నోట్ల ర‌ద్దు బాబుకు ముందే తెలుసు..ఎవిడెన్స్ ఇదిగో

గ‌డిచిన ప‌ది రోజులుగా దేశాన్ని అత‌లాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల ర‌ద్దు సామాన్యుల నుంచి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ‌ర‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. చిల్ల‌ర దొర‌క‌క సామాన్యులు ఇబ్బందులు ప‌డుతుంటే.. పెద్ద నోట్ల హ‌డావుడితో అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ఇదిలావుంటే, ఈ నోట్ల ర‌ద్దు పై రాత్రి ఎనిమిది త‌ర్వాత స‌డెన్‌గా వెల్ల‌డించిన ప్ర‌ధాని మోడీ.. ఇలాంటి నిర్ణ‌యాల‌ను అక‌స్మాత్తుగా(స‌డెన్‌గా) వెల్ల‌డించ‌డం, అత్యంత ర‌హ‌స్యంగా ఉంచ‌డ‌మనే రెండు సూత్రాల ఆధారంగా ప‌ని చేశామ‌ని, అందుకే ఇప్పుడు ఇలా […]

పెద్ద నోట్ల ర‌ద్దుపై మోడీకి సుప్రీం షాక్‌

న‌ల్ల‌ధ‌నంపై పోరు, ప‌న్ను ఎగ‌వేత దారుల‌పై కొర‌డా అంటూ దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకి సుప్రీం కోర్టు దిమ్మ‌తిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది! మీ ప‌ద్ధ‌తి చూస్తుంటే.. దేశంలో జ‌నాల్లో తిరుగుబాటు వ‌చ్చేలా ఉంద‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న‌మోదైన కేసుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ  కేంద్ర అటార్నీ జ‌న‌ర‌ల్ చేసిన వాద‌న‌ల‌పై సుప్రీం కోర్టు […]

టీ పీసీసీ రేసులో ముగ్గురు హేమాహేమీలు!

తెలంగాణ కాంగ్రెస్ సార‌ధి మార‌నున్నారా? ప‌్ర‌స్తుత టీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ ప‌నిత‌నంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందా? ఆయ‌న‌ను మార్చి.. కాయ‌క‌ల్ప చికిత్స చేస్తేనే పార్టీ కి 2019లో మ‌నుగ‌డ ఉంటుంద‌ని భావిస్తోందా? అంటే ఔన‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆక‌ర్ష్ తో కాంగ్రెస్‌కి చెందిన హేమా హేమీలు హ‌స్తానికి చెయ్యిచ్చి పార్టీ కండువాలు మార్చేశారు. ఈ క్ర‌మంలో స‌మ‌ర్ధంగా వ్య‌వ‌హ‌రించి వాళ్ల‌ని పార్టీ మార‌కుండా నిల‌వ‌రించే య‌త్నం […]

నోట్ల ర‌ద్దు వెన‌క బీజేపీ బ్ర‌హ్మ‌చారులు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్ చూసినా, ఏ పేప‌ర్ చూసినా.. ఆఖ‌రికి ఏ ఇద్ద‌రు క‌లిసినా.. నోట్ల ర‌ద్దు విష‌యమే క‌నిపిస్తోంది.. వినిపిస్తోంది! ఇక‌, నెటిజ‌న్ల తీరే వేరు క‌దా.. సోష‌ల్ మీడియాలో అయితే, కామెంట్ల‌కు, జోక్‌ల‌కు కొద‌వేలేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. న‌ల్ల‌ధ‌నంపై పోరును ఆయ‌న స్వాగ‌తిస్తూనే కొన్ని ఆస‌క్తి క‌ర కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం […]

లైవ్‌లో క‌నిపించిన అంత‌రిక్షంలో ఎగిరే వ‌స్తువు!

