హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]
Category: Politics
రవీందర్ కు అడ్డు వచ్చిన బండి..
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినుకు వహించిన రవీందర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల్లో విజయం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఈయన విజయానికి మాజీ టీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు […]
వారిని అదుపు చేయకపోతే కష్టమే..
కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై .. ఇపుడు మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ద్రుష్టి మొత్తం నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే ఉంది. రెండున్నరేళ్లుగా జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోని కవిత ఇటీవల జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు ఆమెకు జిల్లాలోని […]
మంత్రి మల్లారెడ్డి అంటే అంతే..
విద్యాసంస్థల అధినేత, మంత్రి మల్లారెడ్డి అంటే అంతే.. ఆయన రూటే సపరేటు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఇపుడు ఆయన వ్యవహార శైలి మాత్రం మేడ్చల్ జిల్లాలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భూ సమస్యలు, భూ కబ్జాలను ప్రోత్సహించడం, రియల్ వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లాంటివి చేస్తున్నాడని పార్టీలోని పలువురు నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా తనకు కేసీఆర్, కేటీఆర్ తనకు బాగా క్లోజ్ […]
కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి
ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]
పవన్‌తో స్నేహం కోసం లీకులిప్పిస్తున్న చంద్రబాబు
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటికి లభిస్తున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ఆయన వెన్నులో చలి మొదలైందా? అందుకోసం.. పవన్ కు ఉన్న అంతో ఇంతో బలాన్ని కూడా కలుపుకుని […]
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!
సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]
సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!
భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]
ఐపీఎస్‌లు సరే..మరి ఐఏఎస్‌ల బదిలీ ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. 30 మంది అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ముఖ్యంగా సిటీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ అయ్యారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇక పలు జిల్లాల్లో ఎస్పీలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఐఏఎస్‌లపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలెక్టర్ల బదిలీలను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]