దేశ భాషలందు తెలుగు లెస్స! అన్న కృష్ణదేవరాయులు.. తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రమనే పేరును చంద్రబాబు ప్రభుత్వం తుడిచి పెట్టేయాలని చూస్తోందనే విమర్శలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగవుతున్న భాషల్లో ఒకటిగా ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్న విషయం తెలిసింది. అలాంటి సమయంలో మరింతగా తెలుగును పోషించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. […]
Category: Latest News
జగన్‌కు ఈడీ టెన్షన్… డేట్ ఫిక్స్..!
2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అధికార పక్షం అపరేషన్ ఆకర్ష్ కు మరోసారి తెరతీసింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే జగన్ ఆశలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీళ్లు చల్లేందుకు సిద్ధమవుతోంది. ఆయన ఆక్రమాస్తుల కేసులను వేగవంతం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఈడీ పిలుపందుకున్నారు. దీంతో జగన్‌కు షాక్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు […]
యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్తరాఖండ్ – గోవా -మణిపూర్- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఇప్పుడు అందరి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఎన్నికల వేళ యూపీలో రాజకీయ పరిణామాలు సడెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మధ్య తీవ్రస్థాయిలో వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎస్పీ […]
గంటా మంత్రి పదవికి అదే శ్రీరామరక్ష
ప్రభుత్వంలో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే చాలు ప్రతిపక్ష నేతలు ఇక తమ నోటికి పనిచెబుతారు. అలాగే పేపర్లలోనూ వారికి సంబంధించిన వాటినే ప్రధానంగా ప్రచురిస్తాయి. ఇక టీవీల్లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు ఏపీలో ఒక మంత్రే కేసులో ఇరుక్కుంటే.. ప్రతిపక్షాలు కిక్కురుమనడంలేదు. పత్రికల్లో ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా కనిపించడంలేదు. అయితే ఇందుకు ఆయన కులమే శ్రీరామరక్షగా మారిందని… అందుకే ధైర్యం చేసి ఎవరూ విమర్శలు చేయలేకపోతున్నారని సమాచారం. ఈ […]
తెలంగాణలో కేసీఆర్ టార్గెట్‌గా మహాకూటమి
తెలంగాణలో సీఎం కేసీఆర్ బలమైన రాజకీయ నేతగా మారిపోయారు. ప్రతిపక్షంలో తనను ఢీ కొట్టే నేతలెవరూ లేకుండా చేయడంలో విజయం సాధించారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి రాజకీయ శక్తిగా అవతరించారు. కేసీఆర్‌పై పోరాడేందుకు ప్రతిపక్షాలకు కోదండాస్త్రం అనే ఆయుధం దొరికింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంను ముందుంచి కేసీఆర్‌తో యుద్ధం చేసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఆయన నేతృత్వంలో ఒక మహా కూటమి ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల్లో […]
మోత్కుపల్లి కొత్త ఆశలు
కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ డైరీలు తెరిచేసి.. ఈ సంవత్సరంలో ఏమేం చేసేయాలి? ఏమేం సాధించేయాలి? వంటి అనేకానేక విషయాలను పుంఖాను పుంఖానులుగా నింపేసే ఉంటారు. ఇప్పుడు ఇదే జాబితాలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేరిపోయారు. అయితే, ఆయనేమీ కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త ఆశలతో తన డైరీని నింపేసుకోలేదు! కేవలం తనకున్న ఏకైక పాత కోరిక, ఎడతెగని దూర…. ఆశను మాత్రమే డైరీలో మరోసారి రాసేసుకుని.. నీళ్లు రాని […]
చంద్రబాబుపై మంత్రులకే ఆశల్లేవా..!
సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పుడు స్వపక్షంలోనే ఆశలు మృగ్యమవుతున్నాయి. మంత్రులు స్థాయిలోనే సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నా.. చాలా మంది మాత్రం తన అనుచరుల వద్ద పంచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బాబు పాత్ర కన్నా.. చినబాబు పాత్ర ఎక్కువైందని కొందరు అంటుంటే.. మరికొందరు మంత్రి వర్గాన్ని బాబు పట్టించుకోవడం లేదని, కేవలం ప్రచారం పైనే దృష్టి పెడుతున్నారని గుసగుసలాడుతున్నారు. ఇదే బాటలో ఐఏఎస్‌లూ ఉన్నారు. […]
సూపర్ థ్రిల్లర్ సినిమాలా డీఎంకే పాలిటిక్స్
తమిళనాడు ప్రజలు.. థియేటర్లకు వెళ్లకుండానే రోజుకో కొత్త సినిమా చూసేస్తున్నారు! నిజమా?! అని బుగ్గలు నొక్కుకోవాల్సిన పనిలేదు. తమిళనాడులో గత నెల రోజులుగా జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు నిజంగానే జనాలకి సినిమా మీద సినిమా చూపించేస్తున్నాయి. పురుట్చితలైవి.. అమ్మ జయలలిత మరణం, ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య పన్నీర్ సీఎం కావడం తెలిసిందే. అయితే, ఆ సీఎం సీటు కోసం అమ్మ నెచ్చెలి తన స్టైల్లో పావులు కదపడం నిన్నటి వరకు హాట్ టాపిక్. ఇక, […]
బాబుకు ఓపెన్ షాక్ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యే
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది! దాదాపు రెండున్నరేళ్ల పదవీ కాలంలో కనీసం రెండు వేల బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఉంటారని ఓ అంచనా ఉంది. అలా అన్ని సభల్లోనూ పాల్గొన్నా ఆయన ఏనాడూ కంగు తినలేదు సరికదా.. ఆయన మైకుకి, ఆయన మాటకు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అలాగే అన్ని సభలూ కూడా ఒకేలా ఉండవు! బహుశ ఈ విషయాన్ని బాబు ఊహించి ఉండరు. […]