నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గతంలో ఎన్నిడూ లేనంతగా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంటలు గడిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ నమోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నికలో కావడంతో ఎన్నికల సంఘంలో తలు పండిన సీనియర్లు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఇంత వెల్లువలా నంద్యాల ఉప పోరు జరుగుతుందని వారు అస్సలు ఊహించలేదు. ఇంకో మరింత ఆశ్చర్యకర పరిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిరగలేని పరిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు […]
Category: Politics
నంద్యాలలో ఓటర్ల క్యూలే క్యూలు.. బాబు, జగన్‌కు టెన్షన్… టెన్షన్
నిన్ని మొన్నటి వరకు అందరూ రావాలి ఓటు హక్కు వినియోగించుకావాలి.. అంటూ భారీ ఎత్తున రీసౌండ్ వచ్చే మైకులు పెట్టుకుని మరీ ఊరూ వాడా తిరుగుతూ నంద్యాల జనాల చెవుల్ని హోరెత్తించిన టీడీపీ, వైసీపీల్లో తీరా ఇప్పుడు ఓటింగ్ మొదలయ్యే సరికి భయం పట్టుకుంది! దీనికి కారణం నంద్యాల ఓటర్లే!! గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నంద్యాల ఓటర్లు.. పోలింగ్ బూతుల ముందు క్యూల మీద క్యూలు కట్టారు. పండు ముసలోళ్ల నుంచి యువకులు, […]
జగన్‌పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం
ఏపీ విపక్ష నేతగా బాధ్యతా యుత స్థానంలో ఉండి.. నలుగురికీ ఆదర్శంగా రాజకీయాలు చేయాల్సిన వైసీపీ అధినేత జగన్.. నోటి దురద కారణంగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. అది కూడా తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నంద్యాల ఉప పోరుకు ఎన్నిక జరుగుతు సమయంలో కావడంతో ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు ముందు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న శిల్పా బ్రదర్స్‌ని వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ […]
టీడీపీకి ఆ హీరోయిన్ గుడ్ బై..!
ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువవ్వడంతో ఇప్పటికే చంద్రబాబుకు చాలా నియోజకవర్గాల్లో తలనొప్పులు ఎక్కువయ్యాయి. వీటికి తోడు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు సైతం పార్టీని వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. నిన్నటి తరం హీరోయిన్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన కవిత ఏపీలో అధికార టీడీపీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు […]
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ..వైసీపీ వెర్షన్ ఒకలా.. టీడీపీ వెర్షన్ మరోలా
తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న ఏపీలోని నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం తీవ్ర ఉత్కంఠ మధ్ స్టార్ట్ అయ్యింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ 10 గంటలకే అనధికారికంగా 22 శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. నంద్యాల ఓటరు మంచి హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంటలకే 40-50 […]
బాబు `ముందస్తు` ప్రణాళిక తెలిస్తే షాకే!!
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం మాదే అంటే మాదే అని టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. అంతేగాక ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో అని లెక్కలు కూడా వేసేసుకుంటున్నాయి. తన మూడేళ్ల పాలనకు ఈ ఎన్నికల్లో గెలుపే నిదర్శనమని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీకి 15 వేల మెజారిటీ వరకూ వస్తుందని అంతర్గత సర్వేల్లో తేలింది. అది సరిపోదని ఇంకా పెంచాలని నేతలను ఆయన ఆదేశించడం గమనిస్తే.. సరికొత్త వ్యూహంలో […]
వెంకయ్యకు సన్మానం వెనక కేసీఆర్ ఓట్ల వ్యూహం
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని.. షాకులిస్తారో అని ప్రత్యర్థులు ఆందోళన చెందుతూనే ఉంటారు. ఏదో సాదాసీదా కార్యక్రమం నిర్వహించినా.. లేక ఏదైనా చిన్న మాట మాట్లాడినా వాటి ఫలితం మాత్రం దిమ్మదితిరిపోయేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి రెండేళ్లలోపే ఎన్నికలు వస్తున్న తరుణంలో.. అన్ని వర్గాలు టీఆర్ఎస్‌కు పట్టం కట్టేలా ఆయన ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే ఇందులో చాలా వరకూ సక్సెస్ అయిన […]
నంద్యాలలో టీడీపీని ఓడించాలని గోదావరి జనాల ర్యాలీ
నంద్యాలలో టీడీపీని ఓడించాలని వైసీపీ వాళ్లు, వైసీపీని ఓడించాలని టీడీపీ వాళ్లు రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు. అక్కడ స్కెచ్‌లు అలా ఉంటే కర్నూలు జిల్లాకు అవతల జిల్లాలకు చెందిన జనాలు కూడా నంద్యాలలో వైసీపీకి ఓట్లేసి టీడీపీని ఓడించాలని ర్యాలీలు చేస్తుండడం విశేషం. గోదావరి జిల్లాల పేరు చెపితే అధికార టీడీపీకి ఎంత కంచుకోటలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే మొత్తం పసుపే గుర్తుకు వస్తుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 15 అసెంబ్లీ […]
హోరా హోరీ పోరుకు కవిత సిద్దమేనా…!
తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సీఎం కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని వాడ వాడల్లోకి గడప గడపలోకి తీసుకువెళ్లిన పోరు నారి.. కల్వకుంట్ల కవితకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటి అగ్ని పరీక్ష ఎదురైంది.! తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ యువ నారి.. సటైర్లతో ఎదుటి వారిని కుమ్మేయడమేకాకుండా.. జనాల్ని ఆకట్టుకోవడంలోనూ నాన్నకు తగ్గ కూతురే! ఇక, నిజామాబాద్ ఎంపీగా కూడా చక్రం తిప్పుతున్న కవిత 2014 […]