తెలుగు వారి మనస్సాక్షి.. సాక్షి! అంటూ తెలుగు లోగిళ్లలోకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాక్షి దినపత్రిక ఓ సంచలనం! అప్పటి వరకు ఉన్న మీడియా ఆధిపత్యానికి గండి కొడుతూ.. కేవలం రూ.2కే దాదాపు 18 నుంచి 20 పేజీలతో సమగ్ర సమాచారాన్ని అందించిన పత్రిక అత్యంత స్వల్ప కాలంలోనే తెలుగు ప్రజల మనసు దోచుకుని.. తెలుగు లోగిళ్లకు దగ్గరైంది. వాస్తవానికి కాంగ్రెస్ అనుకూల పత్రికగా అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత వైఎస్ మరణం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో […]
Category: Politics
జనసేనలోకి గోడమీద గోపీలు
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు! నేతలు ఎప్పుడూ ఒకే పార్టీని నమ్ముకుని ఉంటారన్న గ్యారెంటీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరికలు నెరవేరకపోయినా.. పక్క పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా నేతలు తమకు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి పక్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీలకు కొదవలేదు. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవల దాకా క్యూ కట్టి మరీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేతల తరహాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సర్వే భయం
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బాట పట్టినట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం? వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తే.. ఎంత వరకు నెగ్గుతారు? వంటి పలు విషయాలపై చంద్రబాబు మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా తన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై సర్వే చేయించారట. ప్రస్తుతం ఈ విషయంపైనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. సర్వేలో ఫెయిల్ అయిన […]
పవన్ దెబ్బకు భయపడ్డారా
ఇప్పుడు అందరూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్రజల పక్షాన నిలిచిన జనసేని.. స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మరీ చర్చించారు. బాధితుల రోదనలు స్వయంగా చూశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్కరాల పేరుతో రూ.250 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలకు జనాలు నానాతిప్పలు పడుతున్న సంగతి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఒకరకంగా అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ […]
కేసీఆర్ తో స్నేహం కాదు..రణమే..!
జాతీయ పార్టీ బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతుండగా.. తెలంగాణలో మాత్రం ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విభజనకు బీజేపీ మద్దతు వెనుక ఉన్న వ్యూహం ఇదే. చిన్న రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు అవకాశం మెండుగా ఉంటుందని బీజేపీ నమ్ముతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి మద్దతిస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు రెండు […]
వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!
వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్నటైపులో ఈ పార్టీకి శాసన సభ్యుల లెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు లభించనుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియర్ మోస్ట్ లీడర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జగన్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితిలో వైకాపా నేతలు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో […]
టీ కాంగ్రెస్ సారథిగా అజారుద్దీన్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కకావికలమవుతున్నాయి. కేసీఆర్ వేసే ఎత్తులకు ప్రతిపక్షాలన్ని చిత్తుచిత్తవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు ధీటుగా ఫైట్ చేయలేకపోతోందన్న అభిప్రాయం టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. టీ పాలిటిక్స్‌లో సీనియర్ లీడర్లుగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి – జానారెడ్డి – భట్టి విక్రమార్క్ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి – డీకే అరుణ – జీవన్‌రెడ్డి ఇలా ఎవరిని చూసుకున్నా సఖ్యత లేకపోవడంతో కేసీఆర్‌కు తిరుగేలేకుండా పోతోంది. వీరిలో […]
టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ప్రయారిటీ ఏంటి?
ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా తానై మేనమామ కేసీఆర్ చెప్పినట్టు నడుచుకొన్న ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి తెలంగాణలో ఏ సమస్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్‌లోకి దూసుకుపోయి.. సమస్యలను పరిష్కరించడంలో హరీష్.. తన స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనను తొక్కేస్తున్నారనే టాక్ వినబడుతోంది. టీఆర్ ఎస్‌లో ఆధిపత్య పోరు మొదలైనప్పటి నుంచి పరోక్షంగా హరీష్‌ను తెరవెనుకకే పరిమితం […]
రోజాకి పోటీగా మంచు లక్ష్మి..!
గత కొన్నాళ్లుగా కలెక్షన్ కింగ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టే కనిపిస్తోంది! పోలిటికల్‌గా తాను పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా.. తన కూతురు మంచు లక్ష్మిని రంగంలోకి దింపాలని మోహన్ బాబు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేతను అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక వంకతో ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూతురిని వెంటబెట్టుకుని మరీ కలిశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జనవరి 1న కూడా చంద్రబాబు తన […]