అవును! తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది. నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్న చేసిన ప్రకటన తర్వాత తెలంగాణకు పెద్ద తగిలిందని వాపోయారు కేసీఆర్. రాష్ట్రానికి నిత్యం రిజిస్ట్రేషన్ల రూపంలో రావాల్సిన నిధులు రావడం లేదని కూడా ఆయన చెప్పారు. ఇక, చిన్నా చితక పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఫలితంగా కార్మికుల చేతల్లో డబ్బులేదని దీని ప్రభావం ప్రభుత్వంపై కనిపిస్తుందని ఆయన అప్పట్లో వాపోయారు. అయితే, […]
Category: Politics
రేవంత్ సొంత కుంపటి!
తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన రేవంత్.. తెలంగాణలో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారారనడంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న పద్ధతిలోనే ఉండిపోవు కదా! ఈ క్రమంలోనే రేవంత్ కూడా భవిష్యత్తును అంచనా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నికలకు అనుగుణంగా వ్యవహరించాలని, మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. […]
అమ్మ నెచ్చెలి.. శశికళ సీఎం ప్లాన్ తెలిస్తే.. !
సీఎం సీటంటే.. ఎవరికి చేదు చెప్పండి? పొలిటికల్ నేతలు ఎన్ని కష్టాలు పడినా.. ఆ సీటు కోసమేకదా?! అలాంటి హాట్ సీటు కోసం తమిళనాడులో దివంగత సీఎం జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళా నటరాజన్ ఎంతకు తెగించిందో తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. జయకు సన్నిహితురాలిగా, పోయెస్ గార్డెన్‌కి కాపలాదారుగా వ్యవహరించిన శశికళపై ఇప్పుడు అనేక కథనాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మతో స్నేహం వెనుక.. శశికళ ఆమె కుటుంబం పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబరు […]
జగన్ మంచి జోష్ మీద ఉన్నారు.
వైకాపా అధినేత జగన్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. 2014లో కొంచెం తేడాతో సీఎం సీటు కోల్పోయానన్న బాధ ఆయనను ఒక పక్క వేధిస్తున్నా.. మరోపక్క మాత్రం.. పొలిటికల్‌గా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆకర్ష్ పిలుపుతో వైకాపా నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోయాయి. క్యూకట్టి మరీ.. వైకాపా నేతలు, జిల్లా స్థాయి ఇంచార్జ్‌లు సైతం సైకిలెక్కేశారు. దీంతో జగన్‌కి […]
మోడీ మంత్రివర్గంలో టీఆర్ఎస్
పాలిటిక్స్ అన్నాక నిన్న కొట్టుకున్న వాళ్లు.. నేడు కలిసిపోవడం, నేడు తిట్టుకున్నవాళ్లు .. రేపు కలిసిపోవడం మామూలే. ఇప్పుడు ఇదే సీన్.. తెలంగాణ అధికార పార్టీలోనూ కనిపిస్తోందని సమాచారం. నిన్న మొన్నటి వరకు కేంద్రం తమపై వివక్ష చూపిస్తోందని, నిధులు సరిగా ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున విరుచుకుపడిన టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి నేతృత్వ పార్టీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయ్యారనే టాక్ హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి […]
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్ టు డీఎంకే
తమిళనాడు రాజకీయాల్లో అత్యంత వేగవంతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత మరణంతో ఆ పార్టీ ఒంటరి అయిపోయింది. అమ్మకు ముందు చూపు లేకపోవడంతో పార్టీకి వారసుడిని తయారు చేయని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీని ఎవరు నడిపించాలని, ప్రభుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాలకు సమాధానం దొరకకపోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వారసులు పుట్టగొడుగులా తయారయ్యారు. దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి […]
రేవంత్‌పై తమ్ముళ్ల గరంగరం
పాలిటిక్స్ అన్నాక శత్రువులు విపక్షంలోనే ఉండనక్కరలేదు! సొంతపార్టీలోనూ శత్రువులు ఉండొచ్చు. అసలామాట కొస్తే.. ఉంటారు కూడా! ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే.. తెలంగాణ టీడీపీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ టీడీపీ లోనే శత్రువులు ఎక్కువయ్యారట! ఇప్పుడు అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఒక పక్క పార్టీ అధినేత చంద్రబాబు.. అందరూ కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని, కలసి ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు. అయితే, అధినేత ఆశలకు విరుద్ధంగా తెలంగాణ టీడీపీలో కార్యక్రమాలకు […]
ఏపీలో న్యూ పాలిటిక్స్: బీజేపీ టూ వైకాపా
బీజేపీ విజయవాడ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కమల దళం నుంచి బయటకు జంప్ చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని బీజేపీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ పరిణామం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్న క్రమంలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బతగిలినట్టే చెప్పొచ్చు. వాస్తవానికి వెల్లంపల్లి ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. అయితే, చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో […]
రాహుల్‌కి చెక్ పెడుతున్న దీదీ!
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా.. అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశాన్ని తమ ఎదుగుదలకు సోపానంగా మలుచుకోవాలి. అప్పుడే జనాల్లో ఆ పార్టీ పట్లా.. నేతల పట్లా ఆదరణ పెరిగేది. అధికార పక్షం చేసే తప్పులను తమకు అనుకూలంగా మలుచుకునేదే అసలు సిసలైన విపక్షం. ఈ విషయంలో ఎందుకోగానీ ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ వెనుకబడిందనే చెప్పాలి. అదేసమయంలో ఈ పార్టీని వెనక్కి నెడుతూ.. అందరూ దీదీగా పిలుచుకునే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ని వెనక్కి […]