కంచుకోట లాంటి నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేతులారా నాశనం చేస్తున్నారు..గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు పలు టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. సరే అప్పుడు జగన్ వల్ల దెబ్బతింటే..ఇప్పటికీ కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరగడం లేదు. దానికి కారణం స్వయంగా తెలుగు తమ్ముళ్లే అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు వల్ల పలు కంచుకోటల్లో టీడీపీ బలపడటం లేదు. అలా బలపడని కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి..ఇది పక్కా టీడీపీ […]
Category: Politics
గంటా-ముద్రగడలతో జగన్ ‘కాపు’ రాజకీయం..!
రాష్ట్రంలో కొన్ని వర్గాలు అధికార వైసీపీకి దూరమవుతున్నాయనే చెప్పాలి..గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఉండటంతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక..అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా జగన్ పాలన సాగుతుందా? అంటే ఆ విషయం ఆయా వర్గాల ప్రజలకే బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యే పరిస్తితి. ఇందులో మొదటగా కమ్మ వర్గం బాగా దూరమైంది..ఎందుకు దూరమవుతుందో […]
ఆత్మకూరుపై ఫోకస్..మేకపాటి ఫ్యామిలీకి చెక్..!
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద బలం కూడా లేదు. మొదట నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. కేవలం 1983, 1994 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది..ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచారు..అలాగే మంత్రిగా పనిచేశారు. కానీ మధ్య గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో గౌతమ్ సోదరుడు […]
‘బీసీ’ మంత్రం..ఈ సారి నమ్మేది ఎవరిని?
ఏపీలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాల ఓట్లని మళ్ళీ కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీసీలు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీసీ వర్గాలు మొదట నుంచి ఎక్కువగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో బీసీ వర్గం వైసీపీ వైపుకు వెళ్లింది..టీడీపీ కాపు రిజర్వేషన్లు వైపు మొగ్గు చూపడం, బీసీలకు అనుకున్న మేర అండగా లేకపోవడం, మరో వైపు జగన్ కాపు రిజర్వేషన్లు తన వల్ల […]
అటు పెడన..ఇటు మైలవరం..జోగి చిచ్చు..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే..జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న జోగికి రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కిన విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్‌లపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అలా మంత్రిగా ముందుకెళుతున్నారు. ఇక మంత్రిగా ఉంటూ తాను ప్రతినిధ్యం వహిస్తున్న పెడనలో […]
కమ్మ నేతకే విజయవాడ ఎంపీ సీటు.!
గత ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించిన కొన్ని సీట్లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంటే ఆ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదనే చెప్పాలి. కానీ ఈ సారి ఆ సీట్లని కూడా గెలుచుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గెలవని సీట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో విజయవాడ ఎంపీ సీటుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న ఈ సీటుని ఈ సారి ఎలాగైనా గెలుచుకోవలన్ […]
పెడన సీటు కాగితకే..అదొక్కటే రిస్క్!
వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు 120 పైనే నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన డేటాని తన వద్ద ఉంచుకుని..ఇంచార్జ్‌లకు పలు సూచనలు చేయడం, క్లాస్ పీకడం లాంటివి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, బాదుడేబాదుడు నిర్వహణ, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలని కలుపుని వెళ్ళడం..ఇలా పలు అంశాలపై సర్వే చేసి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్న వారికి దాదాపు సీటు […]
జగన్‌కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]
జగన్‌ని ఇరుకున పెడుతున్న సీనియర్లు.!
నెక్స్ట్ ఎన్నికల్లో ఏ ఒక్క వారసుడుకు కూడా సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడు ఉన్నవారే మళ్ళీ తనతో కలిసి పోటీ చేయాలని చెప్పి..ఆ మధ్య గడపగడపకు వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గడపగడపకు కొందరు ఎమ్మెల్యేలు తమ వారసులని తిప్పుతున్నారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యారు..ఎమ్మెల్యేలే గడపగడపకు వెళ్లాలని, వారసులు వెళితే కౌంట్ చేయమని చెప్పేశారు ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన […]