ఉవ్వెత్తున అలలతో ఎగసిపడే సాగర తీరం.. నిరసనలు, దిగ్బంధనలు, పోలీసుల తోపులాటలు, అరెస్టులతో అట్టుడికింది. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించిన విశాఖ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదానికి వేదికగా మారింది. రిపబ్లిక్ డే రోజున బీచ్‌లో యువత చేపట్టిన మౌన నిరసనను ప్రభుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్యమంలో గెలిచిందెవరు? జనసేననా లేక ప్రతిపక్ష వైసీపీనా లేక యువతా లేక ప్రభుత్వమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి దీనికి […]
Category: Politics
పవన్ విషయంలో టీడీపీ దొరికిపోతోందిగా..!
జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ ఆది నుంచి అనుసరిస్తున్న వైఖరే మరోదఫా స్పష్టమైంది! పవన్‌ని విమర్శించేందుకు టీడీపీ నేతలు ఎంతమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారనడానికి నిన్న జరిగిన విశాఖ ఆందోళనే పెద్ద ఉదాహరణ. నిజానికి గురువారం విశాఖలో తలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు! నిజానికి అది సక్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాదని.. అందరూ కొట్టుకు చ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చప్పుళ్లలో ఆ ఆందోళన సముద్రంలో […]
ఆ ఇద్దరు మంత్రులను ఆదర్శంగా తీసుకోమంటోన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ మంత్రులు, సీనియర్ నేతలకు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రావెల కిశోర్ బాబు, పీతల సుజాతలు సహా సీఎంపై నోరు పారేసుకుంటున్న కరణం బలరాం వంటి వారిని ఉద్దేశించి చంద్రబాబు కామెంట్లు చేశారని తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బాబేంటి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారేంటి అని కూడా అనుకున్నారట. మొత్తానికి తీవ్ర సంచలనం […]
ఎట్‌హోంలో చంద్రుల మధ్య ఆసక్తికర చర్చ
గవర్నర్ సమక్షంలో మరోసారి ఇద్దరు చంద్రులు కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని సానుకూలంగా చర్చించుకున్నారు!! మరోసారి వీరి కలయికకు వేదికగా మారింది ఎట్ హోం కార్యక్రమం! ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీఎంలు.. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హైకోర్టు విభజనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కలుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నారనే అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం […]
సోషల్ మీడియాలో హోదాపై నెగెటివ్ ప్రచారం
ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడేందుకు యువత సిద్ధమవుతోంది, తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యమించేందుకు సమర శంఖం పూరిస్తోంది. నమ్మించి వంచించిన ప్రభుత్వం, నేతలు యువత ఉద్యమానికి బాసటగా నిలవలేక పోతున్నారు. ప్రస్తుతం హోదాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ముఖ్యంగా హోదాకు మద్దతుగా చేస్తున్న ప్రచారానికి నెగెటివ్ ప్రచారం మొదలైంది. హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనమేదీ లేదనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది. తమిళ యువత జల్లికట్టు కోసం చేసిన […]
టీడీపీతో అమీతుమీకి సిద్ధమైన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి గర్జించాడు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు! హోదా ఇస్తామని మాట తప్పిన నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ యువత చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను ఏ పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చిందో వివరించాడు. అంతేగాక తనను విమర్శించే వారికి తగిన సమాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]
కేటీఆర్‌పై బావ అనంతప్రేమ
తెలంగాణ మంత్రివర్గంలో బావ-బావమరుదులెవరో అందరికీ తెలిసిన విషయమే. వారిలో ఒకరు సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అయితే మరో వ్యక్తి భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు. టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ తర్వాత వారసత్వం కోసం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను పట్టుకోసం ఎత్తులు వేస్తున్నారన్న వార్తలపై ఎప్పటికప్పుడు వారు క్లారిటీ ఇస్తున్నా ఈ పుకార్లు మాత్రం షికార్లు […]
జగన్‌కు చిన్నాన్న షాక్
శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్‌కు ఝలక్ తగలబోతోంది. పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు జగన్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఒక చిన్నాన్న పార్టీలోకి తిరిగి వస్తే.. మరో చిన్నాన్న ఇప్పుడు పార్టీ నుంచి వెళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారట. కొంతకాలం నుంచి వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెందారట. దీంతో తన కుటుంబంతో సహా జగన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి […]
ఆ ఇద్దరిపై బాబు కోపానికి అర్థాలు వేరయా.. ?
క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. మరోసారి తానేంటో స్పష్టంచేశారు. క్రమశిక్షణ రహిత చర్యలకు పాల్పడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇద్దరు మంత్రుల పనితీరు పార్టీకి తలనొప్పిగా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించిన అయ్యన్నపాత్రుడు, జానీమూన్ వ్యవహారంలో రావెల కిశోర్‌బాబులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. తోక జాడించే వారి విషయంలో కత్తెరకు పని చెబుతానని కూడా ఓపెన్ గా చెప్పేశారట. బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా […]