ఎన్నికల తరవాత పదవుల జాతర

కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇంకాఉన్నది కేవలం 18 నెలలే.. దీంతో పదవులు దక్కని నాయకులు పార్టీలో కేసీఆర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులొద్దు.. నామినేటెడ్ పోస్టులివ్వాలని కోరుతున్నారు. దీంతో బాసు.. నామినేటడ్ పోస్టుల భర్తీపై ద్రుష్టి సారించారట. ఈనెలల జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఈ కసరత్తు మొదలైనట్లు తెలిసింది. టీఎస్ఆర్టీసీతోపాటు బీసీ […]

డిపాజిట్లే రాలేదు.. అధికారం సాధ్యమా?

తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే మాట పదే పదే మీడియాతోపాటు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లి హైకమాండ్‌తో కూడా ఇవే ముచ్చట్లు చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు, జీహెచ్‌ఎంసీలో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను కాదని మనపార్టీ సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడితే అధికార పీఠంపై కూర్చోవచ్చు అనేది స్థానిక బండి […]

ఏపీలో ఉద్యోగులకు హ్యాపీ.. పీఆర్‌సీకి జగన్‌ అంగీకారం

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కరుణించారు. పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) పది రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. శుక్రవారం సీఎం జగన్‌ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు సీఎంను కలిసి పీఆర్‌సీ ఇవ్వాలని కోరినప్పుడు జగన్‌ ఈ మాట ఇచ్చేశారు. సీఎం నుంచి ఈ సమాధానం ఊహించని ఉద్యోగ సంఘాల నాయకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పటికే […]

కేసిఆర్ ..ఈ ప్రశ్నకు బదులేదీ?

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. పది రోజుల క్రితం హైదరాబాద్‌, ఢిల్లీలో ఇదే చర్చ. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వరిని కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్కులో నిరసనకు దిగారు. తరువాత ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీలో ఎవరినీ కలువకుండా తిరిగొచ్చారు. మరి ఎందుకు.. ఏమిటి అనేది ఆయనా చెప్పలేదు. ఎవరూ అడగలేదు. ఈ సమస్యపై పార్లమెంటులో కారు పార్టీ సభ్యులు రచ్చచేస్తున్నారు. కేకే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలే […]

ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నపుడు రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్‌ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]

వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. […]

మోదీని కలవాలనుంది…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్‌ పార్టీ పవర్‌లోకి వచ్చిన […]

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]

తుని వద్దు..ప్రత్తిపాడు సేఫ్‌

యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్‌ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక […]