ఇప్పటికే ఒక పక్క ప్రభుత్వ పాలన, మరోపక్క పార్టీ కార్యకలాపాల వ్యూహ రచనలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సరికొత్త ఫీట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్న ప్రధాన విపక్షాలను నిర్వీర్యం చేసే క్రమంలో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించారు ఇద్దరు చంద్రులు. ఆపర్ ఆకర్ష్‌కి తెరతీసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్, వైకాపా ఆఖరికి కమ్యూనిస్టులను సైతం తన కారెక్కించుకున్నారు. […]
Category: Politics
ఆ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే రూ.20 కోట్లు పంచాడా..!
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సంచలన నిర్ణయం నిజంగానే పెద్దలను ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లెక్కలు చూపని కొన్ని కోట్ల పెద్ద నోట్లు.. తగల పెట్టారని, చించి పోస్తున్నారని వార్తలు, సచిత్ర కథనాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దలు తమ బ్లాక్ మనీని తమ కుటుంబ సభ్యులకు పంచుతున్నారు. వారి పేర్లతో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్లాక్ మనీని అరికట్టేందుకేనన్న ప్రధాని మోడీ […]
జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
పాలిటిక్స్ అన్నాక శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు! అప్పటి వరకు ఒక పార్టీలో మంత్రులుగా అధికారం చలాయించి, పార్టీ అధినాయకత్వంతో రాసుకు పూసుకొని తిరిగిన నేతలు.. అధికారం చేయి మారిన మరుక్షణం అప్పటి వరకు మోసిన పార్టీ జెండాను పక్కన పడేసి.. పార్టీలు మారుతున్న సందర్భాలు అనేకం! ఈ విషయంలో ఎవరి ప్రయోజనాలు వారివి!! ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రస్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కేడర్ తయారు కాని పవర్ స్టార్ పవన్ […]
టీడీపీలో ఎమ్మెల్సీ ఫైట్ అదురుతోంది…!
ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో పోరు పీక్ స్టేజ్‌కి చేరింది. పార్టీలో బలంగా ఉన్న నేతల మధ్య భారీ స్థాయిలో ఫైట్ జరుగుతోంది. ఇక, కుల సమీకరణలు, సిఫార్సులు కామన్! తాజా అంచనాల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఐదుగురు, గవర్నర్ సిఫార్సు చేసేవారు ఇద్దరు మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్సీలను చంద్రబాబు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను మంత్రి వర్గంలోకి […]
నారాయణమూర్తికి చంద్రబాబు ఎంపీ సీటు ఆఫర్
ఉద్యమ సూరీడు, విప్లవ మూవీల డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తికి చంద్రబాబు ఎంపీ సీటు ఆఫర్ చేశారట. అయితే, ఇప్పుడు కాదులేండి! గతంలో.. అయితే, తాను పాలిటిక్స్‌కి పనికిరాననే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టు నారాయణ మూర్తి చెప్పారు. అంతేకాదు, ఈ ఆఫర్ ఒక్కసారి కాదట.. చంద్రబాబు ఇప్పటికి మూడు సార్లు ఎంపీ సీటు ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి. ఇటీవల ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తనను […]
పవన్ – జగన్ – లోకేష్ ఎవరి సత్తా ఎంత..!
జనసేనాని పవన్, వైకాపా అధినేత జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్! ముఖ్యంగా ఇటీవల కాలంలో జగన్, లోకేష్‌లు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కూడా ఇటీవల కాలంలో విద్యార్థులతో మమేకం అవుతున్నారు. కాకినాడలో సభ నిర్వహించిన తర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థులతో సమావేశ మయ్యారు. ఇటీవల అనంతపురంలో […]
అమరావతికి చిల్లర కష్టాలు
పెద్ద నోట్ల కష్టాలు ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే సరైన వసతులు లేక నానా తిప్పలు పడుతూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు నోట్ల కష్టాలు పట్టుకున్నాయి. చేతిలో వేల కొద్దీ నోట్లు ఉన్నా.. చిల్లర ఇచ్చే దిక్కులేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కొత్తగా కట్టిన సచివాలయం ఇటు గుంటూరు ప్రధాన నగరానికి, అటు విజయవాడ కేంద్రానికి సుదూరంలో ఉంది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి అవసరం వచ్చినా ఇబ్బందులే. ఇప్పుడు పెద్ద నోట్ల […]
పవన్ వ్యాఖ్యలపై లోకేష్ కామెంట్స్
అనంతపురంలో నిర్వహించిన సభలో జనసేనాని ఏపీ అధికార పక్షం టీడీపీ, చంద్రబాబు పాలనపై పెద్ద ఎత్తున సైలెంట్‌గానే విమర్శలు చేశారు. ముఖ్యంగా హోదా వద్దని ప్యాకేజీ ముద్దని అంటున్న బాబు అండ్‌కోపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. కేవలం పన్నల రూపంలో ఏపీకి ఏం రావాలో వాటినే ఓ ప్యాక్ చేసి.. దానికి ప్యాకేజీ అని పెద్ద పేరు పెట్టి.. మన మొహాన కొట్టారని కేంద్రంపై విమర్శలు గుప్పించిన పవన్.. దానిని చంద్రబాబు ఎలా ఆహ్వానించారని ఆయన ప్రశ్నించారు. […]
ఆడపిల్లలపై కేసుల్లేవ్ అంటోన్న పవన్
సమాజంలోని ఆడపిల్లల పట్ల ప్రతి ఒక్కరూ ఎంత బాధ్యతగా ఉండాలో జనసేనాని స్పష్టం చేశారు. ప్రతి ఆడపిల్లా ఎంతో గౌరవంగా బతికే వాతావరణం కల్పించాలని, అదేసమయంలో తనపై ఏదైనా దాడి జరిగితే.. ఆడపిల్లలే ధైర్యంగా తిరగబడాలని కూడా ఆయన సూచించారు. శుక్రవారం ఉదయం గుత్తిలోని ఓ విదాసంస్థలో విద్యార్థినులతో పవన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆడపిల్లలకు సమాజంలో ఎదురవుతున్న కష్టనష్టాలను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు. సమాజంలో అందరికీ జీవించే హక్కు […]