నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్రబాబు ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్షానికి పరిమితమైన ఆయన ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది సీనియర్లను వదులుకున్నారు. కొందరు పార్టీలు మారిపోతే, మరి కొందరు రాజకీయాల నుంచి నిష్క్రమించడం లేదా మరణించడం జరిగాయి. 2004లో టీడీపీ చరిత్రలోనే ఘోర పరాజయం చూసింది. 2009లోను ముక్కోణపు పోటీలో మరోసారి వరుసగా ఓడింది. ఇక 2004కు ముందు వరకు చంద్రబాబు పాలన అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]
Category: Latest News
మైలవరంలో ఉమాకు యాంటీ…నియోజకవర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్
ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం మసకబారుతున్నట్టే కనపడుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్‌గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటికల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైలవరంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచి […]
జగన్ సీఎం అయితే రోజా ఆ కీలక శాఖకు మంత్రా..!
రోజాకు చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. చంద్రబాబు రోజాను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చేసి ఆమె తన వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ పదవితో రోజా స్టేట్ వైడ్‌గా హైలెట్ అయ్యింది. తర్వాత రోజాకు చంద్రబాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో నగరి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్కడ గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం ఆమెను చంద్రగిరికి […]
మరో అద్భుత రత్నం మరిచిపోయిన జగన్
`ప్రత్యేక హోదా కోసం చివరి వరకూ పోరాడతాం, ఎంపీలతో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిపక్ష నేత జగన్ పదేపదే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామని మాట ఇచ్చి.. తర్వాత దానిని తుంగలో తొక్కిన బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయన పదేపదే ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీనరీ వేదికగా ప్రజలకు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత.. ఇప్పుడు హోదా అంశాన్ని పక్కన పెట్టేశారనే విమర్శలు […]
పవన్ కూడా రెడీ..!
ఏపీలో ప్రతిపక్ష నాయకులకు పాదయాత్రలు బాగానే కలిసొస్తున్నాయి. గతంలో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2003లో పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి గత ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మధ్యలో జగన్ జైలులో ఉన్నప్పుడు సోదరి షర్మిల పాదయాత్ర చేసినా ఆమె పాదయాత్రకు జనాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విపక్ష వైసీపీ అధినేత ప్లీనరీ సాక్షిగా తాను పాదయాత్రకు రెడీ […]
జగన్ పథకాలతో బాబుకు చెమటలు పడుతున్నాయా
ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించేశారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాలు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు తగిన ప్రణాళిక కూడా ప్రకటించేశారు. అయితే ప్రతిపక్ష నేత ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద, బడుగు వర్గాలకు చేరువయ్యేందుకు 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]
వాటి ముందు బాబు అనుభవం బలాదూర్
క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్రబాబు కూడా పరిష్కరించలేనంత స్థాయిలో అంతర్గత పోరు నడుస్తోంది. రాజకీయంగా బలపేందుకు ప్రతిపక్ష వైసీపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేసుకున్నారు. అప్పుడు రేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వీటిని చల్లార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. వారిని పార్టీ చేర్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయిన చంద్రబాబు.. వారి చేరికతో వచ్చిన విభేదాలు, […]
ప్లీనరీలో రోజా పంచ్‌లే హైలెట్
అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్లీనరీలో జగన్ ప్రకటించిన కొత్త పథకాలు ఏపీ ప్రజల్లోకి వెంటనే చొచ్చుకుపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మంచి జోష్‌లో ఉన్నారు. ఇక ఈ ప్లీనరీలో వైసీపీ ఫైర్‌బ్రాండ్ లేడీ, నగరి ఎమ్మెల్యే రోజా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్లీనరీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రోజా మామూలుగానే […]
వైసీపీ ప్లీనరీ ప్లాపా..హిట్టా..యావరేజా..!
స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజమై ఉన్న క్యాడర్‌లో `నవ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీనరీ వేదికగా అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాడు. ఎన్నికల హామీలు రెండేళ్ల ముందుగానే ప్రకటిస్తూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ప్లీనరీ సూపర్ హిట్ అయిందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇది కేవలం చంద్రబాబును తిట్టడానికేనని, ఇది అట్టర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీనరీ మాత్రం యావరేజ్ అని విశ్లేషకులు అంచనా […]