ఎంతటి రాజకీయ వైరమున్నా ఎన్నికల సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో.. అధికార, ప్రతిపక్ష నేతలు పరోక్షంగానైనా కాస్తో కూస్తో మర్యాదపూర్వకమైన సంబంధాలను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులోనూ సాధ్యమవుతుందన్న నమ్మకమూ కలగడం లేదు. టీడీపీ ప్రభుత్వం పై అంశాలతో సంబంధం లేకుండా విభేదిస్తున్న జగన్…చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రభుత్వ పాలనలోని ఏ చిన్న లోపాన్ని వదలకుండా విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార […]
Category: Politics
కెసియార్ కన్నెర్రజేయబట్టే!
హైదరాబాద్‌ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ […]
తెలంగాణ దెబ్బకు జ్యోతుల,భూమా కుదేల్
సిగ్గుమాలిన నీచ రాజకీయాలు పరాకాష్టకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేరిన తరుణం ఇది.నిస్సిగ్గుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందాగా,ఒక పార్టీ గుర్తు పై గెలిచి అధికార వాంఛతో,ధనార్జనే ధ్యేయంగా,అవినీతి బండారాల్ని కప్పి పుచ్చుకోవడానికి మన రాజకీయ నాయకులు చేస్తున్న నవతరం వ్యభిచార రాజకీయాలే ఈ పార్టీ ఫిరాయింపులు.ఈ రాజకీయవ్యభిచారం అభివృద్ధి అన్న ముసుగేసుకుని మరీ చేసేస్తున్నారు.సిగ్గు కే సిగ్గేస్తుందేమో వీళ్ళని చూస్తే. తాజాగా ఈ ఫిరాయింపు వీరులని ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నాల్లో ఆంధ్ర […]
జగన్ పట్టువదలని విక్రమార్కుడు.
ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ జగన్ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]
పాక్‌పై మోడీ కొత్త యుద్ధం
భారత్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త యుద్ధం ప్రకటిస్తున్నారా ? బుల్లెట్ పేలకుండానే పాకిస్తాన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ రెడీ అవుతున్నారా ? జలాస్త్రంతో పాకిస్తాన్‌కు మోడీ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ? అంటే అవుననే సమాధానాలు విశ్వసనీయవర్గాల ద్వారా వస్తున్నాయి. గత ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 18 మంది మన జవాన్లు వీర మరణం పొందడం […]
చంద్రబాబుకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన గవర్నర్
వర్తమాన రాజకీయాల్లో విలువలగురించి మాట్లాడటమంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షాలను బలహీనపరచేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఐనా తన శక్తియుక్తులన్నీ ధారపోస్తుండటం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. ఈ సంస్కృతికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంపశయ్య మీద ఉన్నా, అధికారంలో వెలిగిన సమయంలో ఇలాంటి విధానాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చింది. ఇక ఇటీవలి రాజకీయాల్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు ఏవగింపు కలిగించే […]
ఓటుకు నోటు కేసులో ఏం తేలనుంది..?
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిల్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. సుప్రీం ఆదేశాలు తమకే అనుకూలమని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అన్వయించుకుని వ్యాఖ్యానిస్తుండగా మీడియాలోనూ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశిస్తూ 8 వారాలపాటు స్టే […]
100 సంవత్సరాలైనా హైదరాబాద్ గతి అంతేనా
తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటున్న విశ్వనగరం.. దృశ్యం.. చిన్న చినుకు పడితే అపహాస్యం పాలవుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే దర్శనమిస్తున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లలోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాదని, గత […]
ఆ మాజీ కేంద్ర మంత్రి దారెటు
కేంద్ర మాజీ మంత్రి, కోట్ల వంశం రాజకీయ వారసుడు, కర్నూలు కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలిటిల్ ఫ్యూచర్‌పై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది! వాస్తవానికి కోట్ల కుటుంబం పొలిటికల్ హిస్టరీ ఇప్పటిది కాదు. కోట్ల విజయభాస్కర రెడ్డి నుంచి కర్నూలు సహా స్టేట్ పాలిటిక్స్‌లో కోట్ల కుటుంబం యాక్టివ్‌గా ఉంది. ఈ క్రమంలోనే సూర్యప్రకాశ్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇక, ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన క్రమంలో […]