క‌ల‌క‌లం: వైసీపీలోకి కేశినేని నాని..!

ఈ వార్త‌లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే విజ‌య‌వాడ‌లోని ఓ వ‌ర్గం నాయ‌కులు మాత్రం ఇదే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ చేప‌ట్టిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొత్త నాయ‌కులు, పాత నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో పాత టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో […]

ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌న్నీ.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్థానంలో మ‌రో కొత్త‌వారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హ‌స్తిన రాజ‌కీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్క‌డే బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీల వ్యూహం వ్యూహాత్మ‌కంగా సాగుతోంది! క‌ర‌డుగ‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్ద‌రూ త‌మ‌కు అనుకూలురైన వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కూర్చోపెట్టాల‌ని భావిస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్డీయే […]

రాజ‌కీయాల్లో కొత్త సంస్కృతికి తెర‌తీసిన జ‌గ‌న్‌

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజ‌య‌తీరాల‌కు చేర్చాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్ర‌శాంత్ కిశోర్‌ను ప‌క్క‌న‌పెట్టుకున్నారు. ఆయ‌న రాక‌తో వైసీపీకి తిరుగులేద‌ని నేత‌లు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న ప‌ని మొద‌లుపెట్టేశారు. సంప్ర‌దాయాల‌కు భిన్నంగా స‌రికొత్త పంథాలో వెళుతుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ శిబిరాలు, మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా […]

చంద్ర‌బాబు వ‌ద్ద మూడు పంచాయితీలు

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్క‌డ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువ‌వ్వ‌డంతో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే క‌ర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్ర‌బాబు వ‌ద్ద చ‌ర్చ‌కు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌నేది ఇంకా తేల‌లేదు. ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ […]

గుంటూరు జిల్లాలో ఆ సీటు జ‌న‌సేన‌దేనా..?

ఏపీలో జ‌న‌సేన బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెల‌వ‌క‌పోయినా గ‌ణ‌నీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎన్నిక‌ల రంగంలో ఉండ‌డంతో మ‌రోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం జిల్లాలో జ‌న‌సేన ఊపు అంత‌గా లేక‌పోయినా ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తా చాటే […]

టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైందా..!

తెలుగు రాష్ట్రాల్లో క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్న‌గారి హ‌యాం నుంచి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామ‌ర‌స్య పూర్వ‌కంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవ‌డం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే ప‌రిష్క‌రించుకోవ‌డం పార్టీ ఆన‌వాయితీ. ఇక‌, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై అయితే, మ‌హానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేత‌ప్ప ఇత‌ర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. […]

ఇదంతా అఖిల ప్రియ నిర్వాక‌మేన‌ని టీడీపీ నేత‌లు గుర్రు

ప‌ద‌విని చేప‌ట్టి ఏడాదైనా పూర్తికాకుండానే ప‌ర్యాట‌క శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ.. తీవ్ర అసంతృప్తిని మూట‌గ‌ట్టుకున్నారా? ఆమెకు జై కొట్టిన నేత‌లు, నోళ్లే.. ఇప్పుడు ఆమెను విమ‌ర్శిస్తున్నారా? సొంత జిల్లా క‌ర్నూలు టీడీపీలోనే మంత్రి గారి వ్య‌వ‌హార శైలిపై నేత‌లు నొచ్చుకుంటున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. యువ మ‌హిళా మంత్రిగా బాబు కేబినెట్‌లో సీటు పొందిన భూమా కుమార్తెకు స్టార్టింగ్‌లో సొంత జిల్లాలో నేత‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. […]

తెలంగాణ‌లో బాబు దుకాణం బంద్!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ప‌రిస్థితి మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణంలో మాత్రం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది! జాతీయ పార్టీగా అవ‌త‌రించి.. నేష‌న‌ల్ లెవ‌ల్ లో చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, అనూహ్యంగా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప‌క్క‌రాష్ట్రం అందునా హైద‌రాబాద్‌ను నేనే డెవ‌లప్ చేశాన‌ని ప‌దేప‌దే చెప్పుకొనే బాబుకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని నిలుపుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. విష‌యం లోకి వెళ్తే.. తెలంగాణలో టీడీపీ […]

మంత్రుల‌ మ‌ధ్య వార్‌.. మ‌రింత పెరుగుతోంది!

టీడీపీ మంత్రులు అయ్య‌న్న‌, గంటాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం మ‌రింత‌గా రాజుకుంది. విశాఖ‌లో భూ కుంభ‌కోణాల‌పై త‌లెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయ‌న దాకా చేర‌డం, దీనిపై సిట్ వేయ‌డం, అదీకాక‌, పార్టీ ప‌రంగా ఇద్ద‌రు మినిస్ట‌ర్ల మ‌ధ్య ఎందుకు వివాదం రేగిందో ప‌రిశీలించేందుకు త్రిస‌భ్య క‌మిటీని కూడా నియ‌మించ‌డం యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రిగిపోయింది. దీనికి ముందు ప‌రిణామాలు చూస్తే.. అయ్య‌న్న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ విశాఖ భూముల‌పై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు […]