బంగారు తెలంగాణలో భాగంగా ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, పాలన వికేంద్రీకరణపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తన మంత్రి వర్గం విస్తరణపై దృష్టి పెట్టారా? రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింత డెడికేటెడ్‌గా పనిచేసే టీంను ఎంచుకోనున్నారా? ఈ క్రమంలో మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది టీఆర్ ఎస్ వర్గాల నుంచి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా కేసీఆర్ తన టంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఉప […]
Category: Latest News
ఏపీలో మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ
ఏపీలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ జరుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేషన్లకు ఎట్టి పరిస్థితిలోనూ రానున్న రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి నవంబరు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని తమకు చెప్పాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం, […]
కోమటిరెడ్డి కొత్త టార్గెట్ చూశారా..!
కొంతకాలంగా నల్గొండ జిల్లాలో బలమైన నేతలుగా పేరున్న కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాఅవి వాస్తవం కాదని తేలిపోయింది. అంతేకాదు ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంధిస్తున్న వాగ్బాణాల వాడి, వేడి కూడా పెరిగింది. టీఆర్ ఎస్ పాలనను, కేసీఆర్ కుటుంబ పాలనను ఆయన ఈ మధ్య అవకాశమొస్తే చాలు.. ఏకిపారేస్తున్నారు. అసలు కోమటిరెడ్డిలో ఇంత ఆకస్మిక మార్పుకు మార్పు ఎందుకువచ్చిందనే చర్చ.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో […]
టీడీపీలో టాప్ ఎమ్మెల్యేలకు లీస్ట్ ర్యాంకులా..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల వివరాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడంతో వారు కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా వచ్చే ఎన్నికల్లో బాబు గారు టిక్కెట్టు ఇస్తారా ? ఇవ్వరా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ శాఖలతో పాటు నియోజకవర్గాల్లో ఉత్తమ పనితీరు మెరుగు పరచుకోవాల్సిన […]
ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే విన్నర్ ఎవరు..!
రాష్ట్రం ఆర్థికంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో అధికారం చేపట్టినా… తన సమర్థత, సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం, సమయానుకూల వ్యూహాలే పెట్టుబడిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిస్థితిని ఓ రకంగా గాడిలో పెట్టగలిగారనే చెప్పాలి. అయితే తాను రాత్రిపగలు తేడా లేకుండా కుటుంబాన్ని కూడా మరచిపోయి.. రాష్ట్రం కోసం శ్రమిస్తున్నా.. అందుకు తగిన స్థాయిలో టీడీపీ ప్రభుత్వానికి మైలేజీ రావడం లేదని చంద్రబాబు పార్టీ అంతర్గత చర్చల్లో వాపోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. దానికితోడు […]
లగడపాటి టీడీపీ ఎంట్రీ..!
లగడపాటి రాజగోపాల్ … ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రెండు మూడేళ్ల క్రితం దాకా ఆ పేరే ఓ సంచలనం. తన చొరవ, దూకుడు కలగలిసిన స్వభావంతో ఆయన పారిశ్రామికంగా అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి. ఇక రాజకీయరంగంలోనూ ఆయన పదేళ్ల ప్రస్థానం అడుగడుగునా సంచలనమేనని చెప్పాలి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓ రకంగా రాజగోపాల్ ఒంటరి పోరాటమే కొనసాగించారు. ఓ పక్క విభజన వాదులతోను, మరో పక్క తన సొంత […]
చంద్రబాబుకు మావోల లేఖలో సందేహాలెన్నో..!
ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏకపక్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్కల ప్రకారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ సహా దేశ వ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్రతిభ గొప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే, […]
చంద్రబాబు వ్యూహాల్లో పదును తగ్గిందా…?
ఓ చేత్తో పాలనా పగ్గాలను, మరో చేత్తో పార్టీ వ్యవహారాలను సమర్థంగా సమన్వయం చేసుకురావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రికార్డును తనపేరిట శాశ్వతంగా లిఖించుకున్న టీడీపీ అధినేత మంచి పాలనాదక్షుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయన తిరుగులేని రాజకీయ వ్యూహాలు, సామర్థ్యం కారణంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు, సంచలన రాజకీయ విజయాల సారథుడు, సాధకుడు అయిన ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం […]
టీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ, పాలనాపరమైన వ్యూహాలేమిటో విపక్షాలకు మాత్రమే కాదు… ఒక్కోసారి సొంత పార్టీ నేతలకు కూడా అర్థంకావు. అవును మరి… నామినేటెడ్ పోస్టుల భర్తీలో కేసీఆర్ వైఖరి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలోనే […]