ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….

విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… […]

నెహ్రు ఎంట్రీ తో టీడీపీ లో ఆ ముగ్గురికి తలనొప్పి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేర‌తార‌న్న ప్రచారం ఊపందుకుంది. పుష్క‌రాల త‌ర్వాత నెహ్రూ ఆయ‌న త‌న‌యుడు దేవినేని అవినాష్ టీడీపీలో చేర‌తార‌ని కూడా విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నెహ్రూ రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావును ఆయ‌న నివాసంలో క‌లిశారు. నెహ్రూతో పాటు మాజీ ఎమ్మెల్యే గ‌ద్దే బాబూరావు కూడా ఈ భేటీలో ఉన్నారు. నెహ్రూ టీడీపీ ఎంట్రీ విష‌యాన్ని గ‌తంలోనే గ‌ద్దే […]

చంద్రబాబు పై అసంతృప్తితో పయ్యావుల

టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్‌.. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప‌రోక్షంగా ఫైర‌య్యారా? చ‌ంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నా, ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు నానా తిప్పలు ప‌డి అధికారంలోకి తీసుకువ‌చ్చినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని ఆయ‌న వాపోతున్నట్టు తెలిసింది. అంతేకాదు, ముందొచ్చిన చెవుల క‌న్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పార్టీ అధినేత త‌మ‌ను కాద‌ని, ఇప్పుడిప్పుడే సైకిలెక్కుతున్న వారిని […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]

చంద్రబాబు తలంటు పోసేశారు నిజమే!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా బిజెపి వ్యూహాల్ని అమలు చేస్తే, ఆ వ్యూహాలు విజయవంతమైనప్పుడు సుజనా చౌదరి బల్లలు చరుస్తూ ఆమోదం తెలపడం వివాదాస్పదమయ్యింది. మిగతా అంశాల్లో అయితే సుజనా చౌదరి తీరుని చంద్రబాబు సమర్థించేవారే. కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో వివాదం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. దాంతో చంద్రబాబు, […]

కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రా…

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు […]

నత్తతో పోటీపడుతున్న పుష్కర పనులు

కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణ పనులు నిర్ధేశించిన గడువు ముగిసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందు పనులు చేయండి తరువాత నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మాట్లాడుతున్న తీరుతో కాంట్రాక్టర్లు ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు సుముఖంగా లేరు. పద్మావతి ఘాట్‌, దుర్గా ఘాట్‌, పున్నమి ఘాట్‌, పున్నమి ఘాట్‌, కృష్ణవేణి తదితర ఘాట్లలో కాంక్రీట్‌ పనులతోపాటు మట్టి పనులు సైతం ఇప్పటికీ నడుస్తున్నాయంటే పనుల తీరు ఏవిధంగా ఉందో […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

మోడీ టూర్‌పై కేసీఆర్‌ వ్యూహాలేంటో!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. […]