బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు

గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం […]

అసెంబ్లీ స్థానాలు పెంచం రెండోస్సారి!

ఎన్ని సార్లు చెప్పాలి యువరానర్ పెంచము..పెంచము..పెంచము గాక పెంచము..ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం వైఖరి.అయినా పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ఆంధ్ర,తెలంగాణా పాలకులు పోరాడుతూనే వున్నారు.ఇదేదో ప్రజా ప్రయోజనం కోసం అనుకుంటే పొరపాటే..కేవలం పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా అధికార పార్టీ లో చేరిన వారిని కాపాడుకుందుకే ఇంత తాపత్రయం. ఇప్పటికే కేంద్రం ఎన్నో సార్లు నియోజక వర్గాల పెంపు 2024 వరకు సాధ్యమయ్యే పరిస్థితి లేదని డంకా బజాయించి మరీ చెప్పింది.అయినా ప్రజా ప్రతినిధుల […]

నెహ్రు ఎంట్రీ తో టీడీపీ లో ఆ ముగ్గురికి తలనొప్పి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేర‌తార‌న్న ప్రచారం ఊపందుకుంది. పుష్క‌రాల త‌ర్వాత నెహ్రూ ఆయ‌న త‌న‌యుడు దేవినేని అవినాష్ టీడీపీలో చేర‌తార‌ని కూడా విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నెహ్రూ రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావును ఆయ‌న నివాసంలో క‌లిశారు. నెహ్రూతో పాటు మాజీ ఎమ్మెల్యే గ‌ద్దే బాబూరావు కూడా ఈ భేటీలో ఉన్నారు. నెహ్రూ టీడీపీ ఎంట్రీ విష‌యాన్ని గ‌తంలోనే గ‌ద్దే […]

ఆస్తుల్లో ఏపీ మంత్రులే టాప్

ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్ 251 కోట్లతో రెండో […]

ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]

జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని […]

కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం

వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది. బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]

ప్రత్యేక హోదానా వంకాయా:జైట్లీ

ప్రత్యేక హోదాపై అధికార పక్షం చాలా క్లారిటీగా వుంది.చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజం ఉంటుందో లేదో కానీ ఇంత క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వేదన అరణ్య రోదనే..నిన్న బొంకయ్య నాయుడుగారు బొంకిన బొంకులే ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా ఇంకొంచెం పోలిష్ చేసి వల్లెవేశారు. అసలు చర్చే ప్రత్యేక హోదా గురించి అయితే ఎంతసేపు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం […]