నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీచేయాలనే అంశంపై టీడీపీలో కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. తమ వర్గానికి కేటాయించాలని మంత్రి అఖిలప్రియ వర్గం.. తమ వర్గానికే కేటాయించాలని శిల్పా వర్గం పట్టుబట్టడంతో.. ఇప్పటివరకూ కొంత అనిశ్చితి నెలకొంది. అంతేగాక ఈ విషయంలో అధినేత చంద్రబాబు కూడా టెన్షన్ పడ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. శిల్పా, భూమా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వర్గాలను ఒకే […]
Category: Latest News
కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే
రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడపై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు. అంతేగాక ఇప్పటి నుంచే ఇందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారుచేయాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటినుంచే వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించి.. ఎలాగైనా విజయవాడలో క్లీన్ […]
ఆ జిల్లాలో జనసేన వైపు వైసీపీ క్యాడర్
ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. ఇప్పుడు జనసే కూడా రంగంలోకి దిగడంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్రస్తుతం వైసీపీకి పోటీగా జనసేన సిద్ధమవుతుండటంతో వైసీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న కేసులు, ప్రజల్లో ఆయనకు తగ్గుతున్న ఆదరణతో వీరిలో కలవరం మొదలైందట. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్‌కు […]
తెలంగాణలో బద్ధశత్రువుతో టీటీడీపీ దోస్తీ ..!
కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీతో మైత్రి కొనసాగుతున్నా.. ఎప్పుడు కమలనాథులు కటీఫ్ చెప్పేస్తారో తెలియని పరిస్థితి. దీంతో తమ మనుగడ కాపాడుకునేందుకు సరికొత్త పొత్తుల కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శత్రువులతోనూ చేతులు కలిపేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మరో అడుగు ముందుకేసి చర్చలు కూడా ప్రారంభించిందని సమాచారం! శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాలని డిసైడ్ అయిపోయింది. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో కూడా దోస్త్ మేరా […]
టీఆర్ఎస్‌లో రోజు రోజుకు హరీశ్‌కు మైనస్సే
తెలంగాణ సీఎం కేసీఆర్ గీసిన గీత దాటని వ్యక్తి.. పార్టీకి వచ్చిన ఎన్నో సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించిన నాయకుడు.. ఎక్కడ ఏఎన్నిక జరిగినా.. ఎంత కష్టమైన బాధ్యతలు అప్పగించినా.. తన వ్యూహాలతో విజయాలను అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క హరీశ్‌రావు మాత్రమే!! ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతున్నా.. నేతలు వాటిని కొట్టిపారేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి వరంగల్ సభలో […]
సుజనా కేంద్రమంత్రి పదవికి గండం
ఎన్నో కీలక నిర్ణయాలతో, పథకాలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీ.. మరో కీలక నిర్ణయానికి జూలైలో శ్రీకారం చుట్టబోతున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటి వరకూ ఒకే ఒక్కసారి మంత్రి వర్గ విస్తరణ చేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. దీంతో కొంతమంది కేంద్ర మంత్రుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ, ప్రస్తుతం కేంద్రమంత్రి సుజనా చౌదరి ఈ విషయంలో మరింత కంగారు పడుతున్నారట. గతంలో ఒకసారి విస్తరణ జరిగినా.. […]
ఆ రెడ్డి నాయకుడే టి కాంగ్రెస్ సీఎం?!
ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు ఉంది టికాంగ్రెస్ పరిస్థితి. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండగానే.. సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైపోయింది. సీఎం అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్నపాలు కూడా వెళుతున్నాయట. అంతేగాక సీఎం అభ్యర్థి ఎవరో తేలితేగాని ఒప్పుకోమని కార్యకర్తలు కూడా పట్టుదలతో ఉన్నారట. మరి నాయకులే తొందరపడుతున్నారో.. లేక కార్యకర్తలే తొందర పడుతు న్నారో తెలియదు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ […]
ఆ నలుగురు టీడీపీ ఎంపీలకు ప్రజాసేవ నై…వ్యాపారాలే జై
టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]
బాహుబలిపై కేసీఆర్ కక్ష తీర్చుకున్నాడా..!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? తెలుగు సినిమా గురించి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వేనోళ్ల పొగుడుతున్న వేళ.. టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ సినిమా విషయంలో కాస్త డిఫరెంట్‌గా ప్రవరిస్తున్నారా ? అన్న సందేహాలు అందరి మదిలోను కలుగుతున్నాయి. మొన్నటికి మొన్న `గౌతమీపుత్ర శాతకర్ణి` సినిమాకు, అంతకుముందు రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు `బాహుబలి-2` సినిమాకు రాయితీలు ఇవ్వకపోవడంతో […]