ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]

టీడీపీ ‘ఘర్‌వాపస్’..ఆ నాయకులతో టచ్‌లోకి!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘర్‌వాపస్ కార్యక్రమం చేపట్టింది. 2018 ఎన్నికల తర్వాత టీడీపీలో మిగిలిన వారు కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఆ పార్టీలో తక్కువ మంది నేతలు మాత్రమే మిగిలారు. అయితే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టారు. ఇటీవల ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు. ఆ సభ వేదికగానే..ఇతర పార్టీల్లోకి వెళ్ళిన మాజీ తమ్ముళ్లని మళ్ళీ తిరిగి […]

బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]

లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు […]

ఆనం వారి అసంతృప్తి..సిగ్నల్స్ ఇస్తున్నారా?

మొదట నుంచి అధికార వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అని చెప్పవచ్చు. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా సొంత పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. కాకపోతే రఘురామ మరీ దూకుడుగా విమర్శలు చేశారు. ఆనం విమర్శలు చేసినా మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీకి దూరం అవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో […]

కందుకూరు ఘటన..టీడీపీకి విషాదమే.!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు కార్యక్రమం చేస్తూ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరంల్లో బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు..అలాగే ఎలాంటి విషాద ఘటనలు జరగకుండా పర్యటనలు సక్సెస్ అయ్యాయి. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు రోడ్ షోలో ఊహించని ఘటన జరిగింది. బాబు రోడ్ షోకు భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక […]

పాడేరులో వైసీపీకి నెగిటివ్..టీడీపీకి నో పాజిటివ్?  

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని విషయం తెలిసిందే. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా ఆ నియోజకవర్గాల్లో నడుస్తోంది. ఇక ఇందులో పాడేరు గురించి మాట్లాడుకుంటే..1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాడేరు నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో వైసీపీ […]

ఊహించని ట్విస్ట్..కంచుకోటలో వెనుకబడ్డ టీడీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు పోటాపోటిగా నడుస్తున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలా గత ఎన్నికల్లో దారుణ పరాజయం చూసిన టీడీపీ..ఇప్పుడు నిదానంగా బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు […]