ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని […]

కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం టార్గెట్‌ చేసే కిషన్‌ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్‌గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్‌ రెడ్డి కేవలం తన శాఖాపరమైన […]

తెలంగాణపై జనసేనాని దృష్టి..కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఆయన ఏపీపైనే ఫోకస్ చేశారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, మేధావులతో చర్చలు.. ఇలా అన్నీ ఏపీ కేంద్రంగానే సాగాయి. మరెందుకో పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ గురించి ఆలోచించడం లేదు. పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ పవన్ మాటలకు బాగా కనెక్ట్ అవుతారు. దీనిని […]

కేటీఆర్ కు ఛాన్స్.. ఎర్రబెల్లికి నో ఛాన్స్.. ఇదేంది సారూ..!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమారుడు కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేంటి.. కేటీఆర్ .. ఆయన కుమారుడు.. మరి కుమారుడికి కాక ఎవ్వరికి ప్రాధాన్యం ఇస్తారు అని కూడా అనుకుంటారు. అయితే అభిమానం, ప్రేమ అనేవి మన వ్యక్తిగత విషయాలు.. వాటిని వ్యక్తిగతంగానే చూడాలి. అధికారికంగా వాటిని బహిర్గతం చేయరాదు. అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి.. కుమారుడికి ఇచ్చి.. ఇతరులకు ఇవ్వకపోతే పక్షపాతం చూపుతున్నారు అంటారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా […]

జగన్..విజయసాయి..మధ్యలో ఆదిత్య

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మామూలే. అయితే అందుకు భిన్నంగా వైసీపీలో జరుగుతోంది. నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా లోలోపల మాత్రం ఎత్తులు..పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగనే ముందున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదీ డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్టుగా ఆయనను సైడ్ చేయనున్నట్లు […]

ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా అందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియాలి కదా అనే భావనతో టెన్త్ క్లాస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్పించారు. పదవ తరగతి తెలుగు పుస్తకోం అమరావతి అనే పాఠం ఉంటుంది. ఇది […]

వైజాగ్ లో పీకే టీమ్ సర్వే..విజయసాయికి వ్యతిరేక పవనాలు

గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు కూడా పీకే పనిచేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైజాగ్ పై పీకే టీమ్ కాన్సంట్రేట్ చేసింది. అక్కడ ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వేలో వైసీపీ నేతలు.. ముఖ్యంగా స్థానిక నాయకుడు, పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి షాకయ్యే […]

ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అదేంటి.. ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది గత సంవత్సరమే కదా .. ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నిజామాబాద్ లో కవిత గెలిచింది ఉప ఎన్నికల్లో.. అప్పటికే సమయం […]

‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా […]