సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు […]
Category: Latest News
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఇక.. అజిత్‌వేనా?!
తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి, రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని అనారోగ్యంతో మృతి చెందిన సీఎం జయలలిత ఉరఫ్ పురిచ్చితలైవి..పార్టీ అన్నాడీఎంకే ప్రస్తుతం నాయకత్వ లేమితో సతమతమవుతోంది. జయ నెచ్చెలి శశికళ అనూహ్య పరిస్థితుల్లో జైలు పాలు కావడం, నమ్మినబంటు పన్నీర్ సెల్వం పూర్తిగా పార్టీ నుంచి విడిపోయి.. అన్నాడీఎంకే(అమ్మ) పేరుతో సొంత కుంపటి పెట్టుకోవడంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో నాయకత్వ సంక్షోభం తారస్థాయికి చేరుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా హీరో అజిత్ పేరు మరోసారి […]
టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా..?
తన తర్వాత సీఎం పీఠం కొడుకు, లేదా కూతురికి అప్పగిస్తున్న వారే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయం ప్రధానంగా మారిపోయింది. సీఎం పీఠానికి ఎవరైనా అడ్డొస్తున్నారని తెలిస్తే.. వారిని వెంటనే పక్కకు తొలగించేస్తున్న రోజులివి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చూసిన వారంతా ఇదే చెబుతున్నారు. మేనల్లుడు హరీశ్‌రావు ప్రాధాన్యం తగ్గించి.. కొడుకును వీలైనంతగా ప్రొజెక్టుచేయాలని చూస్తున్నారు కేసీఆర్. అంతేగాక వీలైనంతగా ప్రజల్లో పట్టు […]
ఫ్యామిలీ విషయంలో పవన్ – తారక్ ఒకటేనా..!
వాళ్లిద్దరూ పెద్ద కుటుంబాలకు చెందినవారు. ఒకరు సినీ హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మరొకరు రాజకీయం, సినీ నేపథ్యం కలగలసిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్దరూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. పరిస్థితులు ఇద్దరినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చర్చ మొదలైంది. వీరిని గమనిస్తే..ఇద్దరిలోనూ చాలా కామన్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బలమైన […]
బాబుపై జోకులేసుకుంటున్న అధికారులు
`నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను` ఇదీ క్లుప్తంగా సీఎం చంద్రబాబు థియరీ! 2014 ఎన్నికల సమయంలో `నేను మారాను` అన్నారు. `గతంలో చూసిన నేను వేరు.. ఇప్పుడు నేను వేరు` అని స్పీచ్‌లు ఇచ్చారు. `గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయను` అని హామీ ఇచ్చారు. అంతా నమ్మారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులు, అధికారులకు తిప్పలు రెట్టింపు అయ్యాయి. వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. నెమ్మదిగా చంద్రబాబు ఉపన్యాసాలకు అలవాటు పడిపోయిన వీరు ఇప్పుడు […]
పవన్ రివర్స్ గేర్..!
కాటమరాయుడు తర్వాత పవన్ వరుసగా తన సినిమాలను పట్టాలెక్కించేందుకు స్పీడ్‌గేర్‌లో దూసుకు వెళుతున్నాడు. కాటమరాయుడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పట్టాలెక్కించిన పవన్ ఈ సినిమా తర్వాత నీశన్ డైరెక్షన్‌లో వేదాళం మూవీ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రభస, హైపర్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో రీమేక్‌కు ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ వరుసగా రీమేక్‌లు, అది కూడా అంతగా ఫామ్‌లోలేని […]
కర్ణాటకలో బీహార్ ఫార్ములా: కాంగ్రెస్+జేడీఎస్ పొత్తు
బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేసేందుకు కర్ణాటకలో బీహార్ ఫార్ములా అమలు కాబోతుందా ? ఎట్టి పరిస్థితుల్లోను కర్ణాటకలో కాషాయ జెండా ఎగరకుండా ఉండేందుకు… సెక్యులర్ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ, జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోనున్నాయా ? ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లోనే ఉండేవారు. దేవగౌడతో తీవ్రస్థాయిలో విబేధాలు రావడంతో ఆయన కాంగ్రెస్‌లో […]
క్రైసిస్‌లో టీడీపీ.. కారణాలు ఇవేనా..?
ఏపీ సీఎం చంద్రబాబు కుల సమీకరణాలు తప్పాయి! ప్రాంతాల వారీగా సమన్యాయం పాటించామని చెబుతున్న ఆయన లెక్కలు ఎక్కడో బెడిసికొట్టాయి! మంత్రి వర్గవిస్తరణలో నూటికి నూరు శాతం అన్ని వర్గాలకు న్యాయం చేశామని, లెక్కలన్నీ పాటించానని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నా.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు మార్కులు వేసేందుకు వెనుకాడుతున్నాయి. మొత్తానికి ఏపీ క్యాబినెట్ విస్తరణతో రేగిన అలజడి నివురుగప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతోంది. రెండేళ్లలో ఎన్నికలు ఉన్నతరుణంలో పార్టీలో ఈ సంక్షోభం.. ప్రతిపక్షాలకు […]
దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచర్ ఏంటి..!
ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాదు అప్పట్లో సమైక్యాంధ్రలోనే కాకలు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఈ రోజు ఆకస్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఓసారి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడాపనిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994లలో టీడీపీ తరపున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయేంత వరకు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ తర్వాత […]