ఏపీ బీజేపీలో ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన ఉప రాష్ట్రపతిగా ఎంపికవ్వడం కూడా లాంఛనమే. దీంతో ఏపీలో బీజేపీని భారీ ఎత్తున ప్రక్షాళన చేసేందుకు బీజేపీ జాతీయ అధిష్టానం రెడీ అవుతోంది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ కంభంపాటి […]
Tag: bjp
బీజేపీని నమ్మని బాబు… జనసేన వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు అవుట్… కొత్త అధ్యక్షుడు ఫిక్స్..!
ఇప్పటి వరకు ఏపీ బీజేపీలో చీమ చిటుక్కుమన్నా వెంకయ్యనాయుడుకు తెలియకుండా జరగదు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీలో వెంకయ్య హవా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నెల్లూరు నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం చివరకు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండే వరకు వెళ్లింది. ఆ తర్వాత కేంద్రమంత్రిగాను, ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అయ్యేవరకు అప్రతిహతంగా ఆయన దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీని ఆయన ఒంటి చేత్తో పెద్ద కష్టపడకుండానే శాసిస్తూ వచ్చారు. ఇక మోడీ ప్రధానమంత్రి […]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. ఆయన కన్నా వీళ్లకే ఆనందం!?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దేశ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన విషయం ఆయనకు ఆయన కుటుంబానికీ ఆనందాన్ని ఇచ్చేదే. అయితే, వీరికన్నా ఎక్కువగా వెంకయ్య ఏపీ నుంచి వెళ్లిపోతే బాగుండును అని అనుకునేవారే మరింత ఎక్కువగా ఆనందిస్తున్నారు. హమ్మయ్య వెంకయ్య ఇక ఏపీ జోలికి రాడు కాబట్టి హ్యాపీ అని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ఆనందంగా పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. విషయంలోకి వెళ్తే.. ఏపీ బీజేపీని అన్ని విధాలా ముందుండి నడిపిస్తున్నారు […]
తెలంగాణలో బీజేపీకి వాయిస్ కట్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికార పక్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించిన బీజేపీ ఇప్పటికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు మియాపూర్ భూములు సహా మిషణ్ భగీరథలో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలతో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు కమలం నేతలు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు కట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయంపైనే తెలంగాణలో అందరూ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే… తెలంగాణలో కొంత పుంజుకున్న బీజేపీ నేతలు.. అధికార పక్షాన్ని విమర్శించి […]
ఉపరాష్ట్ర పతిగా వెంకయ్య…ఏపీ పరిస్థితి ఏంటి!
నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]
ఆంధ్రాని మళ్ళీ మోసంచేయడానికి సిద్ధమైన బీజేపీ
హోదాపై ఎన్నెన్ని మాటలు చెప్పారు! ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! తర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. నమ్మించి నట్టేట ముంచారు బీజేపీ నేతలు! ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ఇవే మాయ మాటలు చెబుతున్నారు! తమ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా.. ఏపీ ప్రజల […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]
పవన్ సర్వే ఏ పార్టీకి?
2019 ఏపీలో ఎన్నికల నామ సంవత్సరం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నికల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే థీమ్‌తో ఇటీవల ఆయన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక, ప్రశ్నిస్తానంటూ […]