పొలిటికల్ లీడర్స్ అన్నాక 24 గంటలూ ప్రజల కోసమే పనిచేయాలా? వాళ్లకు మాత్రం కుటుంబాలు ఉండవా? ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంపలేం మునిగిపోతాయి? ఇటీవల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయన ఎవరి గురించి అన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!! అదే సమయంలో ప్రజలు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ కనుక!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం […]
Category: Politics
ఆ ఏపీ మంత్రి తప్పులు ప్రశ్నిస్తే ..కులం కార్డు తీసేస్తున్నారు
ఏపీలో అవినీతి పెరిగిపోయింది! ఇటీవల సర్వత్రా వినబడుతున్న మాట. కొందరు ప్రజలు ఈ విషయాన్ని నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మంత్రులే అవినీతికి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిని సహించేది లేదని పదే పదే చెప్పే చంద్రబాబు హయాంలో మంత్రులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు గుట్టుచప్పుడు కాకుండా మౌనంగా ఉంటుండగా మరికొందరు మాత్రం.. తాము దళిత […]
2019 వార్: టీడీపీ+బీజేపీ వర్సెస్ జనసేన
ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు ఉన్న మబ్బులు వీడుతున్నాయి. మసకలు తొలగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కొద్ది రోజులుగా చెపుతూ వస్తోన్న పవన్ బుధవారం అనంతపురం సభతో మరింత క్లారిటీ ఇచ్చాడు. తాను 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఘంటాపథంగా చెప్పేశాడు. దీంతో 2019 ఎన్నికల్లో ఏపీలో ముక్కోణపు పోరుకు తెరలేచినట్లయ్యింది. అనంతపురం సభలో పవన్ ప్రసంగం చూస్తే పొలిటికల్‌గా పవన్ స్టైల్ మారినట్టు స్పష్టమవుతోంది. గతంలో పంచెలూడదీసి కొడతాం అంటూ పరుషంగా మాట్లాడిన […]
పవన్ చెంతకు మాజీ మంత్రి..!
మాజీ మంత్రి, దివంగత వైఎస్ హయాంలో ఆయనకు ఎంతో నమ్మకస్తుడైన అనుచరడుగా మెలిగిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి పట్టున్న నేత కొణతాల రామకృష్ణకు పొలిటికల్ డయాస్ కన్ఫర్మ్ అయిందట! రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉండలేక… జగన్ నేతృత్వంలోని వైకాపాలోకి వచ్చేశారు కొణతాల. అయితే.. పార్టీలో అధ్యక్షుడి వైఖరితో విసుగెత్తిన ఆయన ఓ ఫైన్‌డే వైకాపాకి హ్యాండిచ్చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నారు. అయితే, మొన్నామధ్య అంతా సెటిల్ అయిపోయింది. […]
టీఆర్ఎస్‌లో ఎన్ని ఫైటింగ్‌లో….
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంలో భాగంగా జిల్లాల సంఖ్యను అనూహ్యంగా 31కి పెంచారు. దీంతో అప్పటి వరకు ఉన్న 10 జిల్లాల స్థానంలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో పాలన సులువు అవుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు పాలన చేరువ అవుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం కేసీఆర్ ఊహించారు. ఈ క్రమంలోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. జిల్లాల ఏర్పాటులో వెనక్కి తగ్గలేదు. ఇక, కొత్త […]
డిపాజిట్ స్ట్రైక్స్‌తో మరో షాక్ ఇచ్చిన మోడీ
బ్లాక్ మనీకి బంపర్ స్ట్రోక్ ఇచ్చిన ప్రధాని మోడీ..కి ఒక వర్గం ప్రజలు జై కొడుతుండగా.. మరో మేధావి వర్గం మాత్రం ఆ.. ఈ నిర్ణయంతో బ్లాక్ మనీ ఆగిపోతుందా.. నోట్ల రంగు మార్చుకుంటుంది అంతే! అని పెదవి విరిచారు. అయితే, ఇలాంటి వాళ్ల పెదవి విరుపులకు కూడా షాకిచ్చే నిర్ణయం తాజాగా వెలువడింది. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న […]
చంద్రబాబు ” వాస్తు ” హిట్ కొట్టిందా
ఏపీ సీఎం చంద్రబాబు నోట వాస్తు వ్యాఖ్యలు వచ్చాయి. వాస్తవానికి టెక్నాలజీని నమ్మే ఆయన వాస్తును నమ్ముతున్నట్టు చెప్పడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. ఇటీవల ఆయన వెలగపూడిలో నిర్మించిన నూతన సచివాలయంలో తన ఛాంబర్‌ను బాబు ప్రారంభించారు. పూర్తి వాస్తు ప్రమాణాలతో ఈ ఛాంబర్‌ను నిర్మించారు. ఇక, తన ఛాంబర్‌ను ఇటీవల ప్రారంభించిన బాబు.. ప్రస్తుతం అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. అదేవిధంగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించిన సందర్భంగా చంద్రబాబు రెండు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. […]
టీ కాంగ్రెస్‌లో సొమ్మున్న నేతల పోస్టు వాంటెడ్..!
అవును! మీరు చదివింది నిజమే!! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టులకు అంతే కీలకమైన అభ్యర్థుల కోసం పార్టీ ఎదురు చూస్తోందట! ప్రస్తుతం ఉన్న నేతలంతా ఉత్తుత్తి బ్యాంకు మాదిరిగా ఉత్తుత్తి బ్యాచ్‌లా తయారయ్యారని కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్టులు వెళ్లినట్టు సమాచారం .ఈ క్రమంలో మంచి దమ్ము, సొమ్ము ఉన్న నేతలు రంగంలోకి దిగితేకానీ, 2019లో అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కుదరదని ఓ డెసిషన్‌కి వచ్చిందట అధిష్టానం. ఈ క్రమంలోనే సొమ్మున్న నేతల […]
కాంగ్రెస్‌లోకి కోదండ రాం..!
ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమేనంటున్నారు టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమంలో రాత్రిబవంళ్లు శ్రమించిన ప్రొఫెసర్ కోదండ రాం.. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి దశ దిశ చూపిన వారిలో కోదండరాం ప్రముఖులు. అయితే, రాష్ట్ర ఏర్పాటు అనంతరం, ఆయన అధికారానికి దూరంగానే ఉండిపోయారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంలో చేరతారని అందరూ భావించినా.. ఆయన మాత్రం ఉద్యమకారుడిగానే ఉండిపోయారు. ప్రభుత్వంపై సూటి విమర్శలు చేయడంతో సీఎం కేసీఆర్‌కు ఆయనకు మధ్య సంబంధాలు కూడా […]