తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర వంద కిలోమీటర్లు దాటింది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని హుజూరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా గతనెల 28న బండి సంజయ్ హైదరాబాదులో తన పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమైన యాత్ర ఇపుడు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వరకు వచ్చింది. అక్కడికి 100 కిలోమీటర్ల నడక పూర్తవడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. దూకుడు పెంచిన […]
Category: Politics
షర్మిలకు నిరాశ మిగిల్చిన విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం..
అన్నను కాదని.. తెలంగాణలో పార్టీ ప్రారంభించి.. జనంలోకి వెళుతున్న షర్మిల పార్టీ వైటీపీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ప్రశాంత్ కిశోర్ సలహాలిస్తున్నా ఎందుకో షర్మిల రాజకీయంగా వెనుకబడే ఉన్నారని చెప్పవచ్చు. అందుకే కాస్త పొలిటికల్ మైలేజ్ తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ వర్ధంతిని ఉపయోగించుకుందామని ఎవరో సలహా ఇచ్చినట్లున్నారు. అనునకున్నదే ఆలస్యం.. హైదరాబాదులో వైఎస్ఆర్ ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మ. కార్యక్రమమైతే జరిగింది.. నాయకులు, మేధావులు మాట్లాడారు.. అయితే అనుకున్న ప్రచారం రాలేదు.. పెద్దగా ప్రయోజనమూ […]
అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…
వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.. ఇక కుటుంబపరంగా చూస్తే ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వైఎస్ఆర్ కు జగన్, షర్మిల సంతానమైతే.. కేసీఆర్ కు కేటీఆర్, కవిత. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పిల్లల విషయానికి వస్తే ఏపీలో […]
జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?
ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తూనే ఉంది.దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం: దేశవ్యాప్తంగా పేద ప్రజలు పస్తులు ఉండకూడదని కారణంచేత యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని 2005లో జాతీయ ఉపాధి […]
ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయకచవితి`..ప్రభుత్వంపై ప్రజలు ఫైర్
ప్రస్తుతం ఏపీ రాజకీయాలను `వినాయకచవితి` హీటెక్కించేస్తోంది. కరోనా థార్డ్ వేవ్ ముప్పు ఉందన్న కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేదని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం సరికాదంటూ ప్రభుత్వ తీరుపై హిందూ సంఘాలు మరియు ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]
సీఎం జగన్‌తో మంచు మనోజ్ భేటీ..వైరల్‌గా మారిన ట్వీట్!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్‌తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]
సారు .. ఆదివారం వరకు హస్తినలోనే ..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మరో మూడు రోజులపాటు ఉంటున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే సిటీకి తిరిగి రావాల్సి ఉంది. అయితే మోదీ, అమిత్ షాలను కలిసిన తరువాతే రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంఓను అధికారులు సంప్రదించారు. పీఎంఓ ఓకే అంటే.. మోదీని కలిసి ఆ […]
వాళ్లు సరే.. మరి వీరెందుకు వచ్చారు..?
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదు. షర్మిల పార్టీకి పెద్దగా మద్దతూ ఎవరూ ప్రకటించారు. అందరూ తమకు వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధం మాత్రం గుర్తుచేసుకున్నారంతే. ఈ సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ సీనియర్ నాయకులను ఆహ్వానించినా వారు తెలివిగా తప్పించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి,ఉండవల్లి అరుణ్ కుమార్, గిరీష్ సంఘి […]
పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?
తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే మంత్రం తెలిసిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు పేరుంది. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా దీదీ కోసం పనిచేసి.. ఆమెను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రశాంత్ కిశోర్ .. ఇక రాజకీయ వ్యూహరచనల ప్రస్థానం చాలిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. తాజాగా ఆయన […]