చిన‌బాబు చేతుల్లో మంత్రుల‌కు అవ‌మానాలు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ అప్పుడే త‌న తోటి మంత్రుల‌కు విశ్వ‌రూపం చూపించేస్తున్నాడు. ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయిన లోకేశ్‌కు చంద్ర‌బాబు కీల‌క‌మైన పంచాయ‌తీ రాజ్‌, ఐటీ శాఖ‌లు కేటాయించాడు. ఇక తాను గ‌తంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ప్పుడే సీనియ‌ర్ మంత్రులు అయిన కెఈ.కృష్ణ‌మూర్తి, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటి శాఖ‌ల్లో పూర్తి పెత్త‌నం చేసిన లోకేశ్ ఇప్పుడు మంత్రి అయిన వెంట‌నే ఇత‌ర మంత్రుల విష‌యాల్లో మ‌రింత‌గా జోక్యం […]

ఆ మంత్రి ఊస్టింగ్ – టీడీపీ సెల‌బ్రేష‌న్స్‌

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత అస‌మ్మ‌తి జ్వాల‌లు ఇంకా ఎగ‌సిప‌డుతూనే ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న‌కు గురైన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇటు మంత్రి ప‌ద‌వి రాని వాళ్లు సైతం తీవ్ర అసంతృప్తితో భ‌గ్గుమంటున్నారు. ఈ అస‌మ్మ‌తి జ్వాల‌లు, అసంతృప్తి కుంప‌ట్లు ఇలా ఉంటే ఓ మంత్రి ప‌ద‌వి ప్ర‌క్షాళ‌న‌లో ఊస్ట్ అయినందుకు టీడీపీ నేత‌లు భ‌లే సంబ‌రాలు చేసుకుంటున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా […]

ఏపీలో ఓ ఛానెల్ – తెలంగాణ‌లో ఓ ఛానెల్ ఎంట్రీ

తెలుగు మీడియా రంగంలో ఉన్న‌న్ని ఛానెళ్లు దేశంలో జాతీయ మీడియాలో తప్పా ఏ స్టేట్‌లోను లేవు. తెలుగులో లెక్క‌కు మిక్కిలిగా మీడియా ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. చాలా ఆర్భాటంగా స్టార్ట్ అవుతోన్న ఛానెల్స్‌లో కొన్ని మూత‌ప‌డుతుంటే కొన్ని ఛానెల్స్ మాత్రం నామ్ కే వాస్తేగా ఉన్నామంటే ఉన్నామ‌నిపించుకుంటున్నాయి. తెలుగులో ఎన్ని ఛానెల్స్ వ‌స్తున్నా కేవ‌లం టీవీ-9, ఎన్టీవీ, టీవీ-5, ఏబీన్‌, ఈటీవీ వీటితో పాటు ఒక‌టీ అరా ఛానెల్స్ మిన‌హా మిగిలిన ఛానెల్స్ ఏవీ సిబ్బందికి జీతాలు ఇచ్చే […]

మిస్టర్ TJ రివ్యూ

సినిమా : మిస్ట‌ర్‌ TJ రేటింగ్ : 2/5 పంచ్ లైన్ : ‘మిస్టర్ వైట్ల’ మళ్ళీ మిస్సయ్యాడు నటీనటులు : వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి త‌దిత‌రులు లిరిక్స్ : కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి కోడైరెక్ట‌ర్స్ : బుజ్జి, కిర‌ణ్‌ క‌థ : గోపీ మోహ‌న్‌ మాట‌లు : శ్రీధ‌ర్ సీపాన‌ సినిమాటోగ్ర‌ఫీ : కె.వి.గుహ‌న్‌ సంగీతం : మిక్కి జె.మేయ‌ర్‌ నిర్మాత‌లు : న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు […]

వెంకయ్యను కలిసిన టాలీవుడ్ శృంగార తార

తెలుగు న‌టి ర‌మ్య‌శ్రీ రాజ‌కీయాల ప‌ట్ల చాలా ఉత్సాహంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌లు ఆ టైప్ సినిమాల్లో న‌టించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న ర‌మ్య‌శ్రీ గ‌తేడాది త‌న స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఓమల్లి సినిమాలో కూడా న‌టించింది. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా ఆమెకు న‌ట‌న‌కు, డైరెక్ష‌న్‌కు కాసిన్ని ప్ర‌శంస‌లు అయితే ద‌క్కాయి. ఇదిలా ఉంటే ర‌మ్య‌శ్రీ బీజేపీలోకి చేరే అవ‌కాశాలున్న‌ట్టు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ర‌మ్య‌శ్రీ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడిని ఢిల్లీ వెళ్లి మ‌రీ క‌లిశారు. మ‌రి వారిద్ద‌రి మ‌ధ్య […]

2019 నాటికి బెజవాడ రాజకీయాల్లో పెను మార్పులు

ఏపీలో రాజ‌కీయంగా కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇక విజ‌య‌వాడ‌లో అయితే ప్ర‌తి ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు జంపింగ్స్ చేస్తుంటారు. 2004లో టిక్కెట్టు రాలేద‌ని ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఇక 2009లో ప్ర‌జారాజ్యంలో ఉన్న కేశినేని 2014లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. ప‌లుపార్టీలు మారిన […]

చంద్ర‌బాబు త‌ల‌నొప్పులు వ‌ద్దంటోన్న కేసీఆర్‌..!

ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే పూర్త‌య్యింది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చాలా సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువైంది. సంచ‌ల‌నాలు అనేకంటే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించ‌ని వారికి అనూహ్యంగా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కితే…మంత్రి ప‌ద‌వి ఆశ‌లు పెట్టుకున్న వారికి మొండిచేయి ఎదురైంది. దీంతో మంత్రి ప‌ద‌వి రాని సీనియ‌ర్లు రాజీనామాల అస్త్రాలు సంధించ‌డంతో ఏపీ రాజ‌కీయం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారి ఒక్క‌సారిగా హీటెక్కింది. ఇక మంత్రి వ‌ర్గం నుంచి ఊస్టింగ్‌కు గురైన సీనియ‌ర్ […]

మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క […]

చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి […]