మైండ్‌గేమ్: ఎవరు ఎటు జంప్ చేస్తారో?

ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఇంతకాలం అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ..టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది..ఇంకా వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా సరే వైసీపీ కూడా అదే స్థాయిలో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో రెండు పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి టి‌డి‌పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ […]

ఎమ్మెల్యేలకు క్లాస్ లేదా? జగన్ కొత్త రూట్‌లో!

ఇప్పటివరకు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి..కానీ ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం…అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టి‌డి‌పి గెలవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో..తాజాగా జగన్ పెట్టే వర్క్ షాప్ ఏ విధంగా సాగుతుందనే చర్చ అందరిలో సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపులు వేరు..ఇప్పుడు జరిగేది వేరు. గత ఏడాది జరిగిన వర్క్ షాపులో జగన్ పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తూ […]

కృష్ణాలో టీడీపీకి ఆ మూడిటిల్లో నో ఛాన్స్.!

రాష్ట్రంలో టి‌డి‌పి నిదానంగా పికప్ అవుతున్న విషయం తెలిసిందే. అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి ముందుకెళుతుంది..అయితే ఇంకా టి‌డి‌పి బలపడాల్సి ఉంది. వైసీపీని ఓడించాలంటే ఈ బలం సరిపోదనే చెప్పాలి. పలు చోట్ల టి‌డి‌పి వెనుకబడి ఉంది. ముఖ్యంగా టి‌డి‌పికి పట్టున్న కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని స్థానాల్లో పట్టు దొరకట్లేదు. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి..ఆ ఏడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో పార్టీ బాగానే […]

చెవిరెడ్డి వారసుడుకు సీటు..టీడీపీ నిలువరిస్తుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ నుంచి వారసులు రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ నేతల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వారసులు పోటీ చేయడానికి లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే మళ్ళీ తనతో పోటీ చేయాలని చెప్పారు. కానీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే […]

 రాప్తాడులో టీడీపీకి జోష్..లోకేష్‌తో ప్లస్ ఉందా?

యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన లోకేష్ పాదయాత్ర..అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రకు మొదట్లో పెద్ద ఎత్తున ప్రజా స్పందన ఏమి రాలేదు. కానీ నిదానంగా ఆయన ప్రజలతో కలిసే విధానం గాని, యువతని ఆకర్షించే విధంగాని..అన్నీ టి‌డి‌పికి కలిసొస్తున్నాయి. ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు. అలాగే యువతతో ఎక్కువ ఇంటారక్ట్ అవ్వడం పెద్ద ప్లస్. ఇలా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి […]

అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!

ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బి‌జే‌పికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బి‌జే‌పికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బి‌జే‌పి మద్ధతు పలికిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బి‌జే‌పి అమరావతి నినాదం […]

మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?

ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]

నెల్లూరు ఎంపీ సీటుపై టీడీపీ పట్టు..వైసీపీ ఛాన్స్ ఇస్తుందా?

తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్ష మాదిరిగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి పెద్దగా విజయాలు సాధించలేదు. ఎప్పుడో 1984, 1989, 1999 ఎన్నికల్లో మాత్రమే అక్కడ టి‌డి‌పి గెలిచింది..మళ్ళీ ఆ తర్వాత గెలిచిన సందర్భాలు లేవు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలుపు వరకు వచ్చి బోల్తా కొట్టింది. ఆ ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. […]

ఎలమంచిలి సీటుపై ట్విస్ట్..జనసేన కోసం టీడీపీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున సీట్లలో ఎలమంచిలి కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..1985 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ 4 వేల ఓట్ల మెజారిటీ తేడాతో గెలిచింది. అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్లే అక్కడ టి‌డి‌పికి […]