ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న […]

చిరు గురించి చెప్పిన బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి […]

కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్ట‌ర్ ఫైర్‌

తెలంగాణ ఉద్య‌మ నేత‌, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వ‌ర్గం తీవ్ర‌స్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ ల‌క్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మ‌రిచిపోతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించింది. తాజాగా బాల‌య్య న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద ప‌న్నును మిన‌హాయించ‌డంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మండిప‌డుతోంది. ఆంధ్రావాళ్ల‌పై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోంద‌ని, వాళ్లు ఏదైనా ప్ర‌పోజ‌ల్‌తో సీఎం క‌లిస్తే.. వెంట‌నే ప‌నులు అయిపోతున్నాయ‌ని, తెలంగాణ కోసం […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి సీక్వెల్ వస్తోందా?

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ య‌జ్ఞంలా భావించి రూ.55 కోట్ల బ‌డ్జెట్‌తో కేవ‌లం 8 నెల‌ల్లో తెర‌కెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్న క్రిష్ […]

బాల‌య్య‌కు కేసీఆర్ భ‌లే ప‌రీక్ష పెట్టారే..!

ప్ర‌తిష్టాత్మ‌క క‌థ‌తో బాల‌య్య న‌టించిన 100వ మూవీ శాత‌క‌ర్ణి విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే, దీనిని ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా చూపించాల‌ని బాల‌య్య తెగ సంబ‌ర ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఈ మూవీ స్టార్టింగ్ డే ఫంక్ష‌న్‌లో పాల్గొన్న కేసీఆర్‌.. మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తే.. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా ఈ మూవీని చూపించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణకు.. […]

షాక్‌: జ‌గ‌న్‌ను క‌లుస్తోన్న బాల‌య్య‌

యువ‌ర‌త్న బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి రాబోతోంది. క్రిష్ డైరెక్ష‌న్‌లో హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌నేదానిపై కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ముందుగా బాల‌య్య 101వ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. ఈ సినిమా దాదాపు సెట్స్‌మీద‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో క‌థ […]

బాల‌య్య వ‌ర్సెస్ చిరు మ‌రో ఫైట్‌

మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 – నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరుకు 150వ సినిమా కావ‌డంతో పాటు బాల‌య్య‌కు 100వ సినిమా కావ‌డంతో ఈ రెండు సినిమా స‌మ‌రంపై టాలీవుడ్‌లో ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే ఈ పోటీ ఇక్కడితో ఆగిపోయేట్లుగా లేదు. ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు ఇప్పుడు ఒకే స్టోరీ కోసం […]

బాల‌య్య సినిమాల‌కు బ్రాహ్మ‌ణి డైరెక్ష‌న్

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాల‌య్య 101వ సినిమాపై అప్పుడే పెద్ద చ‌ర్చ కంటిన్యూ అవుతోంది. ముందుగా బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. దీనిపై ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. త‌ర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. […]

బాల‌య్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్‌…!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ పేరు ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఒక్క‌డే నానుతోంది. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు మ‌రింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాల‌కృష్ణ వందో సినిమా కావ‌డం, ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అంద‌రూ క‌ళ్ళ‌ల్లో ఒత్తులేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ […]