విభజన తర్వాత ఏపీ పరిపాలన అంతా నవ్యాంధ్ర నుంచే జరుగుతోంది. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేగాక జగన్ హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆయన్ను కలిసేందుకు నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ విషయాలు అధినేతతో మాట్లాడాలంటే హైదరాబాద్ వరకూ రావాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఎప్పుడు నవ్యాంధ్రకు తరలిస్తారోనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2019లో ఎలాగైనా […]
Category: Latest News
డీఎల్‌పై జగన్ మైండ్‌గేమ్ ?
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తోంది. వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌ను శత్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కనిపించడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తన […]
కేటీఆర్ కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో ఇప్పుడు వారసత్వ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల మధ్య జరిగిన రాజకీయ రగడ నేపథ్యంలో తెలంగాణలోనూ పరిస్థితి ఆదిశగా దారితీస్తుందా? అని అందరూ చర్చించుకున్నారు. అయితే, అలాంటి పరిస్థితి రాదని, కేసీఆర్ పక్కా వ్యూహంతోనే ఉన్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పొసుకున్న టీఆర్ ఎస్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ తొలిసీఎంగా […]
చంద్రబాబుకు యాంటీగా ఏపీలో బస్సు యాత్ర
పాలిటిక్స్‌లో ఒకరి ఐడియాను ఇంకొకరు కాపీ కొట్టినా తప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేపట్టిన ఓ యాత్రనే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు. చంద్రబాబు పాలనపై దండెత్తుతున్న సీపీఐ.. ప్రజల్లోకి మరింత వేగంగా త మ ప్రణాళికలను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బస్సు యాత్రను మించింది మరోటి లేదని డిసైడ్ అయింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టబోయే బస్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుందని సీపీఐ […]
ఎమ్మెల్యేలను ఇరుకున పడేసిన కేసీఆర్
`తెలంగాణలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం` అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ముఖ్యంగా ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది కూడా! అయితే ఇప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం వల్ల ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఈ నిర్ణయం ఇప్పుడు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. తమ నియోజకవర్గాల్లో ఎప్పుడు డబుల్ నిర్మాణం పూర్తవుతుందో అని.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో […]
జేసీ బ్రదర్స్‌కు మరో బ్రదర్స్ సవాల్
అనంతపురం పేరు చెప్పగానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్రదర్స్! ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా జిల్లా అంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండతో తమ ఆధిపత్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మరి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహసం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచలనం సృష్టించారు జగదీశ్వర్ రెడ్డి సోదరులు! జేసీ సోదరులతో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి! అనంతపురం […]
అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్
క్యాడర్ బలంగా ఉన్నా నేతలు లేరు!! నాయకులున్నా వారి మధ్య సఖ్యత లేదు! నేనున్నా అంటూ నడిపించే నాయకుడు ఇప్పుడు టీటీడీపీకి కరువయ్యాడు. పేరున్న నేతలంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవ్వడంతో.. తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడం వదిలి.. నేతలంతా ఇప్పుడు ఫైటింగ్‌కు దిగారు. 2019లో ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. `తెలంగాణలో క్యాడర్ ఉంది.. దానిని సరైన […]
శశికళకు ముందుంది ముసళ్ల పండగ
తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాలని చూస్తున్న శశికళకు.. దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తే `అధికార […]
స్టార్ హీరోతో క్రిష్ హిస్టారికల్ మూవీ
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయ్యిందో లేదో క్రిష్ పేరు సౌత్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో మార్మోగిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులు సైతం క్రిష్ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ క్రిష్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శాతకర్ణి లాంటి సినిమాను కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌లో 79 రోజుల్లో తెరకెక్కించాడంటే అందరూ స్టన్ అయిపోతున్నారు. అంత తక్కువ బడ్జెట్, అన్ని తక్కువ రోజులు తీసుకున్నా శాతకర్ణి కథనాన్ని నడిపే విషయంలో ఎక్కడా తడబాటు లేకుండా, క్వాలిటీతో సినిమా […]
