అవును. నిజమే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గత నాలుగురోజుల కిందట కురిసిన వర్షాలతో భాగ్యనగరం మునిగిపోయింది. దీంతో ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కొన్ని అపార్టు మెంట్లలోకి భారీ ఎత్తున వరద చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆసరాలేక నానాతిప్పలుపడ్డారు. అయితే, అదే సమయంలో కొందరు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఏం […]
Category: Latest News
వెంకయ్య చెప్పిన శృంగారం కథలు ఇవే
ఏంటి? ఎంతో బిజీగా క్షణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శృంగారం గురించి మాట్లాడడం ఏంటని బుగ్గలు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయన నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చర్ దంచేశారు! అయితే, అది ఏ బహిరంగ సభలోనో, ఎన్నికల ప్రచార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్షన్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల […]
ఏపీలో వెన్నుపోటు బ్రదర్స్ ఎవరో తెలుసా..
వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉరఫ్ రోజమ్మ.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరైపోయారు. పనిలోపనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకపోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. వాస్తవానికి నిన్నమొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వచ్చిన తర్వాత నుంచి వెంకయ్యను కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా మాత్రం మరింతగా ఇద్దరిపైనా […]
చంద్రబాబు డైలాగ్ జోకులకే పెద్ద జోకు
ఏపీ సీఎం చంద్రబాబు పాలనా పరంగా పెద్ద హిట్! ఈ విషయంలో విపక్ష నేతలు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీకరించే విషయం. ఆయనెప్పుడూ సీరియస్‌గానే ఉంటారు. ఆయన ముఖంలో చూద్దామన్నా నవ్వు కనిపించదు. అలాంటి చంద్రబాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధవారం నుంచి విజయవాడలో కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. ఓ ఆసక్తికర వ్యాఖ్య […]
టీడీపీ ఎమ్మెల్యే కాలేజ్‌లో నోట్ల కట్టలు
టీడీపీ ఎమ్మెల్యే కాలేజీలో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చాయి. ఎంత తోడుతుంటే అంత అన్నట్టుగా తీసినకొద్దీ కట్టలు బయటపడ్డాయి.! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! నిన్నగాక మొన్న టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి సంస్థలపై బెంగళూరులో ఐటీ అధికారులు దాడి చేశారనే వార్త సంచలనం రేపి 24 గంటలు కూడా గడవకముందే అదే తెలుగు దేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీ కే సత్యప్రభ(టీడీపీ […]
కమ్యూనిస్టుల వైభవం.. గత చరిత్రేనా..?
ఒకప్పుడు రాష్ట్రంలో కమ్యూనిస్టులకు రాజకీయంగా చెప్పుకోదగిన స్థాయిలో పట్టుండేది. అధికారం చేజిక్కించుకోగల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగలిగేవారు. ప్రధాన పార్టీలతో సమయానుకూలంగా పొత్తులతో చట్ట సభల్లో తమ ప్రాతినిధ్యం ఉండేలా.. తమ వాయిస్ గట్టిగా వినపడేలా చూసుకునేవారు. అయితే ప్రాంతీయ పార్టీల హవా పెరగడం.., వాస్తవ పరిస్థితులను గ్రహించలేక పోవడం.., కాలం చెల్లిన విధానాలను, పిడివాదాన్ని నమ్ముకోవడంతో కమ్యూనిస్టుల బలం తరిగిపోతూ వచ్చింది. […]
టీడీపీలో కూడా వెంకయ్యకు పదవి ఉందా
ఏంటి టైటిల్ చూసి డంగయ్యారా? కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎప్పుడు కమలాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, పసుపు కండువా కప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెదడుకు పని చెప్పారా? ఆన్సర్ దొరకలేదా? అయితే.. ఇది చదవండి.. రిజల్ట్ ఉంటుంది! స్టేట్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే ప్రచారం సాగడం, ఎన్నికల హామీ నేపథ్యంలో అందరూ హోదాపై తెగ మనసు పెట్టుకున్నారు. ఇదే విషయంలో చంద్రబాబు […]
కేసీఆర్‌కు హైకోర్టు షాక్!
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని కంకణం కట్టుకుని తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత, కేసీఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభజించాలని అప్పుడు పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని పక్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా తన కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాకు […]
టీడీపీ కంచుకోటలో అసంతృప్తి సెగలు
ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిస్థాయిలో సహకారం అందించిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం గత ఎన్‌టీఆర్ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ సహా ఆయన తనయుడు బాలయ్యలు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్లనూ టీడీపీనే కైవసం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్యధిక బలం […]