ఏపీ సీఎం చంద్రబాబు అవాక్కయ్యే విషయాన్ని వైకాపా నేతలు వెల్లడించారు. అక్కడెక్కడో ఉన్న అమెరికా పౌరులు ఎంజాయ్ మెంట్ కోసం పెళ్లిళ్లు చేసుకుంటారని, వాళ్లకి కుటుంబ సంతోషం ఏమిటో తెలీదని నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్లు కుమ్మరించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో పోరాడుతున్న ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ప్రస్తుతం ఉన్న భార్య నాలుగో వ్యక్తి అని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి […]
Category: Latest News
తెలంగాణ నేతలు తలో దిక్కుకు పోయారు
దాదాపు 60 ఏళ్ల కల సాకారంలో భాగంగా.. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. నేతలకు కేరాఫ్ లేకుండా చేసిందట! ఇంతకుముందు నేతల పేర్లు చెబితే జిల్లాలు, లేదా జిల్లాల పేర్లు చెబితే నేతలు చటుక్కున గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్కకు మిక్కిలి జిల్లాల ఏర్పాటుతో నేతల జిల్లాల స్వరూపం మారిపోయింది. ఒక్కొక్క నేత పరిధి ఒకటికి మించి రెండు మూడు జిల్లాలకు చేరిపోయింది దీంతో నేతలు తలో దిక్కుకు పోయినట్టు అనిపిస్తోందట! ఫలితంగా ఇప్పుడు తాము ఏజిల్లాకు […]
ఎమ్మెల్యేల దోపిడీపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
ఎన్నికల్లో పోటీచేసే నాయకులు డబ్బులు పంచిపెడుతుండటం సహజమే! ఇది బహిరంగ రహస్యమే! కానీ ఎవరూ దీని గురించి మాట్లాడరు!! మరి ఇటువంటి వాటి గురించి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది? నిజంగా ఆశ్చర్యమే కదూ! కానీ ఇటీవల చంద్రబాబు తరచూ ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ ప్రజలను, నాయకులను ఆశ్చర్యపరుస్తున్నారు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోతుండటంపై అసహనం వ్యక్తంచేశారు. వెలగపూడిలో సీఎం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు […]
వైకాపాలో గ్రూపుల గోల
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా నిర్ణయాత్మక పాత్ర పోషించలేక పోతోందా? వైకాపా నేతలు తమలో తామే గొడవలు పడుతూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారా? ఆధిపత్య ధోరణి పెరిగిపోతోందా? వీరిని లైన్‌లో పెట్టాల్సిన వైకాపా అధినేత జగన్.. మౌనం పాటిస్తున్నారా? వైకాపాను నడిపించడంలో విఫలమవుతున్నారా? అంటే ఔననే అంటున్నారు అనంతపురం వైకాపా నేతలు! ఈ జిల్లాలో వైకాపాకు సంఖ్యా బలం ఎక్కువగానే ఉంది. అయితే, ఎవరికి వారిలో ఆధిపత్య ధోరణి పెరిగిపోవడంతో నిత్యం ఏదో ఒక […]
జయ రిటైర్డ్..!
అవును! మీరు చదివింది నిజమే! తమిళనాడు సీఎం జయలలిత, తమిళ ప్రజల అమ్మ రిటైర్డ్ అయ్యారు. ఆమెను విధుల నుంచి పూర్తిగా రిలీవ్ చేస్తున్నట్టు ప్రత్యక్షంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ప్రకటించక పోయినప్పటికీ.. ఆమె చూస్తున్న అన్ని శాఖలనూ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జయ ఒకరకంగా తన విధుల నుంచి రిటైర్డ్ అయినట్టే కదా!! అయితే, ఆమె సీఎంగా మాత్రం కొనసాగుతారు. పురుచ్చితలైవిగా పూజలందుకునే ఒకప్పటి సినీ […]
కేసీఆర్ కల నెరవేరేనా?
బంగారు తెలంగాణ సాకారం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయి.. సదరు కొత్త జిల్లాల ప్రారంభం కూడా జరిగిపోయింది. విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఆయా జిల్లాల ఏర్పాటును మంత్రులు ప్రారంభించారు. దీంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 21 కొత్త జిల్లాలతో మొత్తంగా 31 జిల్లాల తెలంగాణగా ఆవిర్భవించింది. దీంతో పాలన క్షేత్రస్థాయికి వెళ్తుందని, పాలనా ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరువ అవుతాయని, అవినీతి నశిస్తుందని, కొత్త […]
ఇలా అయితే బాబుకు సీఎం పోస్టు కష్టమే..!
ఏపీ సీఎం చంద్రబాబుకు ఫ్యూచర్‌పై ఆశలు అంతగా నెరవేరేలా కనిపించడం లేదు! ఏపీలో రానున్న రెండు టర్మ్‌ల వరకు టీడీపీనే అధికారంలో ఉండాలని, తానే సీఎంగా పాలించాలని చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2019లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలనే కసితో ఉన్న బాబు.. దానికి తగినట్టుగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, తన పాలనకు మెరుగులు పెట్టుకోవడం, నిరంతరం ప్రజల్లో ఉండేలా ఏవో ఒక కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతున్నాయి. […]
ఆ ఏపీ మంత్రికి నాలుగు డీ గ్రేడ్లు
చంద్రబాబు కేబినెట్‌లో కీలక శాఖలు చూస్తున్న ఓ మహిళా మంత్రి ఫ్యూచర్ క్లోజ్ అయినట్టేనా? పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన ఫలితంగా సదరు నేత ఇక ఇంటి ముఖం పట్టాల్సిందేనా? మరికొద్ది రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణలో ఆ మహిళా మంత్రిగారు తన సీటును ఖాళీ చేయాల్సిందేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు శిక్షణ […]
టీడీపీ ఎంపీపై బాబుకు ఎంత ప్రేమ
టీడీపీకి చెందిన ఓ ఎంపీపై సీఎం చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారా? నిబంధనలను సైతం పక్కకు పెట్టి మరీ ఆ ఎంపీని ఆదరిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే చెబుతున్నారు తాజా పరిణామాలను గమనిస్తున్నవారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఎంతకైనా వెనుకాడేది లేదని పదే పదే చెప్పే చంద్రబాబు.. ఓ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో ఆయా పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను, […]