సల్మాన్ ఖాన్.. ముందు-వెనకా.. ప్రస్తుతం వస్తున్న హీరోలు… అంతా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. యాంటీ హీరోగా వీరంతా ప్రేక్షకులను మెప్పించారు. కానీ సల్లూ భాయ్ మాత్రం అలాంటి రోల్ ఒక్కటి కూడా చేయలేదు. ఇదే విషయమై స్పందిస్తూ తనకు విలన్ పాత్రలంటే నచ్చదని చెప్పారు. తానెప్పుడూ హీరోగానే ఉండాలనుకుంటున్నానని.. విలన్ రోల్స్ చేయనని […]
Category: Latest News
కబాలి పోస్టర్ కాఫీ కొట్టారా?
రజినీకాంత్ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కబాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో… అన్నే వివాదాలకు కారణమౌతుంది. తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. మరో వైపు విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది […]
క్యాంప్ కార్యాలయమా పార్టీ ఆఫీసా?
సాధారణంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పటివరకు వున్న అర్థాన్ని అవసరాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మార్చేస్తున్నాయి.క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టే గేటు లోపల సమాచారశాఖ మీడియా రూమును ఏర్పాటుచేసింది. సహజంగా మంత్రులు అక్కడ మీడియాతో భేటీ అయి, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తుంటారు. సిఎం తన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసే వివిధ వ్యక్తులు ఇచ్చే వినతి పత్రాలను మీడియాకు ఇక్కడే చేరవేస్తారు కానీ విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ […]
మల్లన్న దెబ్బ కి అల్లాడుతున్న కేసీఆర్…
మల్లన్నసాగర్… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తొలిషాక్ మల్లన్నసాగర్ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా […]
బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం
బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. బాలకృష్ణ వాహనంలో హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా లారీ ఓవర్‌టేక్ చేయబోయినపుడు పశువు అడ్డు రావడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు.
జగన్ కూడా ఛలో విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]
హైదరాబాద్‌కి టెర్రర్ టెన్షన్
చారిత్రక నగరం హైదరాబాద్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వర్ధిల్లుతోంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన వెలుగు చూసినా దానికి హైదరాబాద్‌తో లింకులుంటున్నాయి. ఇదివరకటితో పోల్చిచూసినప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినట్లే అనిపిస్తున్నప్పటికీ ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న ఐసిస్‌తో హైదరాబాద్‌కి లింకులున్నట్లుగా బయటపడుతుండడం ఆందోళన కలిగించేదే. తాజాగా హైదరాబాద్‌లో ఐసిస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్‌ఐఏ గుర్తించింది. పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేసింది. ఐసిస్ సానుభూతిపరులు నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో […]
రాజుగాడు యమ డేంజర్!
చిన్న సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ యువహీరో లేటెస్ట్‌గా రెమ్యునరేషన్ పెంచాడని సమాచారం. అయినప్పటికీ అతడిని అవకాశాలు వరిస్తున్నాయి. రాజ్ తరుణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలను అంగీకరించాడు. వీటిలో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకదానికి దర్శకుడు మారుతి మరో ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. సంజన డైరక్ట్ చేసే సినిమాకి […]
చైతు సమంతల “కల్యాణం”
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాయికగా సమంతాను ఎంపిక చేశారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల చైతూ .. సమంతల గురించిన వార్తలు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంతాను తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి […]