మొన్న విశాఖ.. నేడు నందిగామ!! సంఘటనలు వేర్వేరు కావొచ్చు. కానీ జరిగిన రచ్చ మాత్రం ఒక్కటే! హోదా కోసం యువత పోరాడుతుంటే.. అందుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత జగన్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. చివరకు అక్కడి నుంచే వెనుతిరిగేలా చేశారు. ఇప్పుడు నందిగామలోనూ ఇదే పరిస్థితి. బస్సు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను అధికారులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించారు. అధికార, విపక్షాల మధ్య గల రాజకీయ […]
Category: Latest News
జగన్ ఇలాకాలో సైకిల్ రన్ గ్యారెంటీనా?
దాదాపు 40 ఏళ్లకు పైగా వైఎస్ వంశానికి కంచుకోటగా ఉన్న కడపలో ఇప్పుడు టీడీపీ జెండా ఎగరబోతోందా? చంద్రబాబు ముందుగానే గీసుకున్న స్కెచ్ ప్రకారం జగన్ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టబోతోందా? 2019కి ముందుగానే ఎమ్మెల్సీ రూపంలో జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేయబోతోందా? ఎంతైనా కష్టపడి కడపలో కాలు మోపడం ద్వారా జగన్ కూసాలు కదిలించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది అంటున్నారు టీడీపీ నేతలు.. మంత్రులు. ప్రస్తుతం తెరలేచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు […]
ఒక్క ఎత్తుతో ప్రజలను మార్చేసిన కేసీఆర్…అవాక్కయ్యే ప్లాన్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా రాజకీయ ఎత్తులు, జిమ్మిక్కలు ఎవరికీ పెద్దగా తెలియదంటే.. పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన వ్యవహరించిన శైలే దీనికి నిదర్శనం. అప్పట్లో రాష్ట్ర సాధనే లక్ష్యంగా అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ సాధిస్తే.. ఎస్పీలనే సీఎంని చేస్తానని, అవసరమైతే కాంగ్రెస్ తో చెలిమి చేస్తానని, పార్టీని కూడా విలీనం చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగోలా ఏరు దాటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. సీన్ కట్ […]
బొత్స ప్లాన్‌తో బాబుకు చెమటలే
ప్రస్తుతం తాను రాజకీయాల్లో యాక్టివ్ లేకపోయినా తానేంటో మరోసారి రుజువుచేశారు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ! వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స పని అంతే అనుకున్న సమయంలో మళ్లీ తెరపైకి వచ్చి తనమార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాకుళం తరఫున విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్లకు ఇచ్చి సీఎం చంద్రబాబు.. తన వ్యూహాన్ని అమలుచేస్తే.. ఇప్పుడు బొత్స […]
అల్లుడి కోసం బాలయ్య త్యాగం
హీరో బాలకృష్ణ పేరు కొద్దిగా మారుతోంది! అదేంటి? ఎందుకు? అంటారా? అక్కడకే వచ్చేద్దాం. తన అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కోసం బాలయ్య తన పొలిటికల్ లైఫ్‌ని త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన పేరు బాలయ్య ప్లేస్‌లో త్యాగయ్యగా మారిపోతోందేమో అంటున్నారు అభిమానులు. విషయంలోకి వెళ్తే.. తాజాగా ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ సీట్ల పంపకం పూర్తయిపోయింది. ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం ఓ ఎమ్మెల్సీ సీటుని సీఎం చంద్రబాబు తన […]
మైసూరా.. జేసీ.. గురించి నాటు నిజాలు చెప్పిన డీఎల్
కాంగ్రెస్ సీనియర్ నేతలుగా రాజకీయాల్లో చక్రం తిప్పి తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలు మారిన సీనియర్ నేతలు, అనంతకు చెందిన రాజకీయ నాయకులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు గతంలో నాటు సారా అమ్మారట! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. నమ్మలేకుండా ఉన్న ఇవన్నీ నిజాలని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో […]
పురందేశ్వరి జగన్ పంచన చేరి జై కొట్టడం ఖాయం
దివంగత ఎన్టీఆర్ ముద్దుల కుమార్తె నందమూరి ఇంటి చిన్నమ్మ.. పురందేశ్వరి త్వరలోనే జగన్ పంచకు చేరిపోతున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చిన్నమ్మ కేంద్రంలో మంత్రిగా చక్రం బాగానే తిప్పారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. అయితే, అనుకున్నంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. పైగా కమల నాథుల నుంచి నోరు జాగ్రత్త.. చంద్రబాబును ఏమీ అనొద్దు వంటి ఆదేశాలతో ఆమె తనలో తానే […]
వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ నేతృత్వలోని వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా జగన్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పురందేశ్వరి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత, సీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా జగన్ పంచకే చేరుతున్నట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాటని స్వయంగా డీఎల్ వెల్లడించడం సంచలనం సృష్టించింది. తాను త్వరలోనే జగన్ పార్టీలోకి చేరుతున్నానని, జగన్ బాటలో నడుస్తానని […]
కాంట్రవర్సీ కింగ్ కు బాబు ఎమ్మెల్సీ టికెట్
నేను పారదర్శకంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన చేతల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించలేకపోతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్ల పంపకం జరుగుతోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి బాగా ఉపయోగపడతారని భావిస్తున్న వారికి బాబు వరుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాకాటి నారాయణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి, […]