కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]
Category: Politics
ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..
ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి […]
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ […]
కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్న కేటీఆర్ మాటలు..?
హుజూరాబాద్ ఎన్నికలా.. ఆ విషయం గురించి పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడనేలేదు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత దాని గురించి మాట్లాడవచ్చు అని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చెప్పడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత హుజూరాబాద్ విషయంపై సూచనలు, సలహాలు చేసి ఉంటారని […]
సీఎం దత్తత గ్రామాల్లో జరిగింది నిల్ అని నిలదీస్తున్న టీపీసీసీ చీఫ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హల్ చల్ చేస్తున్నాడు. రెండు రోజుల పాటు అక్కడ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. మంగళవారం ప్రారంభించిన ఈ దీక్ష ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొదటి రోజు గ్రామంలో పర్యటించి ఓ దళిత కుటుంబం ఇంట్లో నిద్రించిన రేవంత్ రెండోరోజు బుధవారం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాడు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ.. సీఎం చేసిన పనులను సమీక్షిస్తున్నారు. అంతేకాక నేరుగా […]
నిన్న అరెస్టైన కేంద్రమంత్రికి నేడు బెయిల్..మరి నెక్స్ట్ ఏంటో?
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్పద వ్యాఖ్యలు చేయడంతో నిన్న కేంద్రమంత్రి నారాయణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్రమంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]
రాజకీయాల్లోకి సోనూసూద్..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!
సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటుడుగానే కాకుండా సమాజసేవకుడిగా దేశప్రజలందరి మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయన. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్ అందించడం, కరోనా పేషెంట్లకు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎందరికో సాయపడి రియల్ హీరో అనిపించుకున్నాడీయన. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా […]
టీఆర్ఎస్ నేతల్లో పెరుగుతున్న అసహనం.. అందుకు తుమ్మలే నిదర్శనం
తుమ్మల నాగేశ్వర్‌రావు.. ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని తన పాలేరు నియోజకవర్గంలో మూడేళ్లుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం తన హయాంలో మాత్రమేనని, అది కూడా మంత్రిగా ఉన్న కాలంలోనే ( 2018 డిసెంబర్) వరకు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ తరువాత తుమ్మల పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి కందుల […]
తెలంగాణకు యడ్యూరప్ప.. పుదుచ్చేరి లెఫ్టినెట్ గవర్నర్ గా తమిళి సై?
కర్ణాటక రాజకీయాలు దగ్గరనుంచీ గమనించే వాళ్లకు యడ్యూరప్ప పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. కన్నడ రాజకీయాల్లో తలపండిన యడ్యూరప్ప మొన్న సీఎం పదవి నుంచి తప్పుకున్న తరువాత సైలెంట్ అయ్యారు. అయితే కమలం పెద్దలు మాత్రం యడ్యూరప్పను రాష్ట్రంలోనే ఉంచితే కష్టమని, సొంత సర్కారుకే చిక్కులు వస్తాయని భయపడుతున్నారు. అందుకే ఆయను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని ఆలోచిస్తోంది. అధిష్టానం ఆలోచనలు ఇలా ఉంటే.. తాను మాత్రం రాజ్ భవన్ కు వెళ్లబోనని, ఇక్కడే […]