పీకే జ‌వాబుతో అంద‌రూ ఫూల్స్

`వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మ‌రోసారి విజ‌యం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంత‌మంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించేశారు. ప్ర‌స్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేత‌ల‌ను ఇరుకున పెట్టి సోష‌ల్ మీడియాలో వీలైనంత వ‌ర‌కూ ల‌బ్ధి పొందాల‌ని చూసిన వీరంతా.. `ఇదంతా […]

నంద్యాల టీడీపీలో `ఎవ‌రికి వారే య‌మునా తీరే’

నంద్యాల ఉప ఎన్నిక‌ల అధికార పార్టీ నేత‌ల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న నాటి నుంచి వ‌రుస విభేదాలు ర‌గులుతున్న వేళ‌.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డ్డాయ‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల్సిన చోట `ఎవ‌రికి వారే య‌మునా తీరే` అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా త‌మ‌కు ప‌ట్టున్న నియోజక‌వ‌ర్గంలో వేరే వారికి గెలుపు బాధ్య‌తలు అప్ప‌జెప్ప‌డాన్ని మంత్రి అఖిల‌ప్రియ జీర్ణించుకోలే క‌పోతున్నారు. తన తండ్రి నియోజక‌వ‌ర్గంలో.. ఇత‌రుల ప్ర‌మేయంపై తీవ్ర […]

జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ వెన‌క‌..!

టీడీపీ అంటే ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ముళ్లా క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గ‌తం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో ఎవ‌రికి వారే ఇష్ట‌మొచ్చిన‌ట్టు స్వ‌రం పెంచేస్తున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వార్నింగ్‌లు కూడా ప‌ని చేయ‌డం లేదు. చాలా మంది అయితే చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎవ‌రో ఒక నాయ‌కుడు నోరు జార‌డం, అది మీడియాలో హైలెట్ […]

టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. […]

2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]

క‌విత ఎంపీ సీటుపై ట్రావెల్స్ అధినేత కన్ను

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె మ‌రోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. మంత్రి అవ్వాల‌న్న కోరిక క‌విత‌కు బ‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమెకు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న […]

న‌ల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓట‌మేనా..!

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట‌. చంద్ర‌బాబు సీఎంగా గెలిచిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్క‌డ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయ‌కులు అంద‌రూ ఉన్నారు. న‌ల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, నాగార్జునా సాగ‌ర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, […]

చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు `రిజ‌ర్వేష‌న్ల` అంశంలో త‌ల‌నొప్పులు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియ‌క సందిగ్థంలో ఉన్నారు. ఇప్ప‌టికే కాపు రిజర్వేష‌న్ల అంశంపై ఆందోళ‌న‌లు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్ర‌బాబుకు.. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాల‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుంటే మాదిగ‌లు దూర‌మైపోతారు.. అదే స‌మ‌యంలో మాదిగ‌ల‌ను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇత‌ర […]