అంత‌రిక్షంలో అద్భుతాలపై జ‌రుగుతున్న వేట ఈనాటిది కాదు! అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోంది? ఎవ‌రుంటారు? ఏం చేస్తారు? ఫ‌్ల‌యింగ్ ప్లేట్స్‌(ఎగిరే ప‌ళ్లాలు), యూఎఫ్‌వో(అన్ ఐడెంటిఫీడ్ ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్‌)(గుర్తించ‌లేని ఎగిరే వ‌స్తువు/ప‌దార్థం) వంటి అనేక‌మైన అంతు చిక్క‌ని అంశాల‌పై నేటికీ అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో అంత‌రిక్షానికి సంబంధించిన ఎలాంటి చిన్న వార్త‌, లేదా స‌మాచారం వ‌చ్చిన అది పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తోంది. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి వెలుగు లోకి వ‌చ్చింది. దీంతో […]

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టేశారా..!

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రితో ప‌నుంటుందో చెప్ప‌లేం! గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ లెవిల్ వర‌కు అంద‌రూ మిత్రులే! అదేస‌మ‌యంలో ఎప్పుడు ఎవ‌రితో అవ‌స‌రం తీరుతుందో కూడా చెప్ప‌లేం. ఇది పాలిటిక్స్‌లో న‌యా ట్రెండ్ అన‌డానికి వీల్లేదు. ఎందుకంటే.. పాలిటిక్స్ అంటేనే అంత కాబ‌ట్టి!! ఈ విష‌యం అంతా ఎందుకంటే.. 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భారీ ఎత్తున మీడియాలో క‌నిపించిన విద్యాధికుడు, సీనియ‌ర్ నేత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. ఇప్పుడు దాదాపు ఎక్క‌డా క‌నిపించ‌డం […]

పాలిటిక్స్‌లోకి గాలి రీ ఎంట్రీ వెన‌క అస‌లు సీక్రెట్‌..?

త‌న కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించి దేశ వ్యాప్త జ‌నాల దృష్టినీ ఆక‌ర్షించిన మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న‌రెడ్డి.. మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  ఇప్ప‌టికే దీనికి సంబంధించి ప్ర‌ముఖ నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు సాగిస్తున్నారా? త‌నపై న‌మోదైన కేసుల నుంచి బ‌య‌ట‌పడేందుకు, కొత్త‌గా ఏవీ న‌మోదు కాకుండా చూసుకునేందుకు ఆయ‌న రాజ‌కీయాలే శ‌ర‌ణ్య‌మ‌ని భావిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. మ‌రి అదేంటో చూద్దాం. క‌ర్ణాట‌క  బీజేపీలో […]

బీబీసీ.. న్యూస్ ఇక‌, తెలుగులోనూ!

బ్రిట‌న్‌కి చెందిన బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) ప్ర‌సారాల‌కు ఉన్న క్రెడిబిలిటీ అంతా ఇంతా కాదు. ఏదైనా వార్త‌లు, లేదా స‌మాచారం నిర్ధార‌ణ కోసం ఇప్ప‌టికీ బీబీసీ ఛానెల్ చూసే వారు కొన్ని కోట్ల మందే ఉన్నారు. వేగం, వాస్త‌వం, వార్త‌ల్లో ప‌టుత్వం అనే మూడు ల‌క్ష‌ణాలే పెట్టుబ‌డిగా బీబీసీ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా ఈ సంస్థ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ముఖ్యంగా 2022 నాటికి దాదాపు 50 కోట్ల మంది వీక్ష‌కుల‌కి ఈ ఛానెల్ […]

మోడీకి అద్వానీ షాక్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ త‌గిలింది! వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ పేరు తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా గోద్రా ఘ‌ట‌న నేప‌థ్యంలో అద్వానీ.. గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ స‌ల‌హాను ప‌క్క‌న‌పెట్టి మోడీని ప్ర‌ధానిని చేసింది. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ అద్వానీ అదే విధ‌మైన వ్య‌తిరేకత వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]