ఒకే సమావేశంలో కారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారం చేపట్టి ఏడేళ్లయింది. కమలం పార్టీ జాతీయస్థాయిలో ప్రధాన పార్టీగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు తోసి నరేంద్రమోదీ పార్టీని విజయంవైపు నడిపించాడు. ఇది ఓకే.. ఇక తెలంగాణలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా స్థానికంగా బీజేపీ నేతలతో విభేదించినా కేంద్రంలో మాత్రం మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు కొనసాగించింది. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపింది. మద్దతు తెలపలేని పక్షంలో సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు […]

‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]

కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా..కొన్నేళ్ళ క్రితం ఏపీ ఎస్ఈసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. […]

ఆలూ..లేదు.. చూలూ లేదు..

బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంలో ఉన్నట్టున్నాడు.. ఎంత ఉత్సాహమంటే.. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలు జరిగినట్లు.. ఫలితాలు వచ్చినట్లు.. బీజేపీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నంటు.. కమలం నాయకులు ఇంకా ఓ అడుగు ముందుకేసి తొలి సంతకం ఉచిత విద్యపై చేస్తామని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది..అయితే బీజేపీ మాత్రం ఇప్పటినుంచే గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాదులో రెండు రోజుల పాటు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆ […]

‘జూనియర్‌’ను ఏమీ అనకండి

తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత […]

మోదీసాబ్‌.. అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ తాను అనుకున్నది అనుకున్నట్లు కచ్చితంగా అమలు చేసి తీరతారు. ప్లాన్‌ పకడ్బందీగా ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పెద్దటీమ్‌ ఉంది. మోదీకి ఏదైనా ఆలోచన వస్తే చాలు.. దాని అమలుకు ఈ టీమ్‌ సర్వశక్తులు వడ్డుతుంది. సోషల్‌ మీడియాలోనూ అంతే.. మోదీ ఫాలోయింగ్‌ను ఈ టీమ్‌ ఓ రేంజ్‌లో పెంచుతుంది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ […]

రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…

తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్‌, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్‌ ఫ్యామిలీ […]

కేసీఆర్ వర్సెస్ ఈటల ..మధ్యలో రవీందర్..

హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఈటల మరింత చురుగ్గా ముందుకు వెళుతున్నారు. నన్ను.. అన్యాయంగా శిక్షించారు.. అవమానకరంగా పార్టీనుంచి బయటకు పంపారనేది ఈటల భావన. ఈ ఫీలింగును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టి ప్రయోజనం పొందాలనేది ఈటల ప్లాన్. అందులో భాగంగానే ప్లాన్ అమలు చేసి హుజూరాబాద్ లో సక్సెస్ అయ్యారు. ఇపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చాటి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల భావిస్తున్నారు. అందుకే […]

నిర్ణయం పాతదే అయినా.. ఉన్నట్టుండి తెరపైకి..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎవరికీ అంతుపట్టవు.. అందులోని అంతరార్థమూ అర్థం కాదు.. అలా అని అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయరు. కనీసం అడగాలనే ఆలోచన కూడా వారికి రాదు. అందుకు ఓ ఉదాహరణే.. రాజధాని మార్పు. మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్లీ వస్తామని అసెంబ్లీలో చెప్పేంతవరకు ఎమ్మెల్యేలకే తెలియదు. అంతెందుకు మంత్రి వర్గ సమావేశంలో జగన్ తన సహచరులకు వివరించేంతవరకు వారికి కూడా తెలియదు. విధానపరమైన నిర్ణయాలను […]