల ఉప పోరు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, జ‌గ‌న్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు న‌డ‌వ‌డం, 2014లో త‌న‌తో క‌లిసి వ‌చ్చిన ప‌వ‌న్ త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంబించ‌డంతో బాబు […]

కాకినాడ పోరు డిఫ‌రెంట్‌

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఇళ్ల నుంచి త‌ర‌లి వ‌చ్చి మ‌రీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీని ఫ‌లితమే ఇప్పుడు అంద‌రికీ చ‌ర్చ‌గా మారింది. దీని ఫ‌లితం సెప్టెంబ‌రు 1న వెలువ‌డ‌నుంది. దీంతో సెప్టెంబ‌రు 1 అటు బాబుకు క‌లిసి వ‌స్తుందా? జ‌గ‌న్‌కు క‌లిసివ‌స్తుందా? […]

న్యాయ‌మూర్తుల‌తో బాబు కుమ్మ‌క్కా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఆంగ్ల ప‌త్రిక ఎక‌న‌మిక్ టైమ్స్ బాంబు పేల్చింది. న్యాయ వ్య‌వ‌స్థ‌పై బాబు పెత్త‌నం చేస్తున్నార‌ని, త‌న‌కు అనుకూలంగా ఉండ‌ర‌ని భావించే కొంద‌రు న్యాయ‌వాదుల‌కు ప్ర‌మోష‌న్ రాకుండా అడ్డుకుంటున్నార‌ని ఈ క‌థ‌నం సారాంశం. నిజంగా ఈ క‌థ‌నం నిజ‌మైతే.. బాబు తీవ్ర చిక్కుల్లో ప‌డ్డ‌ట్టేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. దేశంలోని అన్ని హైకోర్టుల‌కు న్యాయ‌మూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్ర‌ప‌తి ఆమోదంతో ఆయా గ‌వ‌ర్న‌ర్లు.. ప్ర‌మాణ […]

జ‌గ‌న్‌పై బాబు డైలాగుల‌ బ్ర‌హ్మాస్తం! 

త‌ల‌త‌న్నేవాడు ఒక‌డుంటే.. వాడి తాడి త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు! అది రాజ‌కీయాలైనా.. మ‌రొక‌టైనా ఒక్క‌టే ఫార్ములా. దీనిని తూ.చ‌. పాటిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు ప‌దునైన అస్త్రాలు ప్ర‌త్యేకంగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎదుటివారి మాట‌లు, వారి చేత‌లే వారికి బ్ర‌హ్మాస్త్రాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిరూపించారు చంద్ర‌బాబు. ముఖ్యంగా జ‌గ‌న్ వంటి.. జుట్టు చేతికి ఇచ్చి.. కాళ్లు గెంతులేసే టైపు వారైతే.. బాబుకి మ‌రీ పండ‌గ‌! విష‌యంలో వెళ్తే.. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. […]

మంత్రిగారు బాబును టెన్ష‌న్ పెడుతున్నారు ఎందుకు..!

మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి దూకుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు చిక్కులు తెచ్చి పెడుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అండ్ కో పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. మంచి మార్కులే కొట్టేశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. మాత్రం ఇప్పుడు టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి. ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో 80శాతానికి పైగా పోలింగ్ న‌మోద‌వ‌డంతోనే అంతా ఏమవుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ స‌మ‌యంలో.. సోమిరెడ్డి […]

బాబు `ముంద‌స్తు` ప్ర‌ణాళిక తెలిస్తే షాకే!!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే అంటే మాదే అని టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. అంతేగాక ఎవ‌రికి ఎంత మెజారిటీ వ‌స్తుందో అని లెక్క‌లు కూడా వేసేసుకుంటున్నాయి. త‌న మూడేళ్ల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గెలుపే నిద‌ర్శ‌న‌మ‌ని భావించిన‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి 15 వేల మెజారిటీ వ‌రకూ వ‌స్తుంద‌ని అంత‌ర్గ‌త స‌ర్వేల్లో తేలింది. అది స‌రిపోద‌ని ఇంకా పెంచాల‌ని నేత‌ల‌ను ఆయన ఆదేశించ‌డం గ‌మ‌నిస్తే.. స‌రికొత్త వ్యూహంలో […]

బాబు జ‌మానాలో జ‌గ‌న్ గూఢ‌చారులు?

అవును! ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌మానాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గూఢ‌చారులు ఉన్నార‌ట‌! వీరు ప్ర‌భుత్వంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్నీ పూస‌గుచ్చిన‌ట్టు ముందుగానే జ‌గ‌న్ అండ్‌కోకి అందించేస్తున్నార‌ట‌. అంతేకాదు, ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లు, కొన్ని అతి ర‌హ‌స్య‌, అత్యంత ర‌హ‌స్య‌ నిర్ణ‌యాల‌ను కూడా వీరు జ‌గ‌న్ ప‌రివారానికి మోసేస్తున్నార‌ట‌! ఈ క్ర‌మంలోనే అనేక ర‌హ‌స్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తార‌ని, వారికి పెర‌ఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగ‌నంపుతార‌ని, పురోహితుల‌కు జీతాలు త‌గ్గిస్తార‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో అనేక […]

ఈ దెబ్బతో గంటా గ్యాంగ్‌ను బాబు ప‌క్క‌న పెట్టేయ‌డం క‌న్‌ఫార్మ్‌..!

ఏపీలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు చుట్టూ అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఏదో ఒక ఆరోప‌ణ స‌హ‌జంగానే వ‌స్తోంది. ఇప్పుడు కూడా ఆయ‌న చుట్టూ భూక‌బ్జా ఆరోప‌ణ‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆక‌ర్షించిన విశాఖ భూ కుంభ‌కోణాలు అన్నీ మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే సాగిపోతున్నాయ‌ట‌. ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు గంటా చెప్పిన ప్ర‌కారం భూముల‌ను ఆక్ర‌మించేసి.. వెంచ‌ర్లు వేసేస్తున్నార‌ట‌. దీంతో మంత్రి గారి అవినీతి పుంఖాను పుంఖానులుగా రాజ‌ధానిలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. […]

ఇష్ట‌మైతే.. అలా.. ఇష్టం లేక‌పోతే.. ఇలానా బాబూ! 

రాజ‌కీయాలైనా మ‌రేమైనా.. మ‌న‌కు ఇష్ట‌మైతే, ఎదుటి వాళ్లు మ‌న‌కు జై కొడితే.. వాళ్లు ఎంత నీచ్ క‌మీన్ అయినా సరే.. మ‌న‌కు దేవుళ్లుగానే క‌నిపిస్తారు. అంతేకాదు, వాళ్లు ఎంత పాపాలు చేసినా.. మ‌న క‌ళ్ల‌కు పుణ్యాలుగానే క‌నిపిస్తాయి. అదే కొంచెం రివ‌ర్స్ గేర్ ప‌డి.. జై కొట్టిన నోటితో అవ‌త‌లివాళ్లు… మ‌న‌మీద‌కి సై.. అన్న‌ప్పుడే అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. ఇప్పుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]