గత ఎన్నికల్లో విజయానికి చివరి మెట్టు వరకూ వచ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజయతీరాలను అందుకుని అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక రాజధాని ప్రాంతంలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు.. తన తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇతర పార్టీల్లో చేరిన నేతలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]
Category: Latest News
పొలిటికల్ పంచ్ కి బ్రేకులు
సోషల్ మీడియా వైరల్ గా మారిన పొలిటికల్ పంచ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పొలిటికల్ పంచ్ టీడీపీనే ద్యేయంగా చేసుకొని కార్టూన్స్ మరియు బాషా పదజాలం వాడుతూ పోస్ట్లు పెడుతుంటారు. అవి చూస్తానికి వేరే పార్టీ వర్గానికి ఆనందం కలిగించవచ్చు కానీ ఆ నాయకులని అవి కొంత మేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మధ్య మంత్రి గా ప్రయాణం మొదలుపెట్టిన లోకేష్ ఈ విషయంలో చాలా కోపం గా ఉన్నారు స్వయానా ఆయన […]
కాంగ్రెస్ వాసనలు మరిచిపోని చంద్రబాబు
కాంగ్రెస్, తెలుగుదేశం.. రెండూ విరుద్ధ స్వభావాలు గల పార్టీలు! కానీ ప్రస్తుతం ఈ రెండు పార్టీల్లో ఒకటే సంస్కృతి నడుస్తోందనే చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతివాదులు పెరుగుతున్నారు. ఒకప్పుడు పార్టీపైనా, అధినేతపైనా విమర్శలు చేయడానికి ధైర్యం చేయని నేతలు.. ఇప్పుడు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఈ సంస్కృతి ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్న హయాంలో కిక్కురుమనేవారు కాదని.. చంద్రబాబు హయాంలో పార్టీపై విమర్శలు చేసే స్థితికి […]
తెలంగాణలో బీజేపీతో అంటకాగితేనే టీడీపీకి లైఫ్!
దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు నాట అప్రతిహతంగా చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం దెబ్బతో ప్రస్తుతం విలవిలలాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేపట్టి చక్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో తన ముద్ర శాశ్వతమని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం కన్నెత్తి […]
టీడీపీలో ఈ కులాలకు మొండిచెయ్యేనా..!
అన్ని వర్గాల వారికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ వర్గానికీ అన్యాయం జరగదని సీఎం చంద్రబాబు పదేపదే స్పష్టం చేస్తుంటారు. కానీ ఇది మాటలకే పరిమితమైందనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో బీసీ, దళితులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాలనే ఆయన అక్కున చేర్చుకుంటున్నారని ఆయా వర్గాల నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణలో తమ వర్గాల వారికి అన్యాయం జరిగిందని […]
తమిళ తెరపై కాషాయ సినిమా మొదలైందా..?
తమిళనాడు రాజకీయాలను తెర వెనుక నుంచి నడపాలని ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. ఎట్టకేలకు విజయం సాధించింది. నయానో భయానో చివరికి పరిస్థితులను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుని సక్సెస్ అయింది. తన మార్క్ వ్యూహంతో కేంద్రం పక్కాగా.. శశికళ వర్గాన్ని తమిళ రాజకీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా వేయడం మొదలుకుని.. సీఎం పళనిస్వామి నేరుగా మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసేలా చేసి తమిళ రాజకీయాలను శాసించే స్థాయికి […]
నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో మొదలైన సెగలు.. ఇంకా చల్లారడం లేదు. శిల్పా, భూమా వర్గాల మధ్య వివాదం సమసిపోగా.. ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. భూమా నాగిరెడ్డి మరణంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వద్దా అనే మీమాంసలో ఉన్న శిల్పా మోహన్‌రెడ్డికి అధిష్టానం వరుసగా షాకులు ఇస్తోంది. […]
ఎన్టీఆర్ చుట్టూ సమాధానంలేని ప్రశ్నలెన్నో
2009 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకూ అలానే ఉన్నా.. సడన్‌గా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్.. పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి రానని చెప్పినా.. మరి ఎన్టీఆర్ పేరు వినిపించడం వెనుక ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకు మళ్లీ ఎన్టీఆర్‌ను బురదలోకి లాగాలని […]
అద్వానీకి దెబ్బా..? కుట్రా…?
రాష్ట్రపతి పదవి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద కట్టడం బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీ, ఉమాభారతితో సహా మొత్తం 16 మందిని కుట్రదారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి లక్నో ట్రయిల్ కోర్టును కేసు […]
