ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు తన మాట వినని వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతమొందించినా.. అతని తాలూకా అనుచరుల ఆగడాలకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. నయీంతో అంటకాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్పటికీ దందాలు సాగిస్తూనే ఉన్నట్టు పక్కాగా సీఎం కేసీఆర్‌కే సమాచారం అందిందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. నయీం అనుచరులుగా చక్రం తిప్పిన శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే […]
Category: Latest News
వంశీ నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం…బాబుకు కంప్లైంట్
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కృష్ణాజిల్లా టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు ప్రధాన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల తిరగి టీడీపీ సైకిలెక్కిన దేవినేని నెహ్రూ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీల మధ్య ఇప్పుడు వివాదాల వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు వీరి మధ్య ఘర్షణలకు తావిచ్చేలానే ఉండడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ కి చెందిన సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ నేత, […]
ఎలా ఎస్కేప్ అవ్వాలో వెంకయ్యకే బాగా తెలుసు
గంపెడు రాజకీయ చతురత, గుప్పెడు వ్యూహం కలగలిసిన పొలిటికల్ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన అచ్చంగా వెంకయ్యనాయుడే! ఏపీకి చెందిన కమలం పార్టీ ప్రధాన నేత అయిన ఈయన.. విద్యార్థి దశ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. అందుకే అపార రాజకీయ అనుభవంతో పాటు ఏ ఎండకాగొడుగు పట్టడం ఈయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు! తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదో? దీనికి వెనుక ఏయే కారణాలు ఉన్నాయో తెలియజెప్పాలని నిర్ణయించుకున్న కమల దళం.. ఆ దిశగా […]
2019 కోసం వాళ్లను టార్గెట్ చేస్తోన్న జగన్
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఇక తమ పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి అన్నంతగా మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించిన వైసీపీ అధినేత జగన్ ఫలితాలు వెలువడ్డాక ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేదనే చెప్పాలి. అయితే అధికార పీఠం చేరుకోవాలంటే.. ప్రజల్లో తనపై మరింత విశ్వాసం పెంచుకోవాలన్న వాస్తవ పరిస్థితి గ్రహించాక అధికార పక్షంపై ఆయన ఒకరకంగా యుద్ధమే చేస్తున్నారు. తండ్రిలాగే మడమ తిప్పని నైజమున్న జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంగా గట్టిగానే పోరాడుతున్నా.. రాజకీయ అనుభవం లేకపోవడం, వ్యూహ రచనా […]
ఆ ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారా..!
ఎవరు అవునన్నా కాదన్నాఇపుడు తెలంగాణకు కేసీఆర్ మహారాజు.. రాష్ట్రంలో ఆయనకు గట్టిగా ఎదురుచెప్పే సాహసం మాట దేవుడెరుగు… ఆయన పాలనలోని లోపాలను వెదికేందుకూ ఎవరికీ ధైర్యం చాలడంలేదు. ఆఖరికి మీడియా సైతం ఆయన అడుగులకు మడుగులొత్తాల్సిందే.. అవసరమైతే తెలంగాణ ప్రజల సెంటిమెంటు అస్త్రాన్ని ఇప్పటికీ ఎప్పుడు ఎలా వాడుకోవాలో… ఏ మోతాదులో ఉపయోగించాలో.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవడమే కేసీఆర్ అసలు బలమని ఇక్కడ గుర్తించాలి. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన […]
చంద్రబాబు దెబ్బకు వణికిన టైగర్
ఏపీ సీఎం చంద్రబాబుకు కోప మొచ్చింది! అది అలాంటి ఇలాంటి కోపం కాదు. సొంత పార్టీ ఎమ్యెల్యే పైనే కట్టలు తెగే కోపమొచ్చింది. ఇంకేముంది ఉన్నచోట ఉన్నట్టుగానే ఫైరైపోయారు. సదరు ఎమ్మెల్యను చడామడా తిట్టిపోశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి గిర్రున నీళ్లు తిరగినంత పనైందట! దీంతో ఎన్నడూ తన జీవితం క్షమించమని ఎవ్వరినీ అడగనివాడు.. సీఎంను పట్టుకుని క్షమించమని అడగడంతోపాటు ఫ్యూచర్‌లో ఇలా జరగకుండా చూస్తానంటూ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారట. పోనీ.. ఆ ఎమ్మెల్యే ఏమన్నా.. ఆషామాషీనా […]
నైజాం సినీ మార్కెట్‌ను శాసిస్తోన్న కేటీఆర్ వైఫ్
సినిమా నటుల్లోనే కాదు.. సినిమాకు సంబంధించిన అన్ని వ్యాపారాల్లోనూ మొదటినుంచీ ఆంధ్ర ప్రాంతం వారిదే ఆధిపత్యం.. ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలన్నింటా వీరిదే హవా.. నైజాంకు సంబంధించి దిల్ రాజు వంటి వేళ్లమీద లెక్కించదగ్గ కొందరు కొన్నేళ్లుగా వెలుగులోకి వచ్చి సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగాను, పంపిణీ రంగంలోనూ, ఎగ్జిబిటర్లుగానూ రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఇపుడు తాజాగా సినిమా పంపిణీ రంగంలో నైజాం మార్కెట్లో ఆ నలుగురికి చెక్ పెడుతున్న సంస్థగా అభిషేక్ పిక్చర్స్ పేరు […]
కడప గడపలో జగన్ పట్టు సడలుతోందిగా..
కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో […]
వావ్, మోడీని పొగిడేసిన రాహుల్
ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే […]