నంద్యాల ఉప ఎన్నిక దేశ రాజకీయాలను ఎలా తన వైపునకు తిప్పుకుందో అందరం చూశాం. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ ఏకంగా ఏపీ సచివాలయంలో ఉన్న మంత్రులతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు సరిపోక వైసీపీ నుంచి తమ పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేలను కూడా అక్కడ దింపేసింది. నంద్యాలలో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచి సత్తా చాటింది. టీడీపీ ఇక్కడ గెలిచి వారం రోజులు కూడా కాకముందే అప్పుడే నంద్యాలలో ముసలం మొదలైపోయింది. అసలు […]
Category: Politics
వంగవీటిపై వర్మ కాంట్రవర్సీ కామెంట్స్
కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్‌వర్మ మరోసారి తనదైన స్టైల్లో కాంట్రవర్సీ కామెంట్లతో రెచ్చిపోయాడు. తాజాగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీపై పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాపుల్లోను, వంగవీటి అభిమానుల్లోను పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ కాంట్రవర్సీ దెబ్బతో జగన్ ఏకంగా గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ వివాదంలో వంగవీటి రాధా, ఆయన తల్లి రత్నకుమారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లడం రత్నకుమారి స్పృహ తప్పిపడిపోవడం ఈ తల్లికొడుకులు ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోవడం […]
మంత్రి ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి.. బాబు సతమతం!
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి, టీడీపీలోనే ఉండి సేవలు చేస్తున్న రామసుబ్బారెడ్డిల మధ్యఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నిజానికి వైసీపీ నుంచి ఆదిని టీడీపీలోకి పిలిచినప్పుడే.. సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. రెండు కత్తులు ఒకవొర సామెతను ఆయన తెరమీదకి తెచ్చాడు. అయినా కూడా బాబు ఇద్దరికీ నచ్చజెప్పడంతో అప్పటికి సర్దుకు పోయారు. దీంతో ఆదికి మంత్రి పదవి ఇచ్చారు బాబు. ఇక, ఇటీవల […]
మోడీ కేబినెట్ ప్రక్షాళన ఏపీకి లాభమా… నష్టమా..!
ఇప్పుడు అటు ఢిల్లీలోను, ఇటు అమరావతిలోనూ ఆ వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ తన కేబినెట్ విస్తరణను చేపడితే.. బాబుకు లాభం ఎలా? నష్టం ఎలా ? అనే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇప్పుడు ఈ చర్చకు ఎందుకు అవకాశం వచ్చింది? మరే రాష్ట్రంలోనూ లేని ప్రభావం కేంద్ర కేబినెట్ ఏపీపై ఎలా చూపుతుంది? అంటే.. బాబు మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం ఏపీ మూడేళ్ల పసిపిల్ల. దీనికి కేంద్రం నుంచే ఆలన, […]
హరిబాబుకు అందుకే మంత్రి పదవి రాలేదా..?
కంభంపాటి హరిబాబు! వృత్తి రీత్యా సీనియర్ ప్రొఫెసర్. అయితే, జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన ఉద్యమాల్లోకి మారారు. అటునుంచి వెంకయ్యతో ఏర్పడిన బంధం.. రాజకీయంగా మారి.. తొలుత ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్‌గా తర్వాత బీజేపీ నేతగా ఎదిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా హరి బాబు పని చేశారు. ఈ క్రమంలోనే వెంకయ్యతో ఉన్న బంధంతో విశాఖ నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. అయితే, ఆ తర్వాత ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని భావించిన […]
వైసీపీ మైనస్‌లే బాబును హీరోను చేస్తున్నాయా..!
ఏపీలో సైకిల్ జోరుగా హుషారుగా దూసుకుపోతోంది. ప్రతిష్టాత్మకంగాను, హోరాహోరీగాను జరుగుతాయని టీడీపీ వాళ్లు అంచనాలు వేసుకున్న ఎన్నికల్లో సైతం వైసీపీ బొక్కబోర్లాపడిపోతోంది. సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్కలు తెగికింద పడిపోతున్నాయి. నంద్యాల, కాకినాడ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలకే అందని విధంగా టీడీపీ గెలుస్తుండడంతో ఆయన కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హీరో ఎవరంటే నిస్సందేహంగా చంద్రబాబే అని చెప్పాలి. నంద్యాలలాంటి చోట్ల జగన్ ఏకంగా 15 రోజులు మకాం వేసి […]
బాబు కోడలికి సినీ గ్లామర్ టచ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి పేరు ఇప్పటి వరకు వ్యాపార వ్యవహారాల్లో మాత్రమే వినపడేది. చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ గ్రూప్‌ను లాభాల భాట పట్టించడంలో ఆమె ప్లే చేసిన కీ రోల్ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఫ్యూచర్‌లో బ్రాహ్మణి టీడీపీలో సమర్థవంతమైన నాయకురాలు అవుతారన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఆమెను లోక్‌సభకు పోటీ చేయించాలని కూడా చంద్రబాబు చూస్తున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. బ్రాహ్మణి వచ్చే ఎన్నికల్లో గుంటూరు […]
ఆ ప్లాన్‌తోనే వంగవీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలు!
ఊరకరారు మహానుభావులు- అన్నట్టుగానే.. రాజకీయ నేతలు సైతం తమ నోటిని ఊరికేనే పారేసుకుంటారా చెప్పండి? తమకు ఏమీ లాభం చేకూరదన్నప్పుడు అడుగు తీసి అడుగు కూడా వేయని నేతలు.. ఒక్కసారిగా కలకలం సృష్టించేలా? ఒక్కసారిగా తన పేరు బయటకు వచ్చేలా? తన చుట్టూతానే రాజకీయాలు నడిచేలా? తన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేశారంటే.. దాని వెనుక స్కెచ్.. ప్లాన్ అంతా ఇంతా ఉంటుందని ఊహించలేం. ఇప్పుడు అలాంటి భారీ స్కెచ్‌తోనే విజయవాడలో మాజీ కమ్యూనిస్టు నేత, […]
భగ్గుమన్న వంగవీటి ఫ్యాన్స్…. బంధువును బయటకు పంపేసిన జగన్
మూలిగే నక్కమీద తాటిపండు చందంగా ఉన్న బెజవాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముసలం మొదలైంది. వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి కాపులతో పాటు వంగవీటి రంగా, ఆయన తనయుడు రాధాపై చేసిన వ్యాఖ్యలు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర కలకలం రేపాయి. కాపులు, వంగవీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో […]