నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో శిల్పా ప్ర‌ధాన అస్త్రం

భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్ర‌ధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగ‌బోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయ‌కులు.. ఇలా టీడీపీ బ‌ల‌గ‌మంతా నంద్యాల‌లోనే మోహ‌రించేశారు. కానీ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మాత్రం త‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజ‌యం త‌న‌వైపే ఉంటుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకు న్నారు. ప్ర‌జ‌లు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. గ‌తంలో చిన్న చిన్న త‌ప్పిదాల వ‌ల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]

బీజేపీని వ‌దిలించుకునే య‌త్నాల్లో బాబు

నంద్యాల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా.. ఇప్ప‌టికీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌చారంలో క‌నిపించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో.. వీటికి తెరదించాల‌ని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే ఎడ‌మొహం.. పెడ‌మొహంగా ఉంటున్న నేత‌ల్లో మ‌రోసారి విభేదాలు వ‌చ్చేలా చేస్తోంది. వైసీపీతో జ‌త క‌ట్టేందుకు బీజేపీ నేత‌లు సుముక‌త వ్య‌క్తంచేస్తున్న త‌రుణంలో.. టీడీపీ అధినేత ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీని వ‌దిలించుకునే భాగంలో.. […]

వైసీపీ వాస‌న‌లు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్యే తీవ్ర పోటీ జ‌రిగిందనే విష‌యం తెలిసిందే! కానీ ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున క‌ర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌నే అంశం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న కూతురికి ఆ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న సీఎంను కోర‌డం.. ఆయ‌న స‌సేమిరా అన‌డం ఇవ‌న్నీ జ‌రిగిపోయాయ‌ట‌. గత ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ […]

కేసీఆర్‌కి స‌రైన మొగుడు ఈయనేనా?

తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు మొగుడు రెడీ అయ్యాడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం స‌హా ఇటు మాస్ అటు క్లాస్ ఇమేజ్ ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ రాం ఇప్పుడు కేసీఆర్‌కు మొగుడుగా మారారు. రాష్ట్రంలో విప‌క్షాలు చేయ‌లేని ప‌ని ఇప్పుడు ఏ పార్టీకీ చెంద‌ని కోదండ‌రాం చేస్తున్నారు. కేసీఆర్ నిత్యం నెత్తిన కుంప‌టిలా త‌యార‌య్యాడు ఈయ‌న‌. కేసీఆర్ అవ‌లంబిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై కోదండ‌రాం ఉద్య‌మానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తో […]

జ‌లీల్ ఖాన్ మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యాడుగా!

జ‌లీల్ ఖాన్‌. దాదాపు ఈ పేరు ఇటీవ‌ల కాలంలో పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేకుండానే పోయింది. వైసీపీ త‌ర‌ఫున 2014లో విజ‌య‌వాడ ప‌శ్చిమం నుంచి గెలిచి.. ఆత‌ర్వాత బాబు మంత్రి ప‌ద‌వి హామీతో సైకిలెక్కిన జ‌లీల్‌.. అనూహ్యంగా ఓ టీవీ రిపోర్ట‌ర్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ.. ఏం చ‌దువుకున్నార‌న్న ప్ర‌శ్న‌కు బీకాం అని జ‌వాబిచ్చాడు. అంత‌టితో ఆగ‌కుండా బీకాంలో ఫిజిక్స్ అంటే త‌న‌కు బాగా ఇష్ట‌మ‌ని, అంద‌రూ త‌న‌నే మెచ్చుకునే వారి పెద్ద ఎత్తున ఊద‌ర గొట్టాడు. అదేంట్సార్ బీకాంలో […]

వైసీపీకి మ‌రో షాక్ కీల‌క వికెట్ డౌన్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయ‌న బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో […]

అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు అగ్ని ప‌రీక్ష ..నేత‌ల‌కు చెమ‌ట‌లు!

రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో క్రియా శీల‌కంగా ఉండే కాకినాడ కార్పోరేష‌న్‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ఇక్క‌డ అనేక మ‌లుపులు తిరిగిన రాజ‌కీయాలు ఇప్పుడు ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్ర‌ధాన ప‌క్షాలైన వైసీపీ, టీడీపీల‌కు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే చెమ‌ట‌లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేష‌న్‌లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. వివాదాస్ప‌దంగా మారిన […]

చింత‌ల‌పూడిలో టీడీపీ, వైసీపీకి కొత్త క్యాండెట్లేనా..!

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితేనే టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్ల‌లోను టీడీపీయే గెలిచింది. ఈ జిల్లాలో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఓ ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఇది కంచుకోట‌గా నిలుస్తూ వ‌స్తోంది. ఆ పార్టీ ఇక్క‌డ 2004, 2009లో ఓడిపోయినా 1600, 1100 ఓట్ల స్వ‌ల్ప తేడాతోనే సీటును కోల్పోయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం మాజీ మంత్రి పీత‌ల […]

పీకే స‌ల‌హా.. వాడుకుని వ‌దిలేయ‌డ‌మే!

ఏపీ విప‌క్షం వైసీపీలో ఇప్పుడు నేత‌ల‌కు కంటిపై కునుకు క‌రువ‌వుతోంది. ప్ర‌స్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జ‌గ‌న్‌కి అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డి, ఆయ‌న క‌ష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా న‌ష్ట‌పోయి కూడా పార్టీలోనే కొన‌సాగ‌తున్న వారికి అస్స‌లు నిద్ర ఉండ‌డం లేద‌ట‌! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో న‌ని వారు తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్లే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించి తాను అధికారంలోకి రావాల‌ని ప్లాన్ […]