ఆ మాజీ మంత్రి చూపులు వైకాపా వైపు..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. విప‌క్షాన్ని బ‌ల‌హీనప‌ర‌చేందుకు మొద‌లుపెట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్  దెబ్బ‌కు వైసీపీ విల‌విల్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా వైసీపీకి కాస్త ఊర‌ట క‌లిగించే ప‌రిణామాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. నిన్న‌టిదాకా అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఉండే ప్ర‌యోజ‌నాల‌ను అందిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు  టీడీపీ గూటికి ప‌రుగులు తీశారు. ఒక‌రూ ఇద్ద‌రు కాదు దాదాపు 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఎంపీలు కూడా టీడీపీ కండువా […]

కేసీఆర్ నిఘా నీడ‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

పార్టీలోను, ప్ర‌భుత్వం లోను జ‌రిగే త‌ప్పులు చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేస్తే రేపు అవే ప్ర‌త్య‌ర్థుల చేతిలో అస్త్రాలుగా మారే ప్ర‌మాదం ఉంద‌న్న ఆలోచ‌న‌తో కేసీఆర్ పార్టీ నేత‌ల ప‌నితీరుపై కాస్త సీరియ‌స్‌గానే దృష్టి పెట్టార‌ట‌. వాస్త‌వాలు ఎలా ఉన్నా  త‌న మాట‌ల‌తోనే క‌ళ్ల‌ముందు  సుప‌రిపాల‌న‌ను ఆవిష్క‌రింప‌జేయ‌గ‌ల టీఆర్ ఎస్ అధినేత తాజా నిర్ణ‌యం వెనుక గ‌ట్టి కార‌ణ‌మే ఉంది. గ్యాంగ్‌స్టర్ నయూముద్దీన్‌తో పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంటకాగి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలే ఇటీవ‌ల వెల్లువెత్త‌డంతో… పార్టీ […]

వెంక‌య్య బాగా హ‌ర్ట్ అయ్యారట‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీతో స‌రిపెట్టిన కేంద్రంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ స‌భ‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన విష‌యం అంద‌రిక‌న్నా బాగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌కు గుర్తిండిపోయింది! ఆయ‌న ప‌డుకున్నా లేచినా ప‌వ‌న్ వ్యాఖ్య‌లే గుర్తుకొస్తున్న‌ట్టున్నాయి. దీంతో ఈ విష‌యం జ‌రిగి దాదాపు నెల గ‌డుస్తున్నా.. ప‌వ‌న్‌పై వెంక‌య్య ఇంకా స‌టైర్లు కుమ్మేస్తూనే ఉన్నారు. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన ప‌వ‌న్‌.. ఆ స‌మ‌యంలో కేంద్రం స‌హా బీజేపీపై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. ఇక […]

ఆ టీడీపీ ఎమ్మెల్యేకు క‌ప్పం క‌ట్టాలట

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతున్న దానికీ.. టీడీపీ త‌మ్ముళ్లు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దానికీ సంబంధం లేకుండా పోతోంది! తాను నిప్ప‌నంటూ చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకొంటారు. త‌న‌పై ఎన్నో కేసులు న‌మోదైనా అన్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని అంటారు. తెలుగు డిక్ష‌న‌రీలో త‌నకు న‌చ్చ‌ని ప‌దం అవినీతేనేన‌ని అంటారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, తెలుగుదేశం జెండాపై బాబు క‌నుస‌న్న‌ల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు కొందరు విచ్చ‌ల‌విడిగా దోపిడీకి తెర‌లెత్తేయ‌డం మాత్రం ఆయ‌న‌కు సంబంధంలేదా? ఆయ‌నెలాంటి చ‌ర్య‌లూ […]

కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయడానికి ఆయనెవరు?

పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్‌ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్‌ కింద బీహార్‌ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్‌ తనకు వద్దని, బీహార్‌ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. […]

హైదరాబాద్‌లో కూల్చి’వెతలు’

వానొచ్చింది, వరదొచ్చింది. హైదరాబాద్‌ నిండా మునిగింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో నగరం నిండా మునిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, కఠిన చర్యలకు దిగింది. నాళాల కబ్జా కారణంగానే హైదరాబాద్‌ మునిగిపోయిందని అంచనాకి వచ్చిన ముఖ్యమంత్రి కెసియార్‌, తక్షణం అక్రమ కట్టడాల్ని, నాళాల కబ్జాల్ని ‘చెరిపెయ్యండి’ అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది, నగరంలో ఎటు చూసినా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇది మంచి […]

టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు […]

మాజీ మంత్రిపై ద‌య వెన‌క మ‌ర్మ‌మేమిటో

నేటి రాజ‌కీయాల్లో అధికార పార్టీలు విప‌క్షంలో ఉన్న‌వారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న ప‌వ‌ర్‌ను వినియోగించుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌టం ద్వారా వారిని లొంగ‌దీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యంలో ఏ పార్టీకి, ఏనాయ‌కుడికి మిన‌హాయింపు లేద‌నే చెప్పాలి. సాధార‌ణంగా త‌మిళ‌నాట ఈ సంస్కృతి ఎక్కువ‌గా క‌నిపించేది. అయితే వైఎస్ హ‌యాంలో రాష్ట్రంలోనూ ఈ ధోర‌ణి ప‌తాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మూ దానినే అనుస‌రిస్తోంది. అయితే మేం అలాంటి విధానాల‌కు వ్య‌తిరేక‌మ‌ని వారు చెప్పుకోవ‌డమే […]

కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?

గ‌తంలో ఒక‌ద‌శ‌లో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైపోయిన ద‌శ‌లో… కేసీఆర్ ఉద్య‌మానికి స‌జీవంగా ఉంచేందుకు ఆలోచ‌న కంటే ఆవేశం ఎక్కువ‌గా ఉండే యువ‌త‌ను న‌మ్ముకున్నారు. తెలంగాణ‌లోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారిలో విభ‌జ‌న ఉద్య‌మ జ్వాల‌లు ర‌గిలించారు. వారితో పాటు ప్ర‌జా సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ సాయంతో ఉద్య‌మాన్ని మ‌లి ద‌శ‌కు తీసుకెళ్లి అంతిమంగా ల‌క్ష్యం సాధించ‌గ‌లిగారు. తాజ‌గా జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంశంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై […]