ఏపీలో సొంతంగా బలపడాలని బీజేపీ సిద్ధమైంది. పార్టీ కొన్ని చోట్ల బలంగా ఉన్నా.. శ్రేణులన్నింటినీ ఏకం చేసి ఎవరు నడిపిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవరూ కాదని ఒక ఫేమస్ ఫేస్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఏపీలో […]
Category: Politics
సుజనా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు
వ్యాపారవేత్తగానే కాదు.. రాజకీయ నాయకుడిగానూ తానేంటో నిరూపించారు సుజనా చౌదరి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండదండలందించి.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఎన్నికల్లో ఏపీలో, ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతూ తన వ్యూహాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక పవర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్పటివరకూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. కానీ సుజనా తన చతురతతో ఆయన్ను లైమ్ లైట్ నుంచి తప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగనే ముందు
దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ […]
2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..
పార్టీని స్థాపించి మూడేళ్లయినా ఇంకా నిర్మాణ కార్యక్రమాలపై దృష్టిసారించడం లేదన్న విమర్శలకు చెక్ చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని ప్రకటించిన జనసేనాని.. ఇప్పుడు ఆ కార్యాచరణను ప్రారంభించారు. తాను పోటీచేస్తానని ప్రకటించిన అనంతపురం జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనసేన సైనికులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని […]
పవన్‌తో కేటీఆర్ `సెల్ఫీ` … వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని చూసిన సందర్భంగా.. కేటీఆర్, పవన్‌తో సెల్ఫీ దిగి.. పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు సమయంలో పవన్ చేసిన ప్రసంగాల వల్ల ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్‌తో సెల్ఫీ […]
ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ విజయం ఆ పార్టీకి ఎక్కడ లేని జోష్ ఇచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిపడిన బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీల సహకారం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్రయోగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నారట. […]
ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్రవాహం అధికంగా ప్రభావం చూపిన ఈ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో […]
విపక్షాలకు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్ .. సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీలు
ఇరు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పక్షాలు.. చివరకు విపక్షాల చేతికి చిక్కాయి! తెలంగాణతో పోల్చితే ఏపీలో బలమైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేతలు సమాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణలో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. తమ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార పక్షాలు ఇప్పుడు […]
నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ .. ఎలా ఉంటుంది?
తెలంగాణలోని అన్ని జిల్లాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి ఆధిపత్యం సంపాదించారు. కానీ ఒకే ఒక్క జిల్లా నల్గొండలో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది, మెజారిటీ సాధించినా.. కాంగ్రెస్‌కు కూడా ఆ జిల్లాలో మంచి పట్టు ఉండటంతో కేసీఆర్.. ఈజిల్లాపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండలో కూడా పూర్తి మెజారిటీ సాధించేందుకు స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా అక్కడి కాంగ్రెస్ నేతలకు చెక్ చెప్పేలా.. తాను నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారట. […]
