అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలవనుంది. చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయిపోయింది. దీంతో అందరినీ ఆహ్వానించే పనిలో బిజీ అయిపోయాడు నాగ్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వయంగా వెళ్లి కలిసి ఆహ్వానించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు మిగిలారు. వాస్తవానికి చంద్రబాబుతో నాగ్‌కి అంత సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఆయనను ఆహ్వానిస్తారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే, ఏపీకి సీఎం కాబట్టి.. తప్పకుండా ఆహ్వానిస్తాడని సమాచారం. […]
Category: Politics
తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వర్గపోరు!
బహుళ ప్రజా ప్రయోజనమే మీడియా ప్రసారాలకు గీటు రాయి! అది ప్రచురణ అయినా ఎలక్ట్రానిక్ మాధ్యమమైనా.. రెండింటికీ వర్తిస్తుందనేది మీడియా పెద్దల ఉవాచ! గతంలో అన్ని పత్రికలూ ఇవి పాటించాయి! నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్యక్తిని ఎడిటర్‌గా నియమించారు. అయితే, కాల్పనిక దృష్టితో వార్తలు ప్రచురించే రోజులు కావడంతో తన యజమానే అయినప్పటికీ.. దేశ ప్రధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణయాలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ […]
టీడీపీ ఎమ్మెల్యేల్లో బ్లాక్ షీప్స్ లెక్కలు ఇవే
ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఓ పది పదిహేను మంది బ్లాక్ షీప్స్‌గా మారారా? లెక్కలేనన్ని దందాలతో కోట్లు గడించారా? ఆ డబ్బును ఇప్పడు ప్రధాని మోడీ సంచలన నిర్ణయంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారా? బ్లాక్ మనీకి కేరాఫ్‌గా మారిన ఆ తెలుగు తమ్ముళ్లు. ఇప్పడు నించోలేక, కూర్చోలేక, ఆఖరికి నిద్ర కూడా పట్టక తెగ టెన్షన్ ఫీలవుతున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది! ముఖ్యంగా ఉభయ గోదావరి సహా కోస్తా జిల్లాల్లో […]
టీఆర్ఎస్ సంబరాలకు మోడీ షాక్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా జనాల్ని నానాతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. అదికూడా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనాలు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ సమస్యల మాటేమో కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఈ నోట్ల రద్దు విషయం చుక్కలు చూపిస్తోంది. ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం, ఉత్పత్తి వ్యాపారాలు పూర్తిగా డౌన్ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే, ఇది నాణేనికి […]
టీడీపీ మంత్రికి ఇంత చెత్త బుద్ధి ఏంటి
టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మొదటి నుంచి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తారని, ఏపీకి మంచే జరుగుతుందని ఆయన చెబుతూవచ్చారు. అయితే, అనూహ్యంగా ఏపీకి హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకే కేంద్రం పరిమితం అయింది. దీనిపై ఏపీలోని ప్రధాని విపక్షం వైకాపా సహా కాంగ్రెస్, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. హోదా కావాల్సిందేనని మొన్నటికి మొన్న […]
చంద్రబాబు చేతికి టీడీపీ నల్లధన ఎమ్మెల్యేల లిస్టు
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ గా సంపాదించేశారట! ఇక్కడ రాష్ట్రంలోనూ, అక్కడ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది తామే కదా అనుకున్నారో ఏమో.. తాము ఏం చేసినా అడిగేదెవరు అని భావించారో ఏమో.. అడ్డగోలుగా అందినకాడికి దోచేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెండు చేతలా సంపాదించేశారు. అందినకాడికి అన్ని పనుల్లోనూ కమీషన్లు కొట్టేశారు. బెదిరించి, దందాలు చేసి మరీ బ్లాక్ మనీకి పోగేసుకున్నారు. అయితే, వీరంతా ఒక్కసారిగా ప్రధాని […]
గాలి వారింట పెళ్లి కూతురి చీర, నగల ఖరీదు తెలిస్తే…!
గనుల మహరాజ్.. గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం బెంగళూరు ప్యాలెస్‌లో జరుగుతున్న ఈ పెళ్లిపైనే దేశం మొత్తం దృష్టి పెట్టింది. వాస్తవానికి నోట్ల రద్దు విషయం పెద్ద టాపిక్ కాకపోయి ఉంటే గాలి వారింట పెళ్లికి మించిన పెద్ద టాపిక్ ఇంకోటి ఉండేది కాదు!! ఆకాశ మంత పెళ్లిపందరి, భూదేవంత పెళ్లి పీట అనే మాటలు ఇప్పటి వరకు మనం కేవలం విన్నాం. కానీ, గాలి […]
కేసీఆర్ బ్లాక్ మనీతో జీతాలు ఇచ్చారా..!
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లాక్ మనీ నిరోధానికి తాము వ్యతిరేకం కాదని, అయితే, ఈ క్రమంలో మోడీ తీసుకున్న నిర్ణయమే తమ ఆదాయాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని కేసీఆర్ విమర్శించారు. లెక్కలతో సహా ఆయన పక్కాగా విమర్శించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, రియల్ దెబ్బతినడం వంటి కారణాలతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని, దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ […]
చంద్రబాబుది రావణాసురుడి అన్నయ్య పాలనా?!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఏపీ సీఎం చంద్రబాబుపై వెరైటీగా విరుచుకుపడ్డారు. ఏపీలో భయపడుతూ బతకాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన రావులపాలెం – అంతర్వేది ముద్రగడ కాపు సత్యాగ్రహ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంది. ముద్రగడపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయని పోలీసులు ఆయన పాదయాత్రలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంటూ ముద్రగడను మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్దే నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులకు, ముద్రగడకు […